Dongamallanna Temple : దొంగలు కట్టిన అరుదైన గుడి.. రాత్రికి రాత్రే వెలసిన దొంగ మల్లన్న క్షేత్రం
Dongamallanna Temple : ప్రతి ఏడాది మల్లన్నపేట గ్రామంలో జరిగే జాతర, ఉత్సవాలకు చుట్టుపక్కల ఊళ్ల నుంచే కాక ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
Dongamallanna Temple
తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో గల మల్లన్నపేట గ్రామంలోని శ్రీ మల్లన్న ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉందని స్థానికులు చెబుతారు. అంతేకాదు ఈ ఆలయం గురించి తరతరాలుగా ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉందని అంటారు.
పూర్వం ఇద్దరు దొంగలు పశువులను దొంగతనంగా తీసుకుని వచ్చి ఈ ప్రాంతానికి వచ్చారట. అయితే ఆ ఊరిలో జనాలు తమను పట్టుకుంటారేమోననే భయంతో.. అక్కడ ఉన్న శివలింగాన్ని వేడుకున్నారట.
తమను ఎవరూ గుర్తుపట్టకుండా రక్షిస్తే, స్వామివారికి ఆలయం కట్టిస్తామని మొక్కుకున్నారట. ఆ తర్వాత వారిని ఊరిలో వాళ్లెవరూ గమనించకుండానే వారు బయటపడటంతో, మొక్కు ప్రకారం ఒకే రాత్రిలో రాత్రికి రాత్రే మల్లన్న ఆలయాన్ని నిర్మించి అక్కడి నుంచి వెళ్లిపోయారని ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు.
దొంగలు కట్టిన గుడి వల్లే ఈ ఆలయానికి దొంగ మల్లన్న(Dongamallanna Temple) ఆలయం అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. భక్తులు దీన్ని ఆ శివయ్య మహిమగానే భావిస్తారు.
ప్రతి ఏడాది ఇక్కడ జరిగే జాతర, ఉత్సవాలకు చుట్టుపక్కల ఊళ్ల నుంచే కాక ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. గుడిలో శివయ్యకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించి తమ కోరికలు తీర్చమని మొక్కకుంటారు.

అయితే దొంగ మల్లన్న(Dongamallanna Temple) ఆలయం గురించి వినిపిస్తున్న కథ నిజంగా జరిగిన చరిత్ర అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. కేవలం స్థానికులు చెప్పుకునే ఒక కథగానే ప్రచారంలో ఉంది.
అయినా కూడా ఈ మల్లన్న ఆలయం మహిమల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. గుడి ప్రత్యేకత, దాని వెనుకున్న నమ్మకాల వల్ల మన సంస్కృతి, చరిత్రను ఇష్టపడే వారిని కూడా ఈ గుడి బాగా ఆకట్టుకుంటోంది.
Date Of Birth : ఈ నెంబర్ వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం..ఈ నెంబర్ వారికి ఆస్తి తగాదాలు సమసిపోతాయి..





