Just InternationalJust PoliticalLatest News

Visa Bond Program : 50 దేశాలకు ట్రంప్ బిగ్ షాక్ ..రూ.19 లక్షలు చెల్లిస్తేనే వీసా

Visa Bond Program : అమెరికాలో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా అక్కడే ఉండిపోయే  సమస్యను అరికట్టడానికి, జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి దీనిని అమల్లోకి తెచ్చారు.

Visa Bond Program

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ విదేశాలకు మరో భారీ షాకిచ్చారు. యూఎస్ వీసాల జారీ విషయంలో ఇప్పటికే చాలా నిబంధనలు కఠినతరం చేసిన ట్రంప్ తాజాగా 50 దేశాలపై వీసా బాండ్ ప్రోగ్రామ్(Visa Bond Program) పిడుగు పడేశారు. శాశ్వత వీసా బాండ్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చారు. దీని ప్రకారం అమెరికాలో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా అక్కడే ఉండిపోయే  సమస్యను అరికట్టడానికి, జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి దీనిని అమల్లోకి తెచ్చారు.

గతంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానం విజయవంతం కావడంతో ఆగస్టు 3 నుంచి దీనిని శాశ్వతంగా అమలు చేయాలని యూఎస్ విదేశాంగ శాఖ నిర్ణయించింది. అమెరికా ప్రభుత్వం తాత్కాలిక బిజినెస్, టూరిస్ట్ బీ1,బీ2 వీసాల కోసం ఈ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది.

ఈ నిబంధనల ప్రకారం నిర్దేశిత 50 దేశాల పౌరులు యూఎస్ వీసా పొందాలంటే గరిష్ఠంగా రూ.19 లక్షల వరకూ సెక్యూరిటీ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ 50 దేశాల జాబితాలో భారతదేశం లేదు. దీంతో భారతీయ పౌరులకు ప్రస్తుతానికి ఈ బాండ్ నిబంధన వర్తించదు.

గతంలో పైలట్ ప్రోగ్రామ్ కింద 5,000వేల యూఎస్ డాలర్లు , 10,000వేల యూఎస్ డాలర్లు, 15,000వేల యూఎస్ డాలర్లు ఆప్షన్లు ఉండగా, తాజా నిబంధనల్లో కనీస మొత్తమైన 5,000 వేల యూఎస్ డాలర్లు ఆప్షన్‌ను తొలగించారు. గరిష్ఠ మొత్తాన్ని 20 వేల వేల యూఎస్ డాలర్లకు పెంచారు.

వీసా ఇంటర్వ్యూ సమయంలో కాన్సులర్ అధికారి ఈ బాండ్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఈ నిబంధన వర్తించే 50 దేశాలలో అత్యధికంగా 30 ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. ఆసియా నుంచి బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ వంటి దేశాలు ఉన్నాయి.

Visa Bond Program
Visa Bond Program

ఇదిలా ఉంటే ప్రయాణికులు తమ వీసా గడువు ముగిసేలోగా అమెరికా నుంచి తిరిగి వచ్చేస్తే లేదా ఒకవేళ వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైతే ఈ బాండ్ మొత్తం తిరిగి రిఫండ్ చేసేస్తారు. ఒకవేళ గడువు ముగిసినా అక్కడే ఉండిపోతే మాత్రం బాండ్ డబ్బును ప్రభుత్వం జప్తు చేస్తుంది.

కాగా ట్రంప్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. బాండ్ భారంగా మారి అర్హులైన వారు అమెరికాకు దూరమయ్యే ప్రమాదం ఉండే అవకాశాలుంటాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Mega 158 : మెగా 158 స్పెషల్ వీడియో.. చిరు ఫ్యాన్స్‌కి మైండ్ బ్లాకింగ్ స్టఫ్

Related Articles

Back to top button