BLDC Fans : కరెంటు బిల్లు షాక్ కొడుతోందా? BLDC ఫ్యాన్లతో దీనికి చెక్ పెట్టొచ్చా?
BLDC Fans : ఒక ఫ్యాన్ రోజుకు 12 గంటలు తిరుగుతుందనుకుంటే.. సాధారణ 75 వాట్ల ఫ్యాన్ మంత్‌కు సుమారు 27 యూనిట్ల కరెంటును తీసుకోగా.. అదే 30 వాట్ల BLDC ఫ్యాన్ అయితే మంత్‌కు కేవలం 11 యూనిట్లను మాత్రమే వినియోగిస్తుంది.
BLDC Fans
వర్షాలు పడుతున్నప్పుడు బయట ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడినట్లు అనిపించినా, ఇంట్లో మాత్రం ఒక రకమైన జిడ్డుగా, తీవ్రమైన ఉక్కపోతగా అనిపిస్తుంది. దీనికి గాలిలో పెరిగే తేమ శాతం (Humidity) ప్రధాన కారణం. వాతావరణ నిపుణులు చెబుతున్నదాని ప్రకారం వర్షాకాలంలో గాలిలో తేమ శాతం 70 నుంచి 90 శాతానికి పైగా పెరుగుతుంది.
దీనివల్ల మన బాడీకి వచ్చే చెమట త్వరగా ఆవిరి కాక, గదిలో వేడిగా ఉన్న ఫీల్ కలుగుతుంది. దీంతో ఇంట్లో ఫ్యాన్లను రోజంతా, రాత్రంతా ఆన్‌లోనే ఉంచుతారు . దీని ఎఫెక్ట్‌తో నెల చివరికి వచ్చే కరెంటు బిల్లు చూసి షాక్ అవుతారు. అందుకే చాలామంది దృష్టి బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్( BLDC) ఫ్యాన్లపై పడుతోంది.
సాధారణంగా మనం ఇప్పటివరకూ వాడిన ఫ్యాన్లు దాదాపు 70 నుంచి 75 వాట్ల కరెంట్‌ను వినియోగిస్తాయి. కానీ సరికొత్త బీఎల్డీసీ టెక్నాలజీతో పనిచేసే ఆటమ్‌బర్గ్, కలర్బోట్ నాక్స్ క్వాడ్, ల్యూకర్ యుఎస్ఏ ఆల్ఫా గెలాక్సీ,టీవీఎస్ గ్రీన్ ఈటర్నియా వంటి ఫ్యాన్లు మాత్రం కేవలం 28 నుంచి 35 వాట్ల ఎలక్ట్రిసిటీని మాత్రమే వాడుకుని అంతే స్థాయిలో గాలిని ఇస్తాయి.
వర్షాకాలంలో ఒక ఫ్యాన్ రోజుకు 12 గంటలు తిరుగుతుందనుకుంటే.. సాధారణ 75 వాట్ల ఫ్యాన్ మంత్‌కు సుమారు 27 యూనిట్ల కరెంటును తీసుకోగా.. అదే 30 వాట్ల BLDC ఫ్యాన్(BLDC Fans) అయితే మంత్‌కు కేవలం 11 యూనిట్లను మాత్రమే వినియోగిస్తుంది. అంటే ఒక్క ఫ్యాన్ వల్ల నెలకు 16 యూనిట్ల కరెంటు సేవ్ అవుతుంది.

అయితే పవర్ బిల్లు తగ్గుతుంది కదా అని అందరూ వెంటనే బీఎల్డీసీ ఫ్యాన్లకు మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే వీటి కాస్ట్ 1500 నుంచి 3500 రూపాయల వరకు ఎక్కువగా ఉంటుంది. రోజుకు 1,2 గంటలు మాత్రమే వాడే గదుల్లో ఈ ఫ్యాన్లను పెడితే మీరు పెట్టిన అదనపు పెట్టుబడి తిరిగి రావడానికి చాలా ఏళ్లు పడుతుంది.
వీటితో రిమోట్ కంట్రోల్, టైమర్ మోడ్, ఎక్కువ శబ్దం లేకుండా రన్ అవడం, ఇన్వర్టర్పై నడిచినప్పుడు తక్కువ కరెంటును వాడుకోవడం వంటివి ప్లస్ అవుతాయి. అలాగే ఏసీ వాడేవారు ఫ్యాన్‌ను కూడా వాడితే గదిలో గాలి వేగంగా వ్యాపించి ఏసీ టెంపరేచర్‌ను ఒకటి రెండు డిగ్రీలు పెంచే వీలుంటుంది. దీనివల్ల కరెంటు బిల్లు మరింత తగ్గుతుంది.
BLDC ఫ్యాన్ ఫీచర్లు, ధర చూడాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి.





