Harmanpreet Kaur : జింబాబ్వేపై 92 రన్స్ తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్..లైవ్ ఇంటర్వ్యూలో హర్మన్ భావోద్వేగం
Harmanpreet Kaur : జింబాబ్వేతో జరిగిన థర్డ్ టీ20లో 92 రన్స్ తేడాతో భారత మహిళల జట్టు విజయాన్ని సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 91 పరుగులతో విరుచుకుపడి, మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలో భావోద్వేగానికి గురైంది.
Harmanpreet Kaur
ఎవరికైనా బ్యాడ్ ప్యాచ్ రావడం కామన్.. కానీ తమ అసలు సిసలు సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి మరొక్క ఛాన్స్ చాలు అని భారత మహిళా క్రికెట్ స్టార్ హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి నిరూపించింది. క్రీజులోకి అడుగుపెడితేనే బౌలర్ల గుండెల్లో దడ పుట్టించే ఈ పవర్ఫుల్ బ్యాటర్, కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన రేంజ్లో ఆడలేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది.
అయితే తాజాగా తన బ్యాట్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన హర్మన్.. మైదానంలో సిక్సర్లు, ఫోర్లతో విలయతాండవం సృష్టించింది. మ్యాచ్ ముగిశాక ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం హర్మన్ ఒక్కసారిగా ఎమోషనల్ అయి కంటతడి పెట్టడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా జరిగిన లాస్ట్ టీ20 మ్యాచ్‌లో ఇండియన్ ఉమెన్స్ టీమ్ జింబాబ్వేను అన్ని రంగాల్లోనూ చిత్తు చేసింది. ఏకంగా 92 పరుగుల భారీ తేడాతో ఘనవిజయాన్ని సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసి ట్రోఫీని దక్కించుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరును బోర్డుపై నిలిపింది. ఓపెనర్ షెఫాలీ వర్మ 69 రన్స్‌తో ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ప్రారంభించగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్ జింబాబ్వే బౌలింగ్ ఆర్డర్‌ను బెంబేలెత్తించింది. కేవలం 41 బాల్స్‌లోనే ఏకంగా 91 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
తర్వాత 217 పరుగుల కొండంత టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు, టీమిండియా బౌలర్ల ధాటికి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి కేవలం 124 రన్స్‌కే పరిమితమై భారీ ఓటమిని మూటగట్టుకుంది. దీంతో టీమిండియా అకౌంట్లో మరో ఘనమైన సిరీస్ విక్టరీ చేరింది.
ఈ మ్యాచ్‌లో టీమ్ గెలుపు ఒక ఎత్తు అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ఇంటర్వ్యూ మాత్రం అందరినీ కదిలించింది. ఇన్నింగ్స్ బ్రేక్ టైమ్‌లో మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్‌తో మాట్లాడుతుండగా.. హర్మన్‌ప్రీత్ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. 10 మ్యాచ్‌లు ఆడినా కూడా తాను కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేక సతమతమయిపోతున్న సమయంలో.. డబ్ల్యూవీ రామన్ అందించిన మెంటల్ స్టెబిలిటీ ఎంతో ఆసరాగా నిలిచిందని ఎమోషనల్ అయింది. తన సహజ సిద్ధమైన దూకుడుతో బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదించమని రామన్ చెప్పిన మాటే తనను మళ్లీ ఈ ట్రాక్‌లోకి తెచ్చిందని చెబుతూ కృతజ్ఞతలు తెలిపింది.
తన ఈ రేంజ్ కమ్‌బ్యాక్ వెనుక నెట్స్‌లో సాగిన కఠిన శ్రమే ఉందని హర్మన్ చెప్పుకొచ్చింది. ఆసియా క్రీడల తర్వాత ప్రాక్టీస్‌పైనే ఫుల్‌గా ఫోకస్ పెట్టానని, బ్యాటింగ్ కోచ్ హిమాన్షు చావ్లా తన షాట్ సెలక్షన్ , బ్యాట్ స్వింగ్‌ను మెరుగుపరచడానికి ఎంతో కష్టపడ్డారని చెప్పింది. ఒకే రకమైన షాట్స్‌ను పదేపదే పర్ఫెక్ట్ అయ్యే వరకు ప్రాక్టీస్ చేయడం వల్లే అసలైన హర్మన్ రూపం మళ్లీ బయటకు వచ్చిందని తన సీక్రెట్ రివీల్ చేసింది. మొత్తానికి, ఏవైనా ఇబ్బందులు ఎదురైనా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడితే విజయం మనదేనని హర్మన్‌ప్రీత్(Harmanpreet Kaur) ప్రూవ్ చేసింది.
knowing how badass tough harman is, watching her break down like this just shows what all she’s actually going thru, hope you pull thru all this gurl! https://t.co/n0umC975R6
— Sneहाहाहा (@__Sn_e_ha__) October 20, 2026





