Just Andhra PradeshJust BusinessLatest News

Jonnagiri : బులియన్ మార్కెట్లో ఏపీ నుంచి తొలి బంగారు బిస్కెట్..మరి పసిడి ధరలు తగ్గుతాయా?

Jonnagiri : కర్నూలు జిల్లా జొన్నగిరి నేల పొరల్లోంచి తవ్వి తీసిన అచ్చమైన పుత్తడిని, తాజాగా లేటెస్ట్ టెక్నాలజీతో పూర్తిగా శుద్ధి చేసి నిగనిగలాడే మేడ్ ఇన్ ఆంధ్రా గోల్డ్ బిస్కెట్లుగా బులియన్ మార్కెట్లోకి తెచ్చేశారు.

Jonnagiri

మనం ఇప్పటి వరకూ షాపుల్లో కొనే గోల్డ్ బిస్కెట్ల మీద స్విట్జర్లాండ్, దుబాయ్ అనే విదేశీ ముద్రలు చూశాం. కానీ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఒక గోల్డ్ బిస్కెట్ మీద ఆంధ్రప్రదేశ్ అధికారిక లోగో మెరిసిపోతోంది. అవును.. రాయలసీమ రత్నాల గర్భం అని పెద్దలు ఊరికే అనలేదు.

ఇటీవల కర్నూలు జిల్లా జొన్నగిరి(Jonnagiri) నేల పొరల్లోంచి తవ్వి తీసిన అచ్చమైన పుత్తడిని, తాజాగా లేటెస్ట్ టెక్నాలజీతో పూర్తిగా శుద్ధి చేసి నిగనిగలాడే మేడ్ ఇన్ ఆంధ్రా గోల్డ్ బిస్కెట్లుగా మార్కెట్లోకి తెచ్చేశారు. 100 గ్రాములు, 500 గ్రాముల సైజుల్లో మెరుస్తున్న ఈ తొలి తరం బంగారం బిస్కెట్లు.. కేవలం ఒక మైనింగ్ సక్సెస్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచం దృష్టిని ఆంధ్రా వైపు తిప్పిన ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ అనే చెప్పొచ్చు.

ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌లో బంగారం గనులున్నాయని కేవలం పుస్తకాల్లోనో, వార్తల్లోనో చదవడం తప్ప కళ్లారా చూసింది లేదు. కానీ ఎన్నో ఏళ్ల శాస్త్రీయ పరిశోధనలు, భారీ పెట్టుబడులు, లేటెస్ట్ టెక్నాలజీతో భూమి పొరల్లోంచి తీసిన ఈ బంగారం ఇప్పుడు వాస్తవరూపం దాల్చింది.

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పగానే వ్యవసాయం, సముద్ర సంపద మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు ఏపీ కూడా గర్వంగా బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రాల జాబితాలో చేరిపోయింది. ఈ పరిణామం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుపై కొత్త ఆశలు, సరికొత్త వ్యాపార అవకాశాలు పుట్టుకొస్తున్నాయి.

ఈ వార్త వినగానే ఏపీలోనే బంగారం దొరికింది కదా, మరి ధరలు ఏమైనా తగ్గుతాయా అనే ప్రశ్న తెలుగు రాష్ట్రాల ప్రజలలో వినిపిస్తోంది. అయితే ఈ ఒక్క గని వల్ల దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఒక్కసారిగా పడిపోతాయని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే బంగారం ధరలను డిసైడ్ చేసేది అంతర్జాతీయ మార్కెట్, డాలర్ విలువ, వడ్డీ రేట్లు అలాగే ప్రపంచ దేశాల మధ్య ఉండే పరిస్థితులు.

Jonnagiri
Jonnagiri

అయితే ఏపీలోనే (Jonnagiri)బంగారు గనులు ఉండటం వల్ల మధ్యకాలికంగా, దీర్ఘకాలికంగా చూస్తే మాత్రం మన దేశానికి చాలా మంచి జరుగుతుంది. విదేశాల నుంచి మనం చేసుకునే దిగుమతుల బంగారం భారం కొద్దిగా తగ్గుతుంది. ట్రాన్స్‌పోర్ట్, శుద్ధి ఖర్చులు కలిసిరావడంతో పాటు భారత దేశీ సరఫరా మరింత బలోపేతం అవుతుంది. దీనివల్ల మన విదేశీ మారకద్రవ్యం కూడా ఎక్కువగానే ఆదా అవుతుంది.

ఈ గోల్డ్ ప్రాజెక్ట్ వల్ల కేవలం బంగారం రావడమే కాకుండా.. దీని చుట్టూ ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ నిర్మితం కాబోతోంది. ఈ గనుల వల్ల లోకల్‌గా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రవాణా రంగం, పసిడిని శుద్ధి చేసే అనుబంధ ఇండస్ట్రీలు కూడా బాగా విస్తరిస్తాయి. అంతేకాకుండా ఈ గనుల ద్వారా ఏపీ ప్రభుత్వానికి భారీగా రాయల్టీ, పన్నుల రూపంలో పెద్ద ఎత్తున ఆదాయం సమకూరబోతోంది.

K Bhagyaraj : 80ల నాటి స్క్రీన్ ప్లే రారాజు ఇక లేరు..ప్రముఖ నటుడు, క్లాసిక్ దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత

Related Articles

Back to top button