RBI : వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం..ఈఎంఐ భారం తగ్గుతుందా లేదా?
RBI : ఆర్బీఐ చివరిసారిగా 2025 డిసెంబర్లో రెపో రేటును 0.25 శాతం తగ్గించింది. అప్పటి నుంచి ఈ రెపో రేటు 5.25 శాతం దగ్గరే కదలకుండా అలానే ఉంది.
RBI
లోన్లు తీసుకున్న సామాన్యుడి నుంచి పెద్ద పెద్ద బిజినెస్‌మేన్ వరకు ప్రతీ ఒక్కరూ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఆర్బీఐ క్రెడిట్ పాలసీ గురించి ఎనౌన్స్మెంట్ రానే వచ్చేసింది. భారత్‌లో పెరుగుతున్న ధరల భారాన్ని అంటే ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్లో ఉంచుతూనే, భారత దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పవర్ ఫుల్ డెసిషన్ తీసుకుంది.
అందరూ ఊహించినట్లుగానే, ఆర్బీఐ(RBI) పాలసీ కమిటీ వరుసగా నాలుగోసారి కూడా వడ్డీ రేట్లను మార్చకుండా ఎప్పటిలాగే ఉంచుతున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా ఈ కొత్త పాలసీ డీటెయిల్స్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
ఇక అసలు విషయానికి వస్తే, ఆర్బీఐ చివరిసారిగా 2025 డిసెంబర్లో రెపో రేటును 0.25 శాతం తగ్గించింది. అప్పటి నుంచి ఈ రెపో రేటు 5.25 శాతం దగ్గరే కదలకుండా అలానే ఉంది. గతేడాది మొత్తంలో వడ్డీ రేట్లను ఏకంగా 1.25 శాతం వరకు తగ్గించినా.. ఈ ఇయర్ జరిగిన 4 వరుస పాలసీ మీటింగ్‌లలో ఆర్బీఐ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం.
ఒకవైపు గ్లోబల్‌గా ఉన్న చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటంతో వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతుంటే, మన ఆర్బీఐ మాత్రం చాలా కూల్‌గా న్యూట్రల్ వైఖరిని కంటిన్యూ చేయాలని నిర్ణయం తీసుకుంది.
దీని వల్ల అసలేం జరుగుతుంది అని చాలామందికి డౌట్ రావచ్చు. రెపో రేటు 5.25 శాతం దగ్గరే కానిస్టెంట్గా ఉండటం వల్ల హోమ్ లోన్లు, కార్ లోన్లు , పర్సనల్ లోన్లు తీసుకున్న వారి ఈఎంఐలలో ఎలాంటి హఠాత్ మార్పులు ఉండవు. అంటే లోన్ కడుతున్న వారికి ఇది ఒక విధంగా పెద్ద ఊరట అనే చెప్పొచ్చు.

బ్యాంకులు కూడా డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లలో పెద్దగా కటింగ్స్ విధించవు కాబట్టి సేవింగ్స్ చేసుకునే వారికి కూడా మంచిదే. ధరల స్థిరత్వంతో పాటు బిజినెస్ ఫీల్డ్‌కు కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ దక్కుతుంది.
దీని వల్ల దేశీయ మార్కెట్లు మరింతగా బలం పుంజుకునే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉన్నా కూడా, ఆర్బీఐ తీసుకున్న ఈ బ్యాలెన్స్డ్ డెసిషన్ వల్ల భారత దేశ ఆర్థిక పురోగతి చాలా స్థిరంగా ముందడుగు వేస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Big Boss -10 : బిగ్ బాస్-10 లాంచ్ డేట్ లీక్..15 వారాల నాన్‌స్టాప్ డ్రామాకి టైమింగ్స్ ఫిక్స్





