Just TelanganaJust PoliticalLatest News

Bathukamma Sarees : బతుకమ్మ పండుగకు కాంగ్రెస్ సర్కార్ కలర్‌ఫుల్ గిఫ్ట్..ఈసారి కలర్ చేంజ్, ఒకేసారి రెండు చీరలు

Bathukamma Sarees : గతేడాదిలా పండుగ సంబరాలు ముగిసే వరకూ వెయిట్ చేయకుండా .. ఈసారి ముందుగానే మహిళల చేతికి చీరలను అందించడానికి వేగంగా పనులు పూర్తి చేస్తోంది.

Bathukamma Sarees

తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు పండుగకు ముందే అసలైన పండుగ కళను తీసుకువస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతీ ఏడాది దసరా, బతుకమ్మ వేడుకల వేళ మహిళలకు చీరలు అందించడం ఆనవాయితీగా వస్తున్నా కూడా.. ఈసారి రేవంత్ ప్రభుత్వం ఒక స్పెషల్ ప్లాన్‌తో ముందుకొచ్చింది.

గతేడాదిలా కాకుండా, పండుగ సంబరాలు ముగిసే వరకూ వెయిట్ చేయకుండా .. ఈసారి ముందుగానే మహిళల చేతికి చీరలను అందించడానికి వేగంగా పనులు పూర్తి చేస్తోంది. అక్టోబర్ నెలలో రాబోయే దసరా, బతుకమ్మ వేడుకలను మరింత వైభవంగా జరుపుకోవడానికి సర్కార్ చేస్తున్న ఈ ప్రయత్నానికి మహిళామణుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

తెలంగాణలో ఇందిరా మహిళాశక్తి స్కీమ్‌ కింద ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉచిత చీరల తయారీని చేపట్టింది. ఈసారి నాణ్యతలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఏకంగా రూ. 334 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. మహిళలకు పంచడానికి మొత్తం 95 లక్షల చీరలను టార్గెట్‌గా పెట్టుకోగా.. ఇప్పటికే 30 లక్షల చీరలను రెడీ చేసేశారు. వీటిని జిల్లాలవారీగా తరలించడానికి అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేసి, రంగంలోకి దింపేశారు.

ఈసారి చీరల విషయంలో ముందుగా సిద్ధం చేయడమే కాదు .. డిజైన్ అండ్ లుక్‌లోనూ ప్రభుత్వం మార్పు చేసింది. గతంలో పాలపిట్ట కలర్ చీరలను అందించగా.. ఈసారి కంటికి ఇంపుగా ఉండే ట్రెండీ చిలక పచ్చ కలర్‌ను స్పెషల్‌గా సెలెక్ట్ చేశారు. అంతేకాకుండా ఈసారి ప్రతీ మహిళకు ఒక చీర కాకుండా ఒకేసారి రెండు శారీలను కానుకగా ఇవ్వబోతున్నారు. క్వాలిటీతో పాటు ప్యాకింగ్‌లోనూ ఎక్కడా లోటుపాట్లు రాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

Bathukamma Sarees
Bathukamma Sarees

గతేడాది లాగా నవంబర్ 19వ తేదీన జరగనున్న ఇందిరాగాంధీ జయంతి వరకు ఆగకుండా.. ఈసారి అక్టోబర్ 11వ తేదీన వచ్చే బతుకమ్మ పండుగ రోజే మహిళల చేతికి చీరలు అందేలా ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ సర్కార్ నుంచి అధికారిక డేట్ అనౌన్స్‌మెంట్ రాగానే, లోకల్ అధికారులు డైరెక్టుగా గ్రామాలు, పట్టణాల్లో ఈ పంపిణీ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి రెడీగా ఉన్నారు.

బతుకమ్మ చీరల పంపిణీతో పాటు రైతన్నలకు ధాన్యం కొనుగోళ్లలో 7 రకాలకు రూ.500 బోనస్ ఇస్తామన్న ప్రకటన కూడా రావడంతో.. పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఆడబిడ్డలు ముందుగా అందే ఈ కానుకలతో ఈసారి చిలకపచ్చ చీరల మెరుపులతో, బతుకమ్మ పాటలతో ఏ రేంజ్‌లో వేడుకలు జరుపుకొంటారో చూడాలి.

Bigg Boss 10 : ఈసారి బిగ్ బాస్ షో టైమింగ్స్ ఛేంజ్… దశావతారం మోత మోగిస్తుందా?

Related Articles

Back to top button