Peacock Feather : ఇంట్లో నెమలి పింఛం ఉంచుతున్నారా? మరి వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Peacock Feather : ఒక నమ్మకంతో, ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంపొందించుకోవడానికి నెమలి పింఛాలను ఉంచడం వల్ల మనస్సుకు ఎంతో హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు.
Peacock Feather
నెమలి పింఛం అనగానే మనకు మొదట గుర్తొచ్చేది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎంతో అందంగా కనిపించే ఈ నెమలి పింఛాని(Peacock Feather)కి మన సంప్రదాయంలో ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంట్లో నెమలి పింఛాన్ని(Peacock Feather) ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరిగి, ఇల్లంతా ప్రశాంతతతో నిండిపోతుందని మన పెద్దలు నమ్ముతారు.
నెగటివ్ ఎనర్జీని దూరం చేసి, ఇంట్లోని దోషాలను తొలగించడంలో నెమలి పింఛాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంటిని అందంగా అలంకరించుకోవడంతో పాటు.. మానసిక ప్రశాంతతను పొందడానికి కూడా వీటిని ఒక సులువైన మార్గంగా భావిస్తారు.
ఇంటిలోని వేర్వేరు ప్రదేశాలలో నెమలి పింఛాలను ఉంచడం వల్ల రకరకాల శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఉదాహరణకు, పూజ గదిలో నెమలి పింఛాలను ఉంచడం వల్ల ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందట.

అదే కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండే లివింగ్ రూమ్‌లో వీటిని ఉంచితే, అందరి మధ్య ప్రేమాభిమానాలు పెరిగి సఖ్యత కుదురుతుందట. పిల్లలు చదువుకునే గదిలో లేదా మనం పని చేసే ఆఫీస్ టేబుల్‌పై నెమలి పింఛంను ఉంచడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా వృత్తి ఉద్యోగాల్లో మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇక ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా డబ్బులు దాచుకునే బీరువాలో ఉంచడం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగి ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతారు.
అయితే ఈ విషయాలన్ని కూడా మన సంప్రదాయ వాస్తు విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి తప్ప, వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయినా సరే, ఒక నమ్మకంతో, ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంపొందించుకోవడానికి నెమలి పింఛాలను ఉంచడం వల్ల మనస్సుకు ఎంతో హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు.





