Sonam Wangchuk : నా పోరాటంపై నాకే సర్టిఫికెట్ కావాలా?.. ట్రోలర్స్‌కు సోనమ్ వాంగ్‌చుక్ స్ట్రాంగ్ కౌంటర్..
Sonam Wangchuk : కేంద్ర మంత్రి రాజీనామా వ్యవహారంలో ప్రజల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోందని, కేంద్ర ప్రభుత్వం కూడా రిజైన్ విషయంలో ఎక్కువ కాలం మౌనంగా ఉండలేదని వాంగ్‌చుక్ చెప్పుకొచ్చారు.
Sonam Wangchuk
నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతంపై లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్(Sonam Wangchuk) తన 26 రోజుల నిరాహార దీక్షను గురువారం రాత్రి విరమించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ఉపవాసం వల్ల సోనమ్ ఆరోగ్యం క్షీణించడంతో 20 రోజుల తర్వాత ఆస్పత్రికి తరలించినా, బెడ్‌పై నుంచి కూడా తన పోరాటాన్ని కొనసాగించారు.
అయితే జూలై 23 రాత్రి కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో పాటు ఇతర కీలక నేతలు సోనమ్ వాంగ్‌చుక్‌తో చర్చలు జరిపి, ఆయన చేత దీక్షను విరమింపజేశారు. దీంతో సోషల్ మీడియాలో రెండు రోజులుగా ఆయన తీరుపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ మొదలైంది. కేంద్ర మంత్రి రిజైన్ చేయకుండానే వెనక్కి తగ్గడం వెనుక ..ఏదైనా డీల్ కుదిరిందా అని కొంతమంది నెటిజన్లు బహిరంగంగానే ప్రశ్నించడం ప్రారంభించారు.
తనపై పెద్ద ఎత్తున వస్తున్న విమర్శలు, ఆరోపణలకు సోనమ్ వాంగ్‌చుక్ ఒక వీడియో సందేశం ద్వారా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తన పోరాటంలో ఉన్న నిజాయితీని నిరూపించుకోవడానికి ఎవరి దగ్గరా సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. కేవలం డీల్స్ కుదుర్చుకోవడానికే అయితే ఎవరైనా సరే 26 రోజుల పాటు అన్నపానీయాలు మానేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా అని ప్రశ్నించారు. అంతేకాదు అలా చేసేవాడినే అయితే హాయిగా ఏసీ గదుల్లో కూర్చుని రాయబారాలు నడపలేనా అని విమర్శకులను నిలదీశారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌ను పక్కనపెట్టి దీక్షను ఎందుకు ముగించారనే ప్రశ్నపై కూడా సోనమ్ వాంగ్‌చుక్ క్లారిటీ ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి తన పదవికి రిజైన్ చేయడం ఇంపార్టెంటే అయినా కూడా.. నిరసనల్లో పాల్గొన్న అమాయక స్టూడెంట్స్, ఉద్యమకారులపై ఎలాంటి కేసులు పెట్టకుండా కాపాడుకోవడమే తనకు చాలా చాలా ప్రాధాన్యమైన అంశంగా కనిపించిందని అన్నారు. అందుకే కేంద్ర పెద్దలతో చర్చల సమయంలో ఆ రాజీనామా అంశాన్ని తాను గట్టిగా పట్టుకోలేదని వివరించారు.

కేంద్ర మంత్రి రాజీనామా వ్యవహారంలో ప్రజల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోందని, కేంద్ర ప్రభుత్వం కూడా రిజైన్ విషయంలో ఎక్కువ కాలం మౌనంగా ఉండలేదని వాంగ్‌చుక్ చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో మంత్రి కచ్చితంగా తప్పుకుంటారనే నమ్మకం తనకు ఉందంటూ, అందుకే కేవలం ఆ ఒక్క డిమాండ్ మీదే మొండిగా కూర్చోకుండా దీక్ష విరమించాల్సి వచ్చిందని వివరించారు.
AFTER 26 DAYS OF HUNGER DO I NEED TO PROVE MY SINCERITY !!!
Do please watch and help spread the word. Find the full 22 minutes video on my YouTube Channel: Sonam Wangchuk pic.twitter.com/6CO3tjZsSD— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026
Soya Beans : బరువు తగ్గాలనుకుంటున్నారా? ..అయితే మీ డైట్లో సోయాబీన్స్ యాడ్ చేసుకోండి..





