Just SportsLatest News

Gambhir : వరుస సిరీస్ ఓటములు..గంభీర్‌పై వేటు పడనుందా ?

Gambhir : ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు మ్యాచ్‌లలో చిత్తుగా ఓడిపోయింది. కోచ్‌గా గంభీర్ వ్యూహాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. మరీ ముఖ్యంగా జట్టు ఎంపికలో ప్రయోగాలపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు గంభీర్‌పై తీవ్ర అసంతృప్తితో ఉంది.

Gambhir

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉందా ? అంటే అవుననే అనాల్సి వస్తోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో టీ20 సిరీస్‌లు కోల్పోవడం అభిమానులకే కాదు బీసీసీఐకు కూడా షాకే.

ముఖ్యంగా ఐర్లాండ్ చేతిలో వరల్డ్ ఛాంపియన్ ఓడిపోవడం చాలా మందికి మింగుడు పడడం లేదు. పోనీ ఇంగ్లాండ్‌పై గెలిచి ఆ ఓటమిని మర్చిపోయేలా చేస్తారనుకుంటే అది కూడా జరగలేదు. వరల్డ్ నెంబర్ వన్‌గా ఉన్న భారత్ ఇంగ్లాండ్ చేతిలో సిరీస్ కోల్పోయింది.

ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు మ్యాచ్‌లలో చిత్తుగా ఓడిపోయింది. కోచ్‌గా గంభీర్(Gambhir) వ్యూహాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. మరీ ముఖ్యంగా జట్టు ఎంపికలో ప్రయోగాలపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు గంభీర్‌పై తీవ్ర అసంతృప్తితో ఉంది. అయితే, వెంటనే ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవట్లేదని, సమీక్షా సమావేశంలో జట్టు ప్రదర్శనపై లోతుగా చర్చించాలని బోర్డు నిర్ణయించింది.

ఇంగ్లాండ్ టూర్ ముగిసిన తర్వాత జట్టు ప్రదర్శనపై రివ్యూ మీటింగ్ నిర్వహించబోతోంది. జట్టు వరుస పరాజయాలపై కోచ్‌తో పాటు సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్‌ను ప్రత్యేకంగా ప్రశ్నించనుంది. నిజానికి గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారత్ ఐర్లాండ్ టూర్ ముందు వరకు ఒక్క టీ20 సిరీస్‌ను కూడా కోల్పోలేదు.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ , బంగ్లాదేశ్ , శ్రీలంక వంటి బలమైన జట్లపై టీ20 సిరీస్‌లను సొంతం చేసుకుంది. గంభీర్ కోచింగ్‌లోనే టీమిండియా ప్రతిష్టాత్మకమైన టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత తొలి రెండు సిరీస్‌లలో ఘోర పరాజయాలను చవిచూసింది.

జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడం, వాతావరణ పరిస్థితులకు త్వరగా అలవాటు పడలేకపోవడం ఓటములకు కారణంగా చెప్పొచ్చు. టీ20 ప్రపంచకప్ తర్వాత జట్టులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి ప్రధాన ఆటగాళ్లు లేరు. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టులో చాలా మంది యువకులు ఉండటం, వారు అంతర్జాతీయ స్థాయి ఒత్తిడికి తట్టుకోలేకపోవడం కొంపముంచింది.

Gambhir
Gambhir

ఇంగ్లాండ్ పిచ్‌లు, వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఆటగాళ్లు వ్యూహాత్మకంగా మారలేకపోయారని, పిచ్‌లను అర్థం చేసుకోవడంలో బ్యాటర్లు తడబడ్డారని గంభీర్ కూడా స్వయంగా అంగీకరించాడు.

ఆట పరిస్థితులతో సంబంధం లేకుండా బ్యాటర్లు అందరూ దూకుడుగా ఆడడం కూడా ఈ పరిస్థితికి కారణమైంది. రాబోయే వన్డే ప్రపంచ కప్ దృష్ట్యా, గంభీర్(Gambhir) పదవికి ఇప్పుడే ఎలాంటి ముప్పు లేకపోయినా భవిష్యత్తులో బోర్డు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం మాత్రం ఉంది.

BLO : బీఎల్ఓ చేతిలో ఓటు.. డెడ్ లైన్ దాటితే లిస్ట్ నుంచి అవుటేనా?

Related Articles

Back to top button