CJP : రాజీనామా చేయాల్సిందే..కేంద్రానికి కాక్రోచ్ పార్టీ డెడ్ లైన్
CJP : సీజేపీ నేతలతో ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. మీటింగ్ గంటన్నర పాటు సాగినట్టు తెలుస్తోంది. చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన కేంద్రం సీజేపీ నిరసనలను వీలైనంత త్వరగా ముగించాలన్న లక్ష్యంతో చర్చలు జరిపింది.
CJP
నీట్ పేపర్ లీకేజీ వివాదానికి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ(CJP) అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ డిమాండ్లను కేంద్రం ఒప్పుకునే తీరాలని డిమాండ్ చేసింది. జంతర్ మంతర్ తో పాటు దేశవ్యాప్తంగా విద్యార్థులు, విపక్షాల నిరసనల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎమర్జెన్సీ కేబినెట్ మీటింగ్ నిర్వహించింది.
దాని కంటే ముందే సీజేపీ నేతలతో ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. ఈ మీటింగ్ గంటన్నర పాటు సాగినట్టు తెలుస్తోంది. చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన కేంద్రం సీజేపీ నిరసనలను వీలైనంత త్వరగా ముగించాలన్న లక్ష్యంతో చర్చలు జరిపింది. ఈ సందర్భంగా సీజేపీ తరపున సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ వేదికగా ఈ చర్చలు జరిగాయి.
నీట్ పేపర్ లీకేజీ సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందేనని కేంద్రానికి సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము వెనక్కి తగ్గేదే లేదన్నారు. అలాగే విద్యార్థులపై నమోదైన కేసులను కొట్టివేయాలని, ఈ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలన్న మూడు ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. శనివారం మధ్యాహ్నం వరకూ డెడ్ లైన్ విధించారు.
చర్చల సందర్భంగా ఈ డిమాండ్లను ప్రస్తావిస్తూ జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు లకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాకు ఈ చర్చలకు సంబంధించిన వివరాలను సీజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా వెల్లడించారు. తమ డిమాండ్లపై కేంద్రం నిర్ణయం కోసం రేపు మధ్యాహ్నం వరకు ఆగుతామని తెలిపారు.

శనివారం మరోసారి కేంద్రంతో చర్చలు జరుపుతామని వెల్లడించారు. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు, పరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపినట్టు వెల్లడించారు.
తమ డిమాండ్లను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళతామని నడ్డా హామీ ఇచ్చారన్నారు. సీజేపీ(CJP) ఇచ్చిన డెడ్ లైన్ లోపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీలో కీలకనేతగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రిగా కొనసాగించాలన్నదే బీజేపీ పెద్దల ఆలోచనగా ఉంది.
Police : నిరసన ప్రదర్శనలో యువతిపై ఖాకీ నీడ.. డిఫెన్స్‌లో పడిన పోలీస్ శాఖ





