Walking : వర్షం పడుతోందని వాకింగ్ ఆపేస్తున్నారా..ఈ హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే అసలు ఆగరు..
Walking : వర్షం పడేటప్పుడు వాతావరణంలో ఉండే పొల్యూషన్ తగ్గి గాలి కూడా బాగా శుభ్రపడుతుంది. స్వచ్ఛమైన గాలిని, తడిసిన మట్టి వాసనను ఆస్వాదిస్తూ వాకింగ్ చేయడం వల్ల మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది.
Walking
బయట వర్షం పడితే చాలు ఈరోజుకి వాకింగ్, రన్నింగ్‌కి బ్రేక్ ఇచ్చేయొచ్చని చాలామంది అనుకుంటారు. అయితే వర్షాన్ని ఒక సాకుగా చూపి వాకింగ్ వంటివి పక్కన పెట్టాల్సిన అవసరం లేదని, నిజానికి ఓ మోస్తరు వానలో నడిస్తే వచ్చే అద్భుతమైన ఆరోగ్య లాభాలు మరే సమయంలో కూడా దక్కవని హెల్త్ నిపుణులు గట్టిగా చెబుతున్నారు.
చిన్న చిన్నచినుకులు నడిచేటప్పుడు వచ్చే ఆ మట్టి వాసన కేవలం మనస్సుకు హాయినివ్వడమే కాదు, మన ఒంట్లోని అన్ని అవయవాలకు ఒక కొత్త రీఛార్జ్ వంటిదని రీసెర్చ్‌లు చెబుతున్నాయి.
వర్షపు బిందువులు నేలను తాకినప్పుడు గాల్లోకి నెగిటివ్ అయాన్లు విపరీతంగా రిలీజవుతాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధనల ప్రకారం.. ఈ అయాన్లు గల ఎయిర్‌ను మనం పీల్చినప్పుడు మన బ్రెయిన్‌లో సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ ఉత్పత్తి బాగా పెరుగుతుందట.
ఈ హ్యాపీ హార్మోన్ మనస్సులో ఉన్న టెన్షన్, స్ట్రెస్‌లను క్షణాల్లో మాయం చేసేసి ప్రశాంతతను ఇస్తుంది. అంతేకాకుండా ధమనుల్లో రక్తపోటును తగ్గించి, రక్తం సాఫీగా ప్రసరించేలా చేస్తుంది. బాడీలోని కణజాలాలకు పుష్కలంగా ఆక్సిజన్ అందడం వల్ల మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండేలా చేస్తుంది.
పైగా వర్షం పడేటప్పుడు వాతావరణంలో ఉండే పొల్యూషన్ తగ్గి గాలి కూడా బాగా శుభ్రపడుతుంది. స్వచ్ఛమైన గాలిని, తడిసిన మట్టి వాసనను ఆస్వాదిస్తూ వాకింగ్ చేయడం వల్ల మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది.
ఓ మోస్తరు వానలో వాకింగ్ చేయడం వల్ల గాఢమైన నిద్ర పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. వర్షం పడుతున్నప్పుడు కలిగే వాతావరణ మార్పుల వల్ల బ్రెయిన్‌లో నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ స్పీడ్‌గా ప్రొడ్యూస్ అవుతుంది. దానికి తోడు చల్లటి గాలి వల్ల బాడ టెంపరేచర్ కాస్త తగ్గి, బాడీకి రెస్ట్ కావాలనే సంకేతాలు మెదడుకు వెళ్లి ఆరోజు బాగా నిద్ర పడుతుంది.
అయితే వానలో నడిచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాకింగ్‌కి వెళ్లేటప్పుడు గొడుగు క్యారీ చేయడం కంటే తల నుంచి కింద వరకు కవర్ అయ్యే మంచి రెయిన్ కోట్ వేసుకుంటే బెటర్. అలాగే గ్రిప్ ఉండే వాటర్ ప్రూఫ్ షూస్ వాడాలి, బట్టల విషయానికొస్తే కాటన్ కాకుండా త్వరగా ఆరిపోయే సింథటిక్ లేదా వాటర్ ప్రూఫ్ బట్టలు వేసుకుంటే జలుబు, జ్వరం బారిన పడకుండా ఉండొచ్చు.

అయితే మరీ కుండపోత వర్షంలో వాకింగ్ చేయకుండా లైట్ చినుకులు పడేటప్పుడు మాత్రమే చేయాలి. వీలైనంత వరకు మట్టి రోడ్ల కంటే పార్కులు, సరైన వాకింగ్(Walking) ట్రాక్‌లను ఎంచుకోవాలి.
వాకింగ్(Walking) అయ్యాక ఇంటికి రాగానే గోరువెచ్చటి వాటర్‌తో స్నానం చేసి, బాడీకి మాయిశ్చరైజర్ రాసుకుని పొడి బట్టలు వేసుకోవాలి. వేడివేడి సూప్, హెర్బల్ టీ వంటివి తాగితే మంచిది. అయితే, వర్షంలో తడిస్తే వెంటనే ఇన్ఫెక్షన్లు వచ్చేవాళ్లు అలాగే చిన్న పిల్లలు,పెద్దవాళ్లు, గర్భిణులు వానలో తడవకుండా ఇంట్లోనే ఉంటే బెటర్.
Arunachalam : తెరుచుకున్న అరుణాచల మోక్ష మార్గం.. కానీ భక్తులు ఈ రూల్స్ పాటించాల్సిందే..





