Just SportsLatest News

IND vs BNG : భారీ విజయమే లక్ష్యం..బంగ్లాతో భారత మహిళల పోరు

IND vs BNG :సెమీఫైనల్ చేరటానికి భారత్‌కు ఈ మ్యాచ్‌లో భారీ విజయం కీలకంగా మారింది. ఎందుకంటే ప్రస్తుత వరల్డ్ కప్ నిబంధనల ప్రకారం ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్లు మాత్రమే ముందంజ వేస్తాయి.

IND vs BNG

మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. మాంచెస్టర్ వేదికగా గురువారం బంగ్లాదేశ్ తో తలపడబోతోంది. సెమీఫైనల్ చేరేందుకు ఈ మ్యాచ్ లో భారీ విజయం భారత్ కు కీలకంగా మారింది. ఎందుకంటే ప్రస్తుత వరల్డ్ కప్ నిబంధనల ప్రకారం ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్లు మాత్రమే ముందంజ వేస్తాయి.

అందుకే ప్రతీ మ్యాచ్ లో గెలుపు చాలా అవసరం. ఆరంభంలో పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను చిత్తు చేసిన భారత మహిళల జట్టు మూడో మ్యాచ్ లో ఓడిపోయింది. ఆ ఒక్క ఓటమి టీమిండియా సెమీస్ అవకాశాలను దెబ్బతీసింది. ఇదే గ్రూపులో ఆస్ట్రేలియా నాలుగుకు నాలుగింటిలోనూ విజయాలు అందుకుంది. అటు భారత్. సౌతాఫ్రికా జట్లు కూడా రెండేసి విజయాలతో సమానంగా ఉన్నాయి.

అయితే రన్ రేట్ పరంగా టీమిండియాదే పైచేయిగా ఉంది. దీంతో సౌతాఫ్రికా, భారత్ మధ్య మరో సెమీస్ బెర్తు కోసం పోటీ నెలకొంది.భారత్‌ ఇంకా బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాలపై ఆడాల్సి ఉంది. ఈ రెండూ గెలిస్తే ఎలాంటి టెన్షన్ లేకుండా సెమీస్‌కు చేరుకోవచ్చు. ఒక్కటి ఓడినా.. నెట్ రన్ రేట్ కీలకమవుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడు బంగ్లా(IND vs BNG)పై భారీ విజయం సాధించాల్సిందే.

బ్యాటింగ్ పరంగా ప్రస్తుతం జట్టులో షెఫాలీ , స్మృతి వీరిద్దరిపైనా ఎక్కువగా భారత్ ఆధారపడుతోంది.ఆఖర్లో రిచా ఘోష్‌ దూకుడుతో మెరుపులు మెరిపిస్తోంది. అయితే మిడిలార్డర్ వైఫల్యం భారత్ కు ఇబ్బందిగా మారింది. జెమిమా వంటి బ్యాటర్ కూడా బ్యాట్ కు పనిచెప్పాల్సిందే. అటు కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కూడా భారీ ఇన్నింగ్స్‌ బాకీ ఉంది.

మరోవైపు బౌలింగ్ లో స్పిన్నర్లు రాణిస్తున్నా పేసర్లు నిరాశ పరుస్తున్నారు. స్పిన్నర్ల ప్రదర్శనతోనే తొలి రెండు మ్యాచ్ లలోనూ విజయాలు నమోదు చేసింది.టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంకుకు చేరిన తెలుగు అమ్మాయి శ్రీ చరణి మూడు మ్యాచుల్లోనూ అదరగొట్టింది. మొత్తం 10 వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ వరల్డ్‌ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీచరణి టాపర్ గా ఉంది.

IND vs BNG
IND vs BNG

దీప్తి శర్మ ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన మినహా.. మిగతా రెండింట్లో ప్రభావం చూపించలేదు. పేసర్లు కూడా రాణించడం లేదు. శ్రీచరణికి తోడు దీప్తి శర్మ, మరో పేసర్ రాణిస్తే భారత్ బంగ్లా(IND vs BNG)పై భారీ విజయాన్ని అందుకోవచ్చు. అలాగే భారత ఫీల్డింగ్ మెరుగుపడాలి.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కాప్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడవడంతో టీమ్‌ఇండియాకు ఓటమి తప్పలేదు. ఫీల్డింగ్‌లోనూ గొప్ప ప్రదర్శన చూపించకపోవడం విమర్శలకు దారితీసింది. తదుపరి మ్యాచ్‌లోనూ ఫీల్డింగ్‌ మెరుగు కాకపోతే భంగపాటు తప్పదు.

Minister Anam : సాయిబాబా ఆలయాల వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన మంత్రి ఆనం.. బాబా భక్తులకు క్షమాపణలు

Related Articles

Back to top button