Russia Education System : అక్షరం కూడా రాయని స్టూడెంట్‌కు 2 మార్కులా? రష్యా విద్యావ్యవస్థ ఒక భారతీయ ప్రొఫెసర్‌ను ఎలా కదిలించింది?
Russia Education System : ఒక్క ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులను బట్టి వాళ్లు ఫెయిల్ అయ్యారని, లేదా దేనికీ పనికిరారని మనమే స్టాంప్ వేసేస్తాము. కానీ ఏ ఒక్క పరీక్ష కూడా ఒక మనిషి లైఫ్‌ను, లేదా వారి ఫ్యూచర్‌ను నిర్ణయించలేదు.
Russia Education System
ఎగ్జామ్‌లో ఒక్క మార్కు తగ్గినా స్టూడెంట్స్‌ను, వారి సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడటం మన విద్యావ్యవస్థలో చాలా కామన్‌గా చూస్తుంటాం. కానీ, జీవితంలో గెలుపు ఓటములను కేవలం మార్కులు మాత్రమే నిర్ణయించలేవని, ప్రతి మనిషి ప్రయత్నానికి ఒక విలువ ఉంటుందన్న విషయం మన దేశంలో చాలా మందికి అర్ధం కాదేమో. అయితే రష్యాలో జరిగిన ఓ అద్భుతమైన సంఘటన రష్యా విద్యావ్యవస్థ గొప్పదనాన్ని చెబుతూనే ఎంతోమందిని ఆలోచనలో పడేసింది.
ఒకసారి మన దేశానికి చెందిన ఒక ప్రొఫెసర్ రష్యాలోని ఎడ్యుకేషన్ సిస్టమ్(Russia Education System)ను రీసెర్చ్ చేయడానికి అక్కడికి వెళ్లారు. అక్కడ పరిశీలిస్తున్న సమయంలో ఆయనకొక వింతైన విషయం ఎదురైంది. అది చూసి ఆయన కొంచెం ఆశ్చర్యానికి గురయ్యారు.
రష్యాలో జరిగే పరీక్షల్లో మ్యాగ్జిమమ్ మార్కులు 5 కాగా, కనీసం ఒక్క అక్షరం కూడా రాయకుండా అలాగే ఖాళీగా వదిలేసిన పేపర్‌కు కూడా అక్కడ 2 మార్కులు ఇస్తున్నారు. అసలు ఏమీ రాయని స్టూడెంట్‌కు సున్నా కూడా ఇవ్వకుండా 2 మార్కులు ఎలా ఇస్తారనే డౌట్ ఆ ప్రొఫెసర్‌ను ఎంతగానో వేధించింది.
తన మనసులోని ఆ అనుమానాన్ని ఆపుకోలేక ఆ ప్రొఫెసర్ అక్కడున్న ఒక సీనియర్ రష్యన్ ప్రొఫెసర్‌ను కలిశారు. ఏమీ రాయని స్టూడెంట్‌కు 2 మార్కులు ఇవ్వడం వెనుకున్న అంతరార్థం ఏంటని ప్రశ్నించారు. దానికి ఆ ప్రొఫెసర్ చిరునవ్వుతో ఇచ్చిన సమాధానం మన భారతీయ ప్రొఫెసర్ ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేసింది.
సున్నా అంటే అసలు ఉనికిలోనే లేకపోవడమని చెప్పిన ఆ ప్రొఫెసర్.. తన ముందు ఒక విద్యార్థి వచ్చి నిలబడినప్పుడు, అతను లేడని నేను ఎలా అనగలను అని ప్రశ్నించారు. ఆ విద్యార్థి ఎగ్జామ్ రాయడానికి ఉదయాన్నే నిద్రలేచి ఉండొచ్చు, ఎముకలు కొరికే మంచులో కష్టపడి ప్రయాణించి ఇంతదూరం వచ్చి ఉండొచ్చు, లేదా బాగా చదివినా కూడా ఎగ్జామ్ హాల్లో భయం వల్ల ఏమీ రాయలేకపోవచ్చు.
కేవలం ఒక్క రోజు సరిగ్గా రాయలేనంత మాత్రాన, ఆ స్టూడెంట్ ఇక్కడి వరకు రావడానికి పడిన మొత్తం శ్రమను మనం ఎలా తుడిచిపెట్టేస్తామని అడిగారు. ఒక టీచర్ అసలు బాధ్యత గల స్టూడెంట్‌ను నువ్వు దేనికీ పనికిరావని చెబుతూ డిజప్పాయింట్ చేయడం కాదు, అతను మళ్లీ కోలుకుని ప్రయత్నించగలడనే నమ్మకాన్ని అతనిలో నింపడమేనని ఆ రష్యన్ ప్రొఫెసర్ వివరించారు. ఈ మాటలు విన్నాక మన భారతదేశపు ప్రొఫెసర్ ఎడ్యుకేషన్‌ను చూసే కోణాన్నే మార్చుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

మనం చాలా త్వరగా ఒక మనిషి సామర్థ్యంపై ఈజీగా తీర్పులు ఇచ్చేస్తుంటాం. ఒక్క ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులను బట్టి వాళ్లు ఫెయిల్ అయ్యారని, లేదా దేనికీ పనికిరారని మనమే స్టాంప్ వేసేస్తాము. కానీ ఏ ఒక్క పరీక్ష కూడా ఒక మనిషి లైఫ్‌ను, లేదా వారి ఫ్యూచర్‌ను నిర్ణయించలేదు.
ప్రపంచంలో విజయవంతమైన ఎంతోమంది సెలబ్రెటీలు తమ లైఫ్‌లో ఎన్నో ఇంటర్వ్యూలలో, బిజినెస్‌లలో ఓటమిని చవిచూసినవారే. వారిని ముందుకు నడిపించింది కేవలం ట్యాలెంట్ మాత్రమే కాదు. వారిపై వారికున్న నమ్మకం అలాగే మేమున్నామని ప్రోత్సహించే మనుషులు ఉండటమే.
అందుకే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు లేదా ఓటమిని ఫేస్ చేసినపుడు ఎందుకు ఫెయిల్ అయ్యావని తిట్టే కంటే, మళ్లీ ప్రయత్నించడానికి నేను నీకు సహాయపడగలనా అని అడిగితే వారిలో కొండంత ఆశ చిగురిస్తుంది.





