Just SportsLatest News

Gambhir : మేల్కోకుంటే కష్టమే..గంభీర్ కు అసలైన పరీక్ష

Gambhir : ఇంగ్లాండ్‌లో వాతావరణం తరచూ మారుతుంటుంది. మబ్బులు కమ్మినప్పుడు పిచ్ మరింత అనుకూలంగా మారుతుంది. ఈ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి భారత్ వ్యూహాత్మకంగా ఆడాలి.

Gambhir

టీ20 వరల్డ్ ఛాంపియన్స్ టీమిండియాకు ఐర్లాండ్ టూర్ పెద్ద షాకే… సుదీర్ఘమైన ఇంగ్లాండ్ టూర్‌కు ముందు ఇది వార్నింగ్ లాంటిది. పరిస్థితులకు త్వరగా అలవాటు పడకుంటే ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఈ సిరీస్‌తో తేలిపోయింది. మరి ఐర్లాండ్ టూర్ నుంచి భారత్ గుణపాఠం నేర్చుకుంటుందా.. కఠినమైన ఇంగ్లీష్ పిచ్‌లపై గంభీర్(Gambhir) వ్యూహం ఎలా ఉండోబోతోంది ?

ఏ ఆటలోనైనా ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో ఎవ్వరినీ తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రతి జట్టుకూ సొంత బలాలు ఉంటాయన్నది ఐర్లాండ్ సిరీస్‌తో మరోసారి రుజువైంది. పసికూన, చిన్న జట్టు అంటూ భావించిన ఐర్లాండ్ టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ ఛాంపియన్ భారత్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది.

ఒకటి కాదు రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియాను నిలువరించి సిరీస్‌ను స్వీప్ చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా ఓటమి, జట్టు మేనేజ్‌మెంట్‌కు పెద్ద హెచ్చరికగా చెప్పొచ్చు.. బలహీనమైన ప్రత్యర్థిగా భావించి నిర్లక్ష్యం వహించడం, కొత్త పరిస్థితులకు త్వరగా అలవాటు పడకపోవడం ఈ ఓటమికి కారణం. అలాగే రాబోయే ఇంగ్లాండ్ సిరీస్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టి ఐర్లాండ్ జట్టును భారత్ తేలిగ్గా తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే చావుదెబ్బ తినాల్సి వచ్చిందని పలువురు మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు.

ఈ సిరీస్‌లో భారత్ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్లే. బెల్‌ఫాస్ట్ పిచ్‌లు, వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటర్లు తమ ఆటతీరును మార్చుకోవడంలో విఫలమయ్యారు. ఐపీఎల్ తరహా దూకుడును అన్ని పిచ్‌లపై ప్రదర్శించడం సాధ్యం కాదన్న విషయాన్ని అర్థం చేసుకోలేదు. అన్నింటికీ మించి క్రికెట్‌లో ఎప్పుడూ పరిస్థితులకు అనుగుణంగా ఆడాల్సిన అవసరం ఉంటుంది.

అలా కాకుండా ఎప్పుడూ ఒకేలా ఆడటానికి ప్రయత్నిస్తే ఆ వ్యూహం బెడిసికొడుతుంది. ఐర్లాండ్‌తో సిరీస్‌లో అదే జరిగింది. బ్యాటర్లు కాసేపు క్రీజులో నిలబడటానికి కూడా ప్రయత్నించలేదు. అందుకే ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. దీంతో ఇంగ్లాండ్ టూర్ భారత్ బ్యాటర్లకు మరో అగ్నిపరీక్ష కానుంది.

అటు కోచ్ గౌతమ్ గంభీర్(Gambhir) వ్యూహాలకు కూడా ఇంగ్లీష్ పిచ్‌లు సవాల్ విసురుతున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పిచ్‌లు దాదాపు ఒకేలా ఉంటాయి. దీని ప్రకారం చూస్తే ఇంగ్లీష్ పిచ్‌లపై స్వింగ్ ఎలా ఉండబోతుందనేది ఈ పాటికే మన బ్యాటర్లకు అర్థమై ఉండాలి. ఇంగ్లాండ్ గడ్డపై స్వింగ్ బౌలింగ్‌కు అనుగుణంగా బ్యాటింగ్ టెక్నిక్ మెరుగుపరుచుకోవాలి.

అలాగే మిడిల్ ఓవర్లలో పరుగులు సాధించే వ్యూహాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ పిచ్‌లు బంతికి మంచి స్వింగ్, పేస్ అందిస్తాయి. ఆఫ్-స్టంప్ ఆవల పడే బంతులను వదిలేయడం క్రీజులో ఎక్కువ సమయం కుదురుకునే వరకు సంయమనం పాటించడం కీలకం కానుంది.

Gambhir
Gambhir

భారీ షాట్ల కంటే స్ట్రైక్ రొటేట్ చేయడం ఇక్కడ బ్యాటర్లకు కీలకం. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు భారీ షాట్లు ఆడటం కంటే సింగిల్స్ తీస్తూ, స్ట్రైక్ రొటేట్ చేయడం ద్వారా పరుగులు సాధించొచ్చు. అలాగే ఇంగ్లాండ్‌లో వాతావరణం తరచూ మారుతుంటుంది. మబ్బులు కమ్మినప్పుడు పిచ్ మరింత అనుకూలంగా మారుతుంది.

ఈ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి వ్యూహాత్మకంగా ఆడాలి. మొత్తం మీద ఇంగ్లీష్ స్వింగ్ పిచ్‌లకు అనుగుణంగా హెడ్ కోచ్ గంభీర్(Gambhir) మన బ్యాటర్లను ఎలా సన్నద్ధం చేస్తాడనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Date Of Birth : మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈ రోజు ఎలా ఉంది? ఆ రెండు నెంబర్ల వారికి డబ్బే డబ్బు అట..

Related Articles

Back to top button