Hair : జుట్టు విపరీతంగా ఊడుతోందా? స్కాల్ప్‌ను కాపాడుకునే సింపుల్ టిప్స్ ఈ రెండే..
Hair : వర్షా కాలంలో జుట్టు ఎందుకు ఎక్కువగా రాలుతుందో చూడాలి. వానలు పడేటప్పుడు గాలిలో తేమ శాతం విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్లే జుట్టు జిడ్డుగా, చెమట పట్టినట్టు తయారవుతుంది.
Hair
బయట వర్షాలు పడుతుంటే మనసుకు చాలా హాయిగా ఉంటుంది కానీ.. జుట్టుకు మాత్రం రెయినీ సీజన్ ఒక పెద్ద శాపంగా మారుతుంది. ఉదయం నిద్ర లేచాక దిండు మీద, లేదా తల దువ్వుకొనేటప్పుడు రాలిపోతున్న జుట్టును చూసి చాలామంది టెన్షన్ పడిపోతుంటారు.
మిగతా రోజుల్లో నార్మల్‌గా రాలే ఈ హెయిర్.. వర్షాకాలం రాగానే ఎందుకు ఇంతలా రాలిపోతుందో అర్థం కాక బాధపడుతుంటారు. ఇలాంటి టైమ్‌లోనే తలకు నూనె రాసి మసాజ్ చేస్తే సరిపోతుందా లేక మోడ్రన్ హెయిర్ కండిషనర్లు వాడాలా అనే కన్‌ఫ్యూజన్ మొదలవుతుంది.
ముందుగా వర్షా కాలంలో జుట్టు(Hair) ఎందుకు ఎక్కువగా రాలుతుందో చూడాలి. వానలు పడేటప్పుడు గాలిలో తేమ శాతం విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్లే జుట్టు జిడ్డుగా, చెమట పట్టినట్టు తయారవుతుంది.
ఈ జిడ్డుతనం వల్ల జుట్టు కుదుళ్లు లోపల నుంచి చాలా వీక్‌గా మారిపోతాయి. పైగా ఈ వాతావరణంలోని తేమ వల్ల తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చుండ్రు చాలా ఈజీగా పెరుగుతాయి. దీనికి తోడు వర్షపు నీటిలో ఉండే కాలుష్యం, కెమికల్స్ వల్ల కూడా జుట్టు త్వరగా చిట్లిపోవడం, రాలిపోవడం వంటివి జరుగుతాయి.
ఇలాంటి సమయంలో హెయిర్(Hair) ఆయిల్, కండిషనర్ వాడే పద్ధతిని మార్చాల్సి ఉంటుంది. సాధారణంగా నూనె అనేది జుట్టుకు మంచి పోషణను ఇచ్చి బ్లడ్ ప్రెషర్‌ను పెంచుతుంది. కానీ రెయినీ సీజన్‌లో తలకు ఆయిల్ రాసి గంటల తరబడి లేదా రోజంతా అలాగే వదిలేయడం అస్సలు మంచిది కాదు.
ఆ జిడ్డుకు బయట ఉండే దుమ్ము, ధూళి అంతా అంటుకుని చుండ్రు మరింత ఎక్కువవుతుంది. అందుకే హెడ్ బాత్‌కి ఒక గంట, రెండు గంటల ముందే గోరువెచ్చని ఆయిల్‌తో లైట్‌గా మసాజ్ చేసుకుని, ఆ తర్వాత మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు, రెయినీ సీజన్ వల్ల గాల్లో ఉండే తేమ వల్ల జుట్టు ఉబ్బిపోయి, ఒకదానికొకటి చిక్కుబడి గడ్డిలా మారుతుంది. ఇలాంటప్పుడు కండిషనర్ జుట్టుకు ఒక కవచంలా ఉపయోగపడుతుంది.

ఇది వెంట్రుకల పైపొరను సాఫ్ట్‌గా మార్చి తేమను లోపలే లాక్ చేస్తుంది. దీనివల్ల బయట ఉండే పొల్యూషన్ డైరెక్టుగా జుట్టుపై పడకుండా ఉంటుంది కాబట్టి.. ఈ సీజన్‌లో హెయిర్ చిక్కుబడకుండా ఉండటానికి కండిషనర్ వాడటం చాలా అవసరం.
మొత్తంగా ఈ వర్షాకాలంలో జుట్టును కాపాడుకోవడానికి కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఒకవేళ బయటికి వెళ్లినప్పుడు వర్షంలో తడిసి ఇంటికి వస్తే.. వెంటనే నార్మల్ వాటర్‌తో హెడ్ బాత్ చేసి జుట్టును పూర్తిగా ఆరబెట్టుకోవాలి.
అలాగే వర్షాకాలంలో జుట్టు చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. కాబట్టి ఆ టైమ్‌లో అస్సలు దువ్వెన పెట్టకూడదు. తలలో ఎప్పుడూ చెమట, తేమ లేకుండా డ్రైగా ఉంచుకోవడమే ఈ సీజన్‌లో మీ జుట్టును కాపాడుకునే సీక్రెట్ అని తెలుసుకోవాలి.
RSD : ఒకరు నో చెప్తే నరకం కనిపిస్తుందా?..విమర్శలను అస్సలు తట్టుకోలేని RSD మనస్తత్వం..





