Just SportsLatest News

Vaibhav : వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్..ఐర్లాండ్ సిరీస్ టికెట్లకు ఫుల్ క్రేజ్

vaibhav : ఏడాది కాలంగా భారత క్రికెట్ లో సంచలనాలకు చిరునామాగా మారిన వైభవ్ ఇప్పుడు తొలిసారి టీమిండియా తరఫున అరంగేట్రం చేయబోతున్నాడు

Vaibhav

సాధారణంగా భారత క్రికెట్ జట్టు ఎక్కడ ఆడినా అభిమానులు భారీగానే తరలివస్తుంటారు. విదేశాల్లో సైతం ప్రవాస భారతీయులు టీమిండియా మ్యాచ్ లను స్టేడియాల్లో వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే చిన్న జట్లతో ఆడినప్పుడు మాత్రం అంత క్రేజ్ కనిపించదు. కానీ ఇప్పుడు భారత్, ఐర్లాండ్ సిరీస్ కు ఫుల్ క్రేజ్ నెలకొంది.

టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇంకా అదనపు సీట్లు ఏర్పాటు చేయాలని క్రికెట్ ఐర్లాండ్ కు రిక్వెస్టులు వస్తూనే ఉన్నాయి. ఈ క్రేజ్ కు కారణం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీనే. గత ఏడాది కాలంగా భారత క్రికెట్ లో సంచలనాలకు చిరునామాగా మారిన వైభవ్(vaibhav) ఇప్పుడు తొలిసారి టీమిండియా తరఫున అరంగేట్రం చేయబోతున్నాడు.

ఐర్లాండ్ తో బెల్ ఫాస్ట్ వేదికగా జరగబోయే తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. దీంతో అరంగేట్రంలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బుడ్డోడి బ్యాటింగ్ కోసం అభిమానులే కాదు మాజీ ఆటగాళ్లు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న బెల్ ఫాస్ట్ స్టేడియం కెపాసిటీ కేవలం 7 వేలు మాత్రమే. ఈ టికెట్లలో ఎక్కువ శాతం భారత అభిమానులే కొనేశారు. ఇంకా సరిపోక అదనపు టికెట్లు, సీట్లను ఏర్పాటు చేయాలని ఐర్లాండ్ క్రికెట్ అసోసియేషన్ కు విజ్ఞప్తి చేశారు. వైభవ్ బ్యాటింగ్ చూసేందుకు ఇక్కడి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారని మాజీ క్రికెటర్ , ఐర్లాండ్ మాజీ కోచ్ ఎంవీ నరసింహారావు చెప్పారు.

ఐర్లాండ్ అతని అరంగేట్రం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఐపీఎల్ లో వైభవ్ ఆట ఎంతో బాగుందంటూ కితాబిచ్చారు. అయితే సూర్యవంశీకి అసలు సవాల్ ఇప్పటి నుంచే మొదలవుతోందన్నారు. భారత్ పిచ్ లు ఫ్లాట్ గా ఉంటాయనీ, ఇంగ్లీష్ పిచ్ లు స్వింగ్ కు అనుకూలిస్తుంటాయని గుర్తు చేశారు. వైభవ్ ను అప్పుడే సచిన్ లాంటి దిగ్గజంతో పోల్చవద్దన్నారు.

Vaibhav
Vaibhav

ఇప్పుడిప్పుడే క్రికెటర్ గా రాటుదేలుతున్న వైభవ్ కు ఇంకా ఎంతో కెరీర్ ఉందనీ, అనవసరపు ఒత్తిడి పెంచొద్దని సూచించారు. ఇదిలా ఉంటే వైభవ్ కు తొలిసారి టీమిండియా జెర్సీని బీసీసీఐ అందించింది.

దీనికి సంబంధించిన వీడియో ను అభిమానులతో పంచుకుంది. వైభవ్ 3వ నెంబర్ తో జెర్సీ తీసుకున్నాడు. గతంలో సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ ఇదే నెంబర్ జెర్సీతో ఆడారు. ఇప్పుడు వారు రిటైరవడంతో ఈ నెంబర్ ను వైభవ్ కు కేటాయించారు.

Minister Anam : సాయిబాబా ఆలయాల వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన మంత్రి ఆనం.. బాబా భక్తులకు క్షమాపణలు

Related Articles

Back to top button