BLO : బీఎల్ఓ చేతిలో ఓటు.. డెడ్ లైన్ దాటితే లిస్ట్ నుంచి అవుటేనా?
BLO : ఒకవేళ అడ్రస్ మారి కూడా పాత వివరాలే ఉంచితే, బీఎల్ఓ వెరిఫికేషన్ సమయంలో అక్కడ ఓటరు లేకపోవడంతో షిఫ్టెడ్ లేదా ఆబ్సెంట్ అని మార్క్ చేసే రిస్క్ ఉంటుంది.
BLO
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రాసెస్ ఊపందుకోవడంతో.. ప్రతి ఒక్కరిలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. బూత్ లెవల్ అధికారులు(BLO) ఇంటింటికీ తిరుగుతూ ముందుగా నింపిన ఎన్యూమరేషన్ ఫామ్‌లను కలెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓటు హక్కు అనేది ఫామ్‌లో ఏం రాశామో అదే మన భవిష్యత్తు అన్న రేంజ్‌లో మారిపోయింది.
ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఫామ్ ఎలా నింపాలి? ఓటు పోకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశాలపై యూట్యూబ్ వీడియోలు, రీల్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
అయితే వీటిని ప్రాపర్‌గా ఫిల్ చేసి, వెరిఫికేషన్ సమయానికి తిరిగి ఇవ్వకపోతే రాబోయే డ్రాఫ్ట్ రోల్‌లో పేరు కనిపించకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫామ్ నింపడంలో జరిగే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్, తండ్రి పేరు తప్పుగా పడటం లేదా ఓల్డ్ అడ్రస్ వివరాలు ఇవ్వడం వంటివి ఇప్పుడు ఓటర్లకు పెద్ద తలనొప్పిగా మారాయి.
ముఖ్యంగా అద్దె ఇళ్లు మారిన వారికి, కొత్త ఏరియాలోకి షిఫ్ట్ అయిన వారికి ఇది చాలా క్రూషియల్‌గా మారింది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది కేవలం అడ్రస్ చేంజ్ కోసం మాత్రమే కాదని, కొత్త అడ్రస్‌కి మారిన వాళ్లు డ్రాఫ్ట్ రోల్ వచ్చాక ఫామ్-8 ద్వారా కూడా అప్‌డేట్ చేసుకోవాలని సీఈఓ గైడ్‌లైన్స్ స్పష్టం చేస్తున్నాయి.
ఒకవేళ అడ్రస్ మారి కూడా పాత వివరాలే ఉంచితే, బీఎల్ఓ వెరిఫికేషన్ సమయంలో అక్కడ ఓటరు లేకపోవడంతో షిఫ్టెడ్ లేదా ఆబ్సెంట్ అని మార్క్ చేసే రిస్క్ ఉంటుంది.
ఈ ఎన్యూమరేషన్ ఫామ్‌లో పేరు, ఫ్యామిలీ డిటెయిల్స్, పాత ఓటరు లిస్ట్ రిఫరెన్స్, ఏజ్, ఎపిక్ (EPIC) కార్డ్ నెంబర్ వంటి విషయాల్లో అస్సలు తప్పులు చేయకూడదు. ఒకవేళ 2024లో ఓటు వేసినా 2002 నాటి పాత డేటాలో పేరు లేకపోతే.. పేరెంట్స్ , తాతమ్మల వివరాల ఆధారంగా మ్యాపింగ్ చేయాల్సి వస్తోంది.
పెళ్లయ్యాక ఇంటి పేరు మారిన మహిళా ఓటర్లు తరచూ ఇళ్లు మారేవాళ్లు ఓటరు పోర్టల్ (voters.eci.gov) ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఈ ఫామ్ సబ్మిట్ చేసి, ఏవైనా మిస్‌మ్యాచ్‌లు ఉంటే లోకల్ బీఎల్ఓ(BLO) సాయంతో కరెక్ట్ చేసుకోవడం మంచిది.
అయితే అడ్రస్ మారినంత మాత్రానే ఓటు పర్మినెంట్‌గా పోదు. సిస్టమ్‌లో అప్‌డేట్ కాకపోవడమే అసలు సమస్య అవుతోంది. కొత్తగా ఓటు నమోదుకు ఫామ్-6, అప్‌డేట్స్‌కి ఫామ్-8 వాడాలని ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. ఓటరు లిస్ట్‌లో పేరు లేనంత మాత్రాన పౌరసత్వం పోదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గతంలో వ్యాఖ్యానించింది.
కాబట్టి అనవసరపు భయాలు పక్కనబెట్టి.. బీఎల్ఓ(BLO) నెంబర్ సేవ్ చేసుకోవడం, ఫామ్‌ను రీ-చెక్ చేసి సమయానికి సబ్మిట్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కానీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో బీఎల్ఓలపై వర్క్ ప్రెజర్ విపరీతంగా పెరిగిపోతోంది. డెడ్‌లైన్లు పెట్టి ఓవర్‌టైమ్ చేయిస్తున్నా సరే.. చాలా చోట్ల మ్యాపింగ్ పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. లక్ష్యాలు చేరని జిల్లాల్లో అధికారులకు నోటీసులు కూడా అందుతున్నాయి.

ఈ ఆలస్యానికి కారణం లేకపోలేదు. 2002 నుంచి 2025 వరకు ఉన్న ఓటర్ల డేటాను సరిపోల్చడం, ఇంటింటి వెరిఫికేషన్, టెక్నికల్ గ్లిచెస్, చాలా ప్రాంతాల్లో అడ్రస్ మిస్‌మ్యాచ్‌లు కావడం వల్ల ప్రాసెస్ చాలా స్లోగా సాగుతోంది. కొన్ని ఏరియాల్లో కేవలం 25 శాతం మ్యాపింగ్ మాత్రమే పూర్తి కావడంతో చివరి నిమిషంలో విపరీతమైన రష్ ఉండేలా కనిపిస్తోంది.
ఒకవేళ గడువులోగా పనులు పూర్తి కాకపోతే ఎలక్షన్ కమిషన్ స్పెషల్ క్యాంపులు పెట్టడం, గడువు పొడిగించడం లేదా పెండింగ్ ఫామ్‌లను నెక్స్ట్ ఫేజ్‌లోకి ఫార్వార్డ్ చేయడం వంటి ఆల్టర్నేటివ్స్ చూసే అవకాశం ఉంది.





