Voter Registration : ఓటరు గుర్తింపు కోసం కొత్త రూల్స్..టైమ్ లేదు త్వరపడండి..
Voter Registration : సాధారణంగా కొత్తగా ఓటు కావాలనుకున్నవారు ఫామ్-6 నింపి అడ్రస్ ప్రూఫ్ ఇస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రత్యేక సవరణల వల్ల దీనికి కూడా ఎస్‌ఐఆర్ లింక్ పెట్టారు.
Voter Registration
తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఓటర్ల లిస్టులో మార్పులు, చేర్పుల ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోంది. అయితే ప్రతి ఒక్కరూ తమ వివరాలతో కూడిన ఎన్యూమరేషన్ ఫామ్‌లను పూర్తి చేసి ఈ నెల 24వ తారీఖులోగా స్థానిక బీఎల్ఓ అధికారులకు అందించాలని ఎన్నికల సంఘం మరోసారి తేల్చి చెప్పింది.
అయితే ఇప్పటి వరకూ వచ్చిన సమాచారం ప్రకారం చాలా మంది ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారని, కానీ భవిష్యత్తులో ఓటు హక్కును కాపాడుకోవడానికి ఇది చాలా అవసరం అని అధికారులు అంటున్నారు. అంతేకాదు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ఈ ఎస్‌ఐఆర్-2026 డేటానే కీలకం కానుందని చెబుతున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో ఓటర్ల వివరాలను గతంలోని ఎస్‌ఐఆర్-2002 రికార్డులతో పోల్చుతూ లింక్ చేస్తున్నారు. అయితే సుమారు రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఆ సర్వేపై..ఎవరికీ పెద్దగా అవగాహన లేకపోవడంతో చాలా మంది అప్పట్లో తమ పేర్లను నమోదు చేసుకోలేదు.
ఇప్పుడు వారి పిల్లలు కొత్తగా ఓటు(Voter Registration) హక్కు కోసం అప్లై చేయాలన్నా.. ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నా కూడా అప్పటి వివరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఒకవేళ ఆ వివరాలు సమర్పించలేకపోతే, కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించిన ఇతర గుర్తింపు కార్డులలో ఒకదానిని కచ్చితంగా చూపించినా సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి అవస్థలు భవిష్యత్తు తరాలు పడకుండా ఉండాలంటే ఇప్పుడు జరుగుతున్న సర్వేలో తమ వివరాలను పక్కాగా ఉండేలా చూసుకోవాలని అంటున్నారు.
సాధారణంగా కొత్తగా ఓటు(Voter Registration) కావాలనుకున్నవారు ఫామ్-6 నింపి అడ్రస్ ప్రూఫ్ ఇస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రత్యేక సవరణల వల్ల దీనికి కూడా ఎస్‌ఐఆర్ లింక్ పెట్టారు. కొత్తగా అప్లై చేసుకునే వారు ఫామ్-6తో పాటు ఎస్‌ఐఆర్-2002 వివరాలతో ఉన్న ఒక డిక్లరేషన్ ఫామ్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీనిలో తమ తల్లిదండ్రుల వివరాలను క్లియర్‌గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా కొత్త ఓటర్ల ఎంట్రీకి ఇదే పద్ధతిని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సాధారణంగా ఇతర రాష్ట్రాల ఓటర్ల జాబితాలో పేరు ఉండి, ప్రస్తుతం జాబ్, బిజినెస్ నిమిత్తం తెలంగాణలో స్థిరపడిన వారు తమ ఓటును ఇక్కడికి మార్చుకోవడానికి ఫామ్-8 నింపుతుంటారు. అయితే వీరు ఇప్పుడు కేవలం అప్లికేషన్ ఇస్తే సరిపోదు.. దాంతో పాటు ఎస్‌ఐఆర్ వివరాలతో కూడిన డిక్లరేషన్ ఫామ్‌ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఓటు బదిలీ అవుతుందని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణలో ఓటు హక్కు(Voter Registration) ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఎన్యూమరేషన్ ఫామ్‌లను అందించి ఓటును కాపాడుకోవాలని ఈసీ కోరుతోంది. ఈ ప్రాసెస్ ముగియడానికి ఇంకా కేవలం 10 రోజుల గడువు మాత్రమే ఉందని గుర్తు చేశారు. తెలంగాణలో మొత్తం 3.38 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు సుమారు 99 శాతం మందికి ఫామ్‌లను పంపిణీ చేశారు.
కానీ అందులో కేవలం 49.28 శాతం మంది అంటే సుమారు 1.66 కోట్ల మంది మాత్రమే తిరిగి తమ వివరాలను ఎంట్రీ చేసి అధికారులకు అప్పగించారు. అయితే ఫామ్‌లను ఫిల్ చేసేటపుడు ఏర్పడుతున్న ఇబ్బందులకు బయపడి కొందరు, అవగాహన లేక మరికొందరు ఎన్యూమరేషన్ ఫామ్‌లను నింపలేకపోతున్నారు. కానీ ఇప్పుడు గడువు పెంచి ..తప్పనిసరిగా ఎస్‌ఐఆర్‌కు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. మరి ఈ 10 రోజుల్లో ఈ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
Ragi Kajjikayalu : పిల్లల కోసం స్పెషల్ రెసిపీ.. బలాన్నిచ్చే రాగి కజ్జికాయలు





