Turmeric Powder : కల్తీ పసుపును కనిపెట్టేయండిలా..5 ఈజీ టెస్టులివే..
Turmeric Powder : స్వచ్ఛమైన పసుపు అయితే ఒక రకమైన పవిత్రమైన, మంచి సువాసన ఉంటుంది. ఆ వాసనను బట్టే అది ఎంత స్వచ్ఛమైనదో చెప్పేయొచ్చు.
Turmeric Powder
భారతీయ వంటకాల్లో, పూజలలో పసుపునకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం రుచి, రంగు కోసమే కాకుండా ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉండటంతో దీనిని చాలామంది డైలీ వాడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది ఎక్కువ లాభాల కోసం పసుపులో రకరకాల కెమికల్స్, నకిలీ రంగులు కలిపి కల్తీ చేసేస్తున్నారు. అందుకే మనం వాడుతున్న పసుపు అసలైనదా కాదా అనేది ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గ్లాసు నీటితో సింపుల్ టెస్ట్.. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లను తీసుకుని, అందులో ఒక స్పూన్ పసుపు(Turmeric Powder) వేయాలి. దాన్ని స్పూన్‌తో కలపకుండా అలాగే ఒక 15 – 20 నిమిషాల పాటు వదిలేస్తే. ఒకవేళ అది ప్యూర్ పసుపు అయితే గ్లాసు అడుగుభాగానికి చేరుకుంటుంది. అలాగే పైన ఉన్న నీరు చాలా లైట్ ఎల్లో కలర్లో తేటగా కనిపిస్తుంది. అలా కాకుండా నీళ్లంతా డార్క్ ఎల్లో కలర్లోకి మారిపోయి. పసుపు నీటిలో పూర్తిగా కలిసిపోతే అందులో రంగులు కలిపారని అర్థం చేసుకోవచ్చు.
టిష్యూ పేపర్ పరీక్ష.. ఒక టిష్యూ పేపర్‌ను తీసుకుని దానిపై కొంచెం పసుపు వేసి చేత్తో కాస్త గట్టిగా నొక్కాలి. ఆ తర్వాత పసుపును(Turmeric Powder) తీసేసి పేపర్‌ను జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ ఆ పేపర్‌పై జిడ్డుగా నూనె మరకలు వంటివి కనిపిస్తే మాత్రం, ఆ పసుపులో ఎక్కువ కాలం స్టాక్ ఉండటానికి మినరల్ ఆయిల్ వంటి ప్రమాదకరమైన పదార్థాలు కలిపినట్లు అర్ధం.
ఘాటైన వాసన.. స్వచ్ఛమైన పసుపు అయితే ఒక రకమైన పవిత్రమైన, మంచి సువాసన ఉంటుంది. ఆ వాసనను బట్టే అది ఎంత స్వచ్ఛమైనదో చెప్పేయొచ్చు. ఒకవేళ మీరు మార్కెట్ నుంచి తెచ్చిన పసుపు ఎలాంటి వాసన లేకపోయినా లేదా ఏదైనా కెమికల్ వాసన వస్తున్నా సరే అది పాతబడిపోయిన పసుపు లేదా కల్తీ చేయబడిన పసుపు అనే గుర్తించాలి.

రంగును బట్టి పసిగట్టవచ్చు.. చూడటానికి మెరిసిపోతున్నట్లు.. ముదురు పసుపు రంగులో ఉండే పసుపు పొడిని కొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పసుపు ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందులో లెడ్ క్రోమేట్ లేదా మెటానిల్ ఎల్లో వంటి డేంజరస్ ఆర్టిఫిషియల్ కలర్స్‌ను కలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
గుర్తింపు పొందిన ఉత్పత్తులనే కొనాలి.. కల్తీల బారిన పడకుండా ఉండటానికి వీలైనంత వరకు లూజ్ పసుపును కొనకుండా ఉండాలి. ప్యాకెట్లపై FSSAI (భారతీయ ఆహార భద్రత ప్రమాణాల సంస్థ) లేదా AGMARK వంటి ప్రభుత్వ ధృవీకరణ ఉన్న నమ్మకమైన బ్రాండ్లను ఎంచుకోవడం వల్ల నాణ్యమైన , మంచి పసుపును మనం డైలీ వాడుకోవచ్చు.
Womens Team : క్రికెట్ మక్కాలో సరికొత్త చరిత్ర.. లార్డ్స్‌లో భారత మహిళల జట్టు గ్రాండ్ విక్టరీ..





