Ben Stokes : బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం..అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై
Ben Stokes : 35 ఏళ్ల బెన్ స్టోక్స్ 2011లో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2022 నుంచి టెస్టు జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు.
Ben Stokes
ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అభిమానులకు షాకిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అది కూడా న్యూజిలాండ్‌తో చివరి టెస్ట్ మధ్యలో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.
కాగా డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులను ఉద్దేశిస్తూ బెన్ స్టోక్స్(Ben Stokes) మాట్లాడుతున్న వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ స్పీచ్‌లోనే స్టోక్స్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. కెప్టెన్‌గా ఇంగ్లాండ్ తరఫున తాను ఆడే చివరి మ్యాచ్, చివరి రెండు రోజులు ఇవే అంటూ ప్రకటించాడు.
తన రిటైర్మెంట్ వెనుక అసలు కారణాలు త్వరలో వెల్లడిస్తానంటూ స్టోక్స్ చెప్పడం ఆసక్తిని రేకెత్తించింది. జట్టు కోసం తాను ఎన్నోసార్లు శక్తికి తగ్గట్టే పోరాడాననీ, ఇప్పుడు కూడా అదే చేయబోతున్నానంటూ వ్యాఖ్యానించాడు. ప్రతీ ఒక్కరూ జట్టు కోసం పోరాడాలనీ, మిగిలిన రెండు రోజుల్లో అందరికీ చాలా పని ఉందంటూ చెప్పుకొచ్చాడు.
35 ఏళ్ల బెన్ స్టోక్స్(Ben Stokes) 2011లో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2022 నుంచి టెస్టు జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఆల్ రౌండర్‌గా ఎన్నో అద్భుత ప్రదర్శనలతో జట్టుకు విజయాలనందించాడు.
ముఖ్యంగా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో సెంచరీతో ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించిన సందర్భాన్ని అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. వన్డే, టీ20లకు ఎప్పుడో వీడ్కోలు పలికిన స్టోక్స్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకూ 122 టెస్టులు, 114 వన్డేలు, 43 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 7,243 పరుగులు, 252 వికెట్లు పడగొట్టాడు.

ఇదిలా ఉంటే న్యూజిలాండ్‌తో మొదటి టెస్టు తర్వాత నైట్ క్లబ్లో రగ్బీ ప్లేయర్‌తో జరిగిన గొడవే స్టోక్స్ రిటైర్మెంట్కు ప్రధాన కారణమని భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు జరిపిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనిపై చర్యలు తీసుకుంది.
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ నుంచి స్టోక్స్‌ను పక్కన పెట్టింది. మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ విశ్లేషణ ప్రకారం, నైట్‌క్లబ్ ఘటన తర్వాత బోర్డు పెద్దలకు, స్టోక్స్‌కు మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. బోర్డులోని కొందరు తనపై కావాలనే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని స్టోక్స్ ఆరోపించడం మరింత ఆజ్యం పోసింది. దీంతో పాటు బిజిబిజీ క్రికెట్ షెడ్యూల్, కెప్టెన్సీ బాధ్యతల ఒత్తిడి వల్ల ఇకపై అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగే ఓపిక, ఉత్సాహం బెన్ స్టోక్స్‌లో తగ్గిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Sheikh Hasina : చావు అంటే భయం లేదు..బంగ్లాదేశ్ కు వెళతానంటున్న షేక్ హసీనా





