Just NationalJust PoliticalLatest News

Students Protest : నీట్ లీక్ వివాదంపై ఆగని విద్యార్థి ఉద్యమం..ఢిల్లీలో అసలేం జరుగుతోంది?

Students Protest : తాజాగా జరిగిన 'సంసద్ చలో' పిలుపు.. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడం, పోలీసలు టియర్ గ్యాస్, లాఠీఛార్జ్ ఉపయోగించడంతో కొంతమంది సామాజిక కార్యకర్తలు, బాధిత కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు.

Students Protest

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న స్టూడెంట్స్ ఆందోళన(Students Protest) రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ వ్యవహారంపై జూన్ 20న ప్రారంభమైన ఈ నిరసనల పర్వం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పొలిటికల్, సామాజిక వేదికలకూ పాకినట్లయింది. సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సంప్రదింపుల మార్గాన్ని సూచిస్తున్నా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలనే తమ మెయిన్ డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదంటూ ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు.

విద్యార్థుల సమస్యలపై ఎప్పుడైనా, ఎక్కడైనా మాట్లాడటానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ప్రకటించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలసి స్వయంగా చర్చల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని, నడ్డా నివాసంలో కానీ , ఆయన కార్యాలయంలో కానీ ఎక్కడైనా కానీ సమావేశం కావచ్చని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.

స్టూడెంట్స్ ప్రతిపాదనలను వినడానికి కేంద్ర ప్రభుత్వం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. అయితే, ఉద్యమం విరమించడానికి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు, పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని, నిరసనకారులపై నమోదైన అన్ని కేసులను ఎత్తివేయాలని సీజేపీ నాయకత్వం కండీషన్లు విధిస్తోంది.

మరోవైపు ఈ ఆందోళనల వెనుక శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టడానికి అసాంఘిక శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉందని, ఇప్పటికే కొన్ని చోట్ల కావాలని రెచ్చగొట్టే సంఘటనలు ఇవే ప్రూవ్ చేస్తున్నాయని సీజేపీ ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా జరిగిన ‘సంసద్ చలో’ పిలుపు.. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడం, పోలీసులు టియర్ గ్యాస్, లాఠీఛార్జ్ ఉపయోగించడంతో కొంతమంది సామాజిక కార్యకర్తలు, బాధిత కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏ తప్పూ చేయని స్టూడెంట్స్‌పై గూండాలను ట్రీట్ చేసే విధంగా కఠినంగా వ్యవహరించడం సరికాదని గీతాంజలి అంగ్మో, అనితా దీప్కే వంటి ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

Students Protest
Students Protest

ఈ జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న ఆందోళనలపై న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకుంటున్నాయి. నిరసనల వల్ల ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లుతోందని అలాగే విదేశీ నిధుల కోణంపై విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లతో పాటు, పోలీసులు అతిగా బలప్రయోగం చేయడంపై వచ్చిన ఫిర్యాదులను ఢిల్లీ హైకోర్టు పరిశీలిస్తోంది.

అటు నిరసనల వల్ల మెట్రో స్టేషన్ల మూసివేత వల్ల రాకపోకలు స్తంభించడంతో.. భారత ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ, అవసరమైతే తాము స్వయంగా రంగంలోకి దిగుతామని అన్నారు. కాగా, యూత్ భవిష్యత్తుతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ పేపర్ లీక్ కేసుల విచారణకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Vizag : దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో వైజాగ్.. లింక్డిన్ నివేదిక ఇంకా ఏం చెప్పింది?

Related Articles

Back to top button