Just Andhra PradeshJust PoliticalLatest News

Vijayasai Reddy : సాయన్న సాయం వామ్‌ అప్‌ సాంగ్‌తో ఏపీ పాలిటిక్స్‌లో హీట్..నవంబర్ 11 కోసం వెయిటింగ్..

Vijayasai Reddy : సాయన్న పేరులోనే సాయముందిరా.. విజయసాయిరెడ్డి అన్న అడుగులోనే విజయముందిరా అనే చరణాలతో సాగే ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

Vijayasai Reddy

వైసీపీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన తర్వాత కొంతకాలం పాలిటిక్స్‌కు దూరంగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి( Vijayasai Reddy) మళ్లీ చురుకైన రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇతర ప్రధాన రాజకీయ పార్టీలలో చేరతారనే ప్రచారానికి స్వస్తి పలుకుతూ, ఆంధ్రప్రదేశ్‌లో తనే సొంతంగా కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేయడానికి కొన్ని నెలలుగా సన్నాహాలు చేసుకుంటున్నారు.

దీనిలో భాగంగానే రాబోయే నవంబర్ 11వ తేదీన విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఉదయం 11 గంటల 11 నిమిషాలకు తమ కొత్త పార్టీ జెండా, ఎజెండాలను అఫీషియల్‌గా వెల్లడించనున్నట్లు విజయసాయి రెడ్డి ఇదివరకే ప్రకటించారు.

అయితే ఈ ముఖ్యమైన కార్యక్రమానికి కొద్ది రోజుల ముందే జనాల దృష్టిని ఆకర్షించేలా విజయసాయిరెడ్డి ఒక స్పెషల్ వామ్ అప్ సాంగ్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. సాయన్న పేరులోనే సాయముందిరా.. విజయసాయిరెడ్డి అన్న అడుగులోనే విజయముందిరా అనే చరణాలతో సాగే ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పార్టీ ప్రకటనకు ముందే శ్రేణులలో, మద్దతుదారులలో ఒక స్పష్టమైన పొలిటికల్ మెసేజ్‌ను పంపడానికి వారిలో ఉత్సాహాన్ని నింపడానికి ఈ క్యాంపెయిన్ సాంగ్‌ను వ్యూహాత్మకంగా ఉపయోగించినట్లు కనిపిస్తోంది.

ఒకప్పుడు వైసీపీలో రెండో ముఖ్య నేతగా తిరుగులేని చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి, 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో ఆ పార్టీతో వైరం పెంచుకుని బయటకు వచ్చేశారు. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలపై బహిరంగంగానే తీవ్రమైన విమర్శలు గుప్పించిన విజయసాయి రెడ్డి, ఇప్పుడు కొత్త తరం నాయకత్వమే టార్గెట్‌గా.. జెన్ జీ ఐడియాలజీతో ముందుకెళ్తామని చెబుతున్నారు.

అధికార, ప్రతిపక్షాల వైఫల్యాలను ఎండగడుతూ ఏపీ ప్రజల ఆకాంక్షలే తమ పార్టీ ఎజెండాగా ఉంటుందని విజయసాయి రెడ్డి స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా ఈనెల 11వ తేదీన ఆయన ప్రకటించబోయే కొత్త పార్టీ పేరు, గుర్తు, ఫ్యూచర్ పొలిటికల్ స్ట్రాటజీలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఫుల్ క్యూరియాసిటీ నెలకొంది.

Lice Gnawer : పేను కొరుకుడు దేని వల్ల వస్తుంది? దీనికి చెక్ పెట్టడం ఎలా?

Related Articles

Back to top button