Vitamin D : ఎగ్ తినడానికి ఓ లెక్కుందట.. ఈ చిన్న మిస్టేక్స్ చేస్తున్నారేమో చూడండి..
Vitamin D : ఎగ్ తినేటప్పుడు కేవలం తెల్లసొన మాత్రమే తిని, పసుపుసొన (Yolk)ను పక్కన పడేస్తుంటారు. కానీ విటమిన్ D మొత్తం ఆ ఎల్లో భాగంలోనే దాగి ఉంటుంది.
Vitamin D
మనిషి శరీరంలో బోన్స్ బలంగా ఉండాలన్నా, కండరాలు సరిగ్గా పనిచేయాలన్నా చివరకు వ్యాధి నిరోధక శక్తి పెరగాలన్నా కూడా విటమిన్ D చాలా అవసరం అని డాక్టర్లు చెబుతుంటారు. బాడీలో విటమిన్ D(Vitamin D) తగ్గినప్పుడు విపరీతమైన అలసట, కండరాల వీక్నెస్, ఎముకల నొప్పులు వంటి సమస్యలు వేధిస్తుంటాయి.
సాధారణంగా సూర్యరశ్మి ద్వారా ఇది ఎక్కువ శాతం దొరుకుతుంది. అయితే మనం రోజూ తీసుకునే ఆహారంలో ఎగ్స్‌ను చేర్చుకోవడం ద్వారా కూడా విటమిన్ Dని ఈజీగా పొందొచ్చని డాక్టర్లు సూచిస్తుంటారు.
అయితే చాలామంది ఎగ్ తినేటప్పుడు కేవలం తెల్లసొన మాత్రమే తిని, పసుపుసొన (Yolk)ను పక్కన పడేస్తుంటారు. కానీ విటమిన్ D(Vitamin D) మొత్తం ఆ ఎల్లో భాగంలోనే దాగి ఉంటుంది. కాబట్టి గుడ్డును మొత్తంగా తిన్నప్పుడే ఈ పోషకం మన బాడీకి అందుతుంది.
అంతేకాకుండా విటమిన్ D అనేది ఫ్యాట్లో కరిగే స్వభావం కలిగి ఉంటుంది. అందుకే ఎగ్స్‌ను ఆలివ్ ఆయిల్, అవకాడో లేదా హెల్దీ ఫ్యాట్స్ ఉండే ఆహారాలతో కలిపి తీసుకుంటే మన బాడీ విటమిన్ Dని వెంటనే గ్రహిస్తుంది.
అయితే మనం గుడ్లను ఎలా వండుతున్నామనే దానిపైన కూడా పోషకాల లభించడం ఆధారపడి ఉంటుంది. ఎగ్స్‌ను సాదాగా ఉడకబెట్టడం, తక్కువ ఫ్లేమ్‌పై ఆమ్లెట్ లేదా పోచ్గా చేసుకోవడం వల్ల దానిలోని విటమిన్లు పాడవకుండా ఉంటాయి. ఎక్కువ వేయించడం లేదా ఎక్కువ టెంపరేచర్ వద్ద ఎగ్స్‌ను ఎక్కువసేపు ఉడికించడం వల్ల పోషకాలు నశించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే కేవలం గుడ్లు తింటేనే విటమిన్ D లోపం పూర్తిగా పోతుందని చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. దీంతో పాటు కొవ్వు ఉండే చేపలు, విటమిన్ D ఫోర్టిఫైడ్ పాలు, పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే ప్రతీరోజూ ఉదయం 9 గంటలలోపు కొద్దిసేపు ఎండలో నిలబడటం వల్ల కూడా సహజంగానే విటమిన్ D అందుతుంది.
ఒకవేళ విటమిన్ D లోపం ఎక్కువగా ఉంటే మాత్రం కేవలం ఆహార మార్పులు ఒక్కటే సరిపోవు. వెంటనే డాక్టర్‌ను కలిసి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. డాక్టర్ల సూచనతో తగిన సప్లిమెంట్లు వాడుతూ, మంచి ఆహారం తీసుకుంటూ.. ఉదయం, సాయంత్రం తగిలే ఎండలో కాసేపు ఉండేలా చూసుకుంటే ఈ లోపాన్ని త్వరగానే తగ్గించుకోవచ్చు.
Date Of Birth : ఈ నెంబర్ వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం..ఈ నెంబర్ వారికి ఆస్తి తగాదాలు సమసిపోతాయి..





