Just NationalJust LifestyleLatest News

Unnatural Romance : భార్య సమ్మతి లేని అసహజ శృంగారం నేరమేనా?..భార్యాభర్తల వ్యక్తిగత స్వేచ్ఛపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది?

Unnatural Romance : ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలలో అసహజ శృంగారానికి సంబంధించిన ఉన్న పాత సెక్షన్ 377ని పూర్తిగా తీసేశారు.

Unnatural Romance

పెళ్లి అన్నది ఒకే ఇంట్లో ఇద్దరు కలిసి జీవించడం మాత్రమే కాదు, ఒకరినొకరు గౌరవించుకోవడం కూడా. వారి ఇష్టాఇష్టాలు, అభిప్రాయాలు, అలవాట్లు ఇలా ఎన్నో విషయాలపై ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. అయితే అలాంటివాటిలో అతి ముఖ్యమైన భార్యాభర్తల శృంగారం విషయంపై కొన్నాళ్లుగా నడుస్తున్న చర్చ తాజాగా మరోసారి తెర మీదకు వచ్చింది.

భార్యకు ఇష్టం లేకపోయినా బలవంతంగా భర్త శృంగారంలో పాల్గొంటే, దాన్ని నేరంగా చూడాలా వద్దా అంటూ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. ఎందుకంటే గతంలో దీనిపై వివిధ కోర్టులు దీనిపై వేర్వేరు తీర్పులివ్వడం, పైగా మన దేశంలో కొత్తగా వచ్చిన క్రిమినల్ చట్టాల్లో..ఆ పాత రూల్స్ మారిపోవడంతో ఈ గందరగోళం మరింతగా పెరిగింది.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే అసలు భార్యాభర్తల మధ్య ఉండే ఈ పర్సనల్ విషయాన్ని విచారించడానికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఓకే అనడంతో ఇది మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.

నిజానికి పాత చట్టాల ప్రకారం ఒకసారి చూస్తే.. భార్యతో భర్త శృంగారంలో పాల్గొంటే దానిని అత్యాచారం అనడానికి వీల్లేదని ఒక మినహాయింపు ఉండేది. కానీ అదే సమయంలో, వారిద్దరి మధ్య ఇష్టం లేకుండా జరిగే అసహజ శృంగారాన్ని(Unnatural Romance) మాత్రం నేరంగానే చూసేవారు.

కాకపోతే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలలో అసహజ శృంగారానికి(Unnatural Romance) సంబంధించి ఉన్న పాత సెక్షన్ 377ని పూర్తిగా తీసేశారు. దీనివల్లే అసలు భార్యకు ఇష్టం లేని బలవంతపు శృంగారాన్ని ఏ చట్టం కింద శిక్షించాలనే విషయంపై పెద్ద తికమక మొదలైంది.

ఈ విషయంలో దేశంలోని వివిధ కోర్టులు .. ఒక్కొక్కటి ఒక్కోలా మాట్లాడటంతో దీనిపై అందరికీ క్లారిటీ కంటే కన్ఫ్యూజన్‌ ఎక్కువగా మిగిలిపోయింది. మధ్యప్రదేశ్ కోర్టు.. భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం నేరం కాదని చెబితే, అలహాబాద్ కోర్టు మాత్రం భార్య ఇష్టపడకపోతే అది కచ్చితంగా నేరమే అని తేల్చి చెప్పింది.

ఇక పంజాబ్ వంటి కొన్ని రాష్ట్రాలలో గల కోర్టులు దీన్ని అత్యాచారంగా కాకపోయినా, ఆడవాళ్లను హింసించడం కింద కేసు పెట్టొచ్చని అభిప్రాయపడ్డాయి. ఇలా స్టేట్‌ స్టేట్‌కు ఒక రూల్ అన్నట్లుగా ఉండటంతో పోలీసులు ఏ కేసు పెట్టాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

అందుకే భార్య ఇష్టపడనప్పుడు భర్త చేసే బలవంతపు చేష్టలను ఏ సెక్షన్ కింద తీసుకోవాలి? పెళ్లి చేసుకోగానే భార్య శరీరంపై భర్తకు మాత్రమే హక్కు ఉంటుందా? మరి భార్యకు తన సొంత శరీరంపై పూర్తి స్వేచ్ఛ లేదా? అనే విషయాలను ఇప్పుడు సుప్రీంకోర్టు తేల్చాల్సి ఉంది.

Unnatural Romance
Unnatural Romance

కాగా పెళ్లయినంత మాత్రాన భార్య ఏమీ భర్త సొంత ఆస్తి కాదని, ఆమెకు ఇష్టం లేకపోతే బలవంతం చేయడం కూడా అత్యాచారమేనని మహిళా సంఘాల పెద్దలు, మేధావులు అంటున్నారు . మరోవైపు, ఇదే చట్టాన్ని సుప్రీంకోర్టు తీసుకొస్తే మాత్రం భార్యాభర్తలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని సంసారాలను ఈజీగా కూల్చేసుకుంటారని, చట్టం దుర్వినియోగం అవుతుందని ఇంకొంతమంది మేధావులు ఆందోళన పడుతున్నారు.

మొత్తంగా ఇలాంటి వాదనల మధ్య బ్యాలెన్స్ కుదురుస్తూ సుప్రీంకోర్టు సెప్టెంబర్ 9న ఇవ్వబోయే ఫైనల్ జడ్జిమెంట్‌తో.. దేశవ్యాప్తంగా ఇకపై ఒకే రూల్ అమలులోకి రాబోతోంది. ఇప్పటివరకు కూడా పెళ్లి చేసుకుంటే వైఫ్ శరీరంపై హస్బెండ్‌కు ఒక ప్రత్యేక లైసెన్స్ దొరికినట్టుగా సొసైటీ ప్రవర్తించింది. మరి ఆ లైసెన్స్‌కు ఎక్స్‌పైరీ డేట్ వచ్చిందా లేదా అనేది సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో తేలబోతోంది.

Golden Boot : రేసులో మెస్సీ, ఎంబాపె..గోల్డెన్ బూట్ దక్కేదెవరికి ?

Related Articles

Back to top button