Family Week : ఫ్యామిలీ వీక్ కోసం బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్.. కంటెస్టెంట్ల లైఫ్ స్టోరీస్‌తో ఎమోషనల్..
Family Week : బిగ్ బాస్ తెలుగు నామినేషన్ల రణరంగంలో ముకేష్, వర్షిణిపై సుధీర్ సంచలన కామెంట్స్, ఫ్యామిలీ వీక్ టాస్క్‌లు మరియు కంటెస్టెంట్ల ఎమోషనల్ ఫ్యామిలీ స్టోరీస్ వివరాలు ఇక్కడ చూడండి.
Family Week
బిగ్ బాస్ హౌస్‌లో ఈ వీక్ నామినేషన్ల వేడి పీక్స్‌కి చేరింది. ఒకరిపై ఒకరు కక్ష తీర్చుకునేలా సాగిన ఈ ప్రాసెస్‌లో మాటల యుద్ధం ఓ రేంజ్‌కు చేరింది. వర్షిణి, నరేష్ మధ్య మొదలైన గొడవ చివరకు ముకేష్, త్రిగుణ్ మధ్య బూతుల వరకూ వెళ్లింది. వర్షిణి తనను బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావని నరేష్‌ను, అలాగే తమ గ్రూప్‌ను విడదీయాలని చూస్తున్నావని శివ్‌ను కార్నర్ చేసింది. ఈ డిస్కషన్ మధ్యలోకి దూరిన ముకేష్.. కాస్త ఓవర్‌గా రియాక్టవడంతో హౌస్‌లో రచ్చ రచ్చ అయింది.
ఇక రామ్ ప్రసాద్ అయితే వీకెండ్లో వర్షిణి తనపై చేసిన కామెంట్లను మళ్లీ గుర్తు చేసి కడిగిపారేశాడు. బిగ్ బాస్ టైమ్ అయిపోవడంతో నెక్స్ట్ వీక్ వస్తానంటూ నవ్వులు కురిపించాడు. శివ్ ఎంట్రీ ఇచ్చి ముకేష్‌పై ఫుల్‌గా ఫైరయ్యాడు. దేబ్జానీ వెనుక తిరుగుతున్నానని తన క్యారెక్టర్‌ను నెగెటివ్ చేశావంటూ శివ్ ఫైర్ అవ్వగా, ముకేష్, వర్షిణి ఇద్దరూ కలిసి అతనిపైకి కాలు దువ్వారు. దేబ్జానీ కూడా ముకేష్‌ను మోస్ట్ డిస్‌రెస్పెక్ట్‌ఫుల్, పాయిజన్, డర్టీ మైండెడ్ అంటూ ఏకేసింది. సుధీర్ సరిగ్గా ఆడటం లేదని మరో నామినేషన్ పడింది.
ఫ్రెండ్ అయి కూడా వెన్నుపోటు పొడిచావంటూ వర్షిణిని నామినేట్ చేసిన త్రిగుణ్, ఆ తర్వాత ముకేష్‌ను కళ్లు తాగిన కోతి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఝాన్సీని వాడుకుని మధ్యదారిలో వదిలేశాడని..ముకేష్, రోహిత్ తన గురించి ఎంత దారుణంగా మాట్లాడుకున్నారో త్రిగుణ్ అందరిముందూ బయటపెట్టాడు. దీంతో నామినేషన్ల ఈ రణరంగం ముగిసేసరికి వంశీ, ముకేష్, అమన్, వర్షిణి, దేబ్జానీ, నీతూ, నరేష్, శివ, సుధీర్, రామ్ ప్రసాద్ ఈ వీక్ ఎలిమినేషన్ డేంజర్‌జోన్‌లో నిలిచారు.
నామినేషన్ల హడావుడి అవక ముందే హౌస్‌మేట్స్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. సుధీర్ తీసుకున్న ఒక స్టాండ్ ముకేష్, వర్షిణికి షాక్ ఇచ్చేలా చేసింది. ముకేష్, వర్షిణి ఇద్దరూ చేసింది తప్పేనని, వర్షిణే ముకేష్‌ను కావాలని రెచ్చగొట్టిందని సుధీర్ ఫేస్ మీద చెప్పేసరికి ఆ ఇద్దరూ షాక్ అయ్యారు. మనమంతా ఒకే టీమ్ అనుకుంటే మాకే వ్యతిరేకంగా మాట్లాడతావా అంటూ ముకేష్ హర్టయ్యాడు.
ఈ గొడవ ఇలా ఉంటే, బిగ్ బాస్ ఈ వీక్కి సంబంధించి రివార్డ్ అండ్ రివెంజ్ గేమ్ అనే క్రేజీ టాస్క్ గురించి చెబుతాడు. నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్(Family Week) అని, అయితే అందరి ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి రావాలంటే కొన్ని ఛాలెంజెస్లో గెలవాలని మెలిపెట్టాడు. అలా గెలిచిన వారికి కెప్టెన్సీ కంటెండర్తో పాటు కుటుంబాన్ని కలిసే లక్ దక్కుతుంది. ఒకవేళ ఎవరికైనా రివార్డ్ కావాలంటే అక్కడి హౌస్ మేట్స్‌పై రివెంజ్ తీర్చుకోవాలి. ఆ రివెంజ్‌కు గురైన వారు మాత్రం ఫ్యామిలీని కలిసే అవకాశాన్ని కోల్పోతారని చెప్పాడు.
కాగా ఈ ఎపిసోడ్ చివర్లో హౌస్మేట్స్ తమ లైఫ్‌లో ఫేస్ చేసిన విషయాలను, ఫ్యామిలీ(Family Week) బ్యాక్‌గ్రౌండ్‌ను పంచుకుంటూ కంటతడి పెట్టించారు. త్రిగుణ్ తన పెళ్లికి ముందే తల్లి చనిపోవడం, భార్య తండ్రి తమను ఆదరించిన తీరును తలచుకుని బాధపడ్డాడు.

అమన్ తండ్రి పంచర్ కొట్టు నడుపుతారని.. అక్క మ్యారేజ్ కోసం ఇల్లు అమ్మేసిన కష్టాలను వివరించాడు. నీతూ మాస్టర్ తన తల్లి పడ్డ అనారోగ్య కష్టాలు, కడుపుకోతలను చెబుతూ బాధపడింది. వర్షిణి తనకు ఫ్రెండ్స్ లేకపోవడం అలాగే రిలేషన్షిప్ బ్రేక్‌డౌన్ తన ఫ్యామిలీని ఎంతగా కుంగదీసిందో చెప్పుకొచ్చింది.
ఇక ముకేష్ అయితే తన తండ్రికి పెరాలసిస్ రావడం, ప్రస్తుతం తన తల్లి బ్రెస్ట్ క్యాన్సర్‌తో మృత్యువుతో పోరాడుతుందని చెబుతూ బాగా ఏడ్చాడు.మొత్తంగా ఈ ఎమోషనల్ మూమెంట్స్‌తో బిగ్ బాస్ హౌస్ వేడెక్కింది.
Expiry Tablets : ఎక్స్పైరీ డేట్ చూడకుండానే టాబ్లెట్లు మింగేస్తున్నారా? అయితే ఇది చూడండి..





