Just LifestyleLatest News

Drowsy After Eating : ఫుడ్ తిన్న వెంటనే నిద్ర ముంచుకు వస్తుందా? అది శరీరం ఇస్తున్న వార్నింగ్స్ ఏమో చూడండి..

Drowsy After Eating : బ్రేక్‌ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్ తిన్న వెంటనే బాడీ అంతా వీక్ అయిపోయి నిద్ర వస్తోందా? మెడికల్ భాషలో దీనిని పోస్ట్‌ప్రాండియల్ సోమ్నోలెన్స్ లేదా ఫుడ్ కోమా అంటారు. అసలు ఇది ఎందుకు జరుగుతుంది?

Drowsy After Eating

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసినా, మధ్యాహ్నం భోజనం ముగించినా, చివరికి రాత్రి డిన్నర్ కంప్లీట్ అయ్యాక అయినా సరే.. చాలా మందికి బాడీ మొత్తం ఒక్కసారిగా బలహీనపడిపోయి, కళ్లు మూసుకుపోతున్నట్లు బాగా నిద్ర ఆవహిస్తుంటుంది. తిన్నాక కాసేపు అయినా పడుకోకపోతే (Drowsy After Eating) ఉండలేకపోతున్నామని చాలామంది అనుకుంటారు.అయితే మెడికల్ భాషలో ఈ పరిస్థితిని పోస్ట్‌ప్రాండియల్ సోమ్నోలెన్స్ (Postprandial Somnolence) లేదా సాధారణంగా ఫుడ్ కోమా (Food Coma) అని పిలుస్తారు. ఆహారం తిన్న తర్వాత జీర్ణవ్యవస్థలో జరిగే కొన్ని నేచురల్ ప్రక్రియలతో పాటు, కొన్ని రకాల ఇంటర్నల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఈ సంకేతాలకు మెయిన్ రీజన్ కావొచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా మనం ఫుడ్ తిన్న వెంటనే దానిని డైజెస్ట్ చేసుకోవడానికి జీర్ణ వ్యవస్థ బాగా కష్టపడాల్సి వస్తుంది. ఈ టైమ్‌లో బాడీ తన శక్తినంతటినీ జీర్ణక్రియ వైపు మళ్లించడం వల్ల మిగిలిన అవయవాలన్నీ రెస్ట్ మోడ్‌లోకి వెళ్తాయి. అంతేకాకుండా మనం తీసుకునే ఫుడ్ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు జీర్ణమయ్యేటపుడు బ్రెయిన్‌లో సెరోటోనిన్, మెలటోనిన్ అనే హోర్మోన్లు ఎక్కువగా రిలీజ్‌ అవుతాయి. ఇవి మన మైండ్ అండ్ బాడీని కూల్ చేసి నిద్రపోయేలా ప్రేరేపిస్తాయి.

అయితే ఇది ప్రతిరోజూ, ప్రతి పూటా జరుగుతుంటే మాత్రం కచ్చితంగా అలర్ట్ అవ్వాలి. బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదంటే బ్లడ్ షుగర్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు (Diabetes) ఉన్నప్పుడు తిన్న వెంటనే గ్లూకోజ్ పెరిగి, ఆపై ఒక్కసారిగా డౌన్ అవడం వల్ల తీవ్రమైన అలసట, నీరసం ఆవరిస్తాయి. అలాగే శరీరంలో థైరాయిడ్ హార్మోన్ సరిగా ప్రొడ్యూస్ కాకపోవడం (Hypothyroidism), ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత (Anemia) కూడా కణాలు శక్తిని కోల్పోయేలా చేస్తాయి. రాత్రి సమయాల్లో తగినంతగా నిద్ర లేకపోవడం, డిహైడ్రేషన్ వల్ల కూడా పగటిపూట ఫుడ్ పొట్టలో పడగానే బాడీ రీఛార్జ్ కోసం నిద్రలోకి జారుకోవడానికి ఇలా ట్రై చేస్తుంది.

ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే తక్కువ క్వాంటిటీలో ఎక్కువ సార్లు తింటూ పోషకాహార సమతుల్యతను పాటించాలి. భోజనంలో వైట్ రైస్, మైదా, జంక్ ఫుడ్ వంటి ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్లను తగ్గించి ఆకుకూరలు, కూరగాయలు, ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. తిన్న వెంటనే మంచంపై వాలిపోకుండా అలాగే గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోకుండా కనీసం 10 – 15 నిమిషాల పాటు చిన్నగా వాకింగ్ చేస్తే జీర్ణక్రియ వేగవంతమై శరీరంలో ఆక్సిజన్ ప్రసరణ పెరుగుతుంది. ఒకవేళ నిద్రమత్తుతో(Drowsy After Eating) పాటు ఒళ్లు వణకడం, ఎక్కువ దాహం, మైకం రావడం వంటి ఇతర లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించి బ్లడ్ షుగర్, థైరాయిడ్ టెస్ట్‌లను చేయించుకోవాలి.

Boredom : ఊరికే ఉండటం వేస్ట్ కానే కాదు.. బ్రెయిన్‌ను నిత్యం బిజీగా ఉంచితే ఏం జరుగుతుంది?

Related Articles

Back to top button