Just EntertainmentLatest News

Malaika Arora : కొత్త బాయ్ ఫ్రెండ్‌తో షికార్లు..52 ఏళ్ల వయసులోనూ తగ్గడం లేదుగా

Malaika Arora : మలైకా 33 ఏళ్ల డైమండ్ మర్చంట్, బిజినెస్‌మెన్ అయిన హర్ష్ మెహతాతో డేటింగ్‌లో ఉన్నట్లు బాలీవుడ్‌లో గట్టిగా ప్రచారం సాగుతోంది.

Malaika Arora

మలైకా అరోరా… బాలీవుడ్ లో ఆమెను తెలియని వారుండరు. హిందీ సినిమాల్లో హీరోయిన్ గా ముఖ్యంగా ఐటెం సాంగ్స్ తో బాగా ఫేమస్. దిల్ సే సినిమాలో ‘ఛయ్య ఛయ్య’తోనూ, దబాంగ్’ చిత్రంలోని మున్నీ బద్నామ్ హుయీ’ పాటలతో ఎంతో పాపులర్ అయింది.. మోడలింగ్ తో పాటు పలు రియాలిటీ షోలకి జడ్జిగా కూడా వ్యవహరించింది.

అయితే సినిమాలతోనే కాకుండా హాట్ ఫోటో షూట్స్, వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలుస్తుంటుంది. గతంలో నటుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుని, 2017లో విడాకులు తీసుకున్నారు. వీరికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం 52 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తున్న మలైకా(Malaika Arora) లవ్ ఎఫైర్లలోనూ తగ్గేదే లేదంటోంది.

విడాకుల తర్వాత మలైకా బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తో ఆరేళ్ల పాటు పాటు డేటింగ్ చేసింది. వీరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ తో ఈ జంట ఎప్పుడూ వార్తల్లో నిలిచేది. దాదాపు ఆరేళ్ల రిలేషన్ తర్వాత 2024లో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు.

ప్రస్తుతం మలైకా 33 ఏళ్ల డైమండ్ మర్చంట్, బిజినెస్‌మెన్ అయిన హర్ష్ మెహతాతో డేటింగ్‌లో ఉన్నట్లు బాలీవుడ్‌లో గట్టిగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ కలిసి పలు పార్టీలు, కాన్సర్టులు కలిసే వెళుతున్నారు. తాజాగా ముంబైలోని ఒక రెస్టారెంట్‌లో మలైకా తన కుమారుడు అర్హాన్ ఖాన్‌తో కలిసి హర్ష్ మెహతాతో డిన్నర్ డేట్‌కు వెళ్లడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Malaika Arora
Malaika Arora

అయితే, వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. హర్ష్ మెహతా మలైకా కంటే 19 ఏళ్లు చిన్నవాడు. చాలా రోజులుగా వీరిద్దరూ తమ డేటింగ్ వ్యవహారాన్ని రహస్యంగా నడిపిస్తున్నారని సమాచారం. అయితే బాలీవుడ్ సెలబ్రిటీలు బయటకు వస్తే మీడియా కంటికి చిక్కకుండా ఉండలేరు.

ఎయిర్ పోర్టు దగ్గర, పెద్ద పెద్ద రెస్టారెంట్ల దగ్గర ఫోటోగ్రాఫర్లు తిరుగుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల పలు సందర్భాల్లో మలైకా, హర్ష్ మెహతాతో కలిసి కనిపించింది. రెండు,మూడు సార్లు ఒకే కారులో కూడా వెళ్లిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు రెస్టారెంట్ దగ్గర కనిపించడంతో మలైకాకు కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికాడంటూ బాలీవుడ్ ప్రేక్షకులు గుసగుసలాడుకుంటున్నారు.

Bitter Gourd Seeds : కాకరకాయ గింజలు తినొచ్చా? అసలు వాటినితింటే ఏం జరుగుతుందో తెలుసా?

Related Articles

Back to top button