Venezuela : భూకంపం వచ్చే ముందే అలర్ట్ చేసిన గూగుల్.. వెనెజువెలా ఘటనతో వెలుగులోకి ఈ టెక్నాలజీ
Venezuela : భూకంప తరంగాల వేగం కంటే కూడా ఇంటర్నెట్ సిగ్నల్ వేగం చాలా ఎక్కువ కాబట్టి, జనాలకు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి కొన్ని సెకన్ల వేల్యుబుల్ టైమ్ దొరికినట్లే అవుతుంది.
Venezuela
వెనెజువెలాలో సంభవించిన వరుస భారీ భూకంపాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. రిక్టర్ స్కేల్‌పై 7.1 , 7.5 తీవ్రతతో వచ్చిన ఈ ప్రకంపనల వల్ల అక్కడ ఎన్నో భవనాలు దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదం జరగడానికి కొన్ని సెకన్ల ముందు చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్ల మొబైల్స్‌కు గూగుల్ నుంచి ఎమర్జెన్సీ మెసేజ్‌లు రావడం ఇప్పుడు వరల్డ్ వైడ్ గా చర్చనీయాంశం అయింది.
గూగుల్ అలర్ట్ వల్లే చాలామంది బిల్డింగ్‌ల నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. భూకంపం(Earthquake) వచ్చిన తర్వాత అక్కడి వారు ఈ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో గూగుల్ అలర్ట్ సిస్టమ్ మ్యాజిక్ ప్రపంచానికి తెలిసింది.
సాధారణంగా మనం వాడే స్మార్ట్‌ఫోన్లలో యాక్సిలరోమీటర్ అనే ఒక చిన్న సెన్సార్ ఉంటుంది. మనం ఫోన్‌ను తిప్పినప్పుడు స్క్రీన్ ఆటోమేటిక్‌గా రొటేట్ అవడానికి ఈ సెన్సారే రీజన్. అయితే ఈ సెన్సార్‌కి భూమి లోపల వచ్చే చిన్న కంపనాలను పసిగట్టే శక్తి కూడా ఉంది.
భూమి లోపల కంపించగానే ఈ సెన్సార్ ఆ ప్రకంపనాలను రికార్డ్ చేసి, లొకేషన్ వివరాలతో పాటు గూగుల్ సర్వర్లకు పంపించేస్తుంది. దీని వల్లే ఒకే ఏరియాలో ఉన్న వందలాది ఫోన్ల నుంచి ఒకే సెకనులో ఇలాంటి డేటా చేరినప్పుడు, ఆ ప్రాంతంలో భూకంపం వస్తోందని గూగుల్ సిస్టమ్ వెంటనే కన్ఫర్మ్ చేసుకుంటుంది.
అలా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉండటంతో, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భూకంప గుర్తింపు నెట్‌వర్క్‌గా మారినట్లుగా వెనెజువెలా(Venezuela) ఇన్సిడెంట్‌తో తేలింది.
ఇక్కడ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే.. భూకంపం సంభవించినప్పుడు భూమి లోపల నుంచి తరంగాలు 2 రూపాల్లో వస్తాయి. మొదటి వాటిని పీ-వేవ్స్ అంటారు. ఇవి చాలా వేగంగా వస్తాయి కానీ ఈ పీ వేవ్స్ వల్ల పెద్దగా నష్టం జరగదు. వీటి వెనుకే నెమ్మదిగా బిల్డింగులను కూల్చేసేంత ప్రమాదకరంగా ఎస్-వేవ్స్ వస్తాయి.
ముందుగా వచ్చే పీ-వేవ్స్‌ను గూగుల్ మొబైల్స్‌లోని సెన్సార్లు గుర్తించి కాంతి వేగంతో ఇంటర్నెట్ ద్వారా గూగుల్ సర్వర్‌కు ఇన్ఫర్మేషన్ ఇచ్చేలా గూగుల్ సెట్ చేసింది. ఆ ఇన్ఫోను విశ్లేషించిన వెంటనే గూగుల్, ప్రమాదకరమైన ఎస్-వేవ్స్ ఆ ప్రాంతాలకు చేరుకునే లోగా అందరి ఫోన్లకు అలర్ట్స్ పంపేస్తుంది.
భూకంప తరంగాల వేగం కంటే కూడా ఇంటర్నెట్ సిగ్నల్ వేగం చాలా ఎక్కువ కాబట్టి, జనాలకు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి కొన్ని సెకన్ల వేల్యుబుల్ టైమ్ దొరికినట్లే అవుతుంది. వెనెజువెలా(Venezuela)లో ప్రజలు ముందుగా అలర్ట్ అయ్యి ప్రాణాలు దక్కించుకోవడానికి ఇదే కారణం.
ఈ ఎర్త్‌క్వేక్ అలర్ట్ సిస్టమ్‌లో గూగుల్ 2 రకాల మెసేజ్‌లను ఇస్తుంది. కేవలం తేలికపాటి కంపనాలు ఉంటే బీ అవేర్ అలర్ట్ .. భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే మొబైల్ స్క్రీన్ అంతా ఎరుపు రంగులోకి మారిపోయి పెద్ద శబ్దంతో ‘టేక్ యాక్షన్ అలర్ట్’ కనిపిస్తుంది.

చివరకు ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నా కూడా ఈ అలర్ట్ సౌండ్ వినబడుతుంది. ఈ మెసేజ్‌పై క్లిక్ చేయగానే భద్రతా సూచనలు, మ్యాప్ వంటి వివరాలు కూడా స్క్రీన్‌పై కనిపిస్తుంటాయి.
ఈ ఫీచర్ భారతదేశంలో కూడా 2023 నుంచే అందరికీ అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సహాయంతో గూగుల్ ఈ సర్వీసును అందిస్తోంది. ఈ ఎమర్జెన్సీ అలర్ట్‌లు రావాలంటే మాత్రం మొబైల్ డేటా లేదా వై-ఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్‌లో ఉండాలి. అలాగే ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎమర్జెన్సీ అలర్ట్స్ విభాగంలో ఎర్త్‌క్వేక్ అలర్ట్ ఆప్షన్‌ను ఆన్ చేసుకోవాలి.
Numerology : ఆకర్షణ, అందం, సంపదకు కేరాఫ్ అడ్రస్ ..నెంబర్ 6 ఉన్నవారు నిజంగానే అదృష్టవంతులా?





