Gold Lovers : గోల్డ్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. 10 గ్రాముల పసిడి రూ.1.93 లక్షలు కాబోతోందట..
Gold Lovers : పుత్తడి పరుగులు ఇక్కడితో ఆగవని..రానున్న రోజుల్లో గోల్డ్ ధరలు ఆకాశాన్ని తాకుతాయని ఫేమస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం మోతీలాల్ ఓస్వాల్ తమ లేటెస్ట్ నివేదికలో చెప్పింది.
Gold Lovers
ఇప్పుడు గోల్డ్ కొనాలా వద్దా అని ఆలోచించే వాళ్లకు, బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారికి కళ్లు బైర్లు కమ్మే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. దీంతో ప్రస్తుతం ఉన్న ధరలతోనే పసిడి పేరెత్తితేనే హడలిపోతున్న జనాలు.. రానున్న రోజుల్లో మరింత షాక్ అవ్వడం ఖాయం అని తెలుస్తోంది.
ఎందుకంటే పుత్తడి పరుగులు ఇక్కడితో ఆగవని..రానున్న రోజుల్లో గోల్డ్ ధరలు ఆకాశాన్ని తాకుతాయని ఫేమస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం మోతీలాల్ ఓస్వాల్ (MOFSL) తమ లేటెస్ట్ నివేదికలో తేల్చి చెప్పేసింది.
10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ఏకంగా రూ.1.93 లక్షల మార్క్‌ని రీచ్ అవ్వొచ్చంటూ ఇచ్చిన ప్రెడిక్షన్ ఇప్పుడు బులియన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది.
గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు పెరగడానికి కేవలం యుద్ధాలు, బౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే. వాటి కంటే కూడా.. ఎక్కువగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తీసుకునే ద్రవ్య విధానాలు, మార్కెట్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం అనేవి మెయిన్ రీజన్స్ అని మోతీలాల్ ఓస్వాల్ వివరించింది.
పెట్టుబడి పెట్టేవాళ్లు కేవలం గొడవలను మాత్రమే చూడటం లేదని, ఆ ఉద్రిక్తతలు వడ్డీ రేట్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయనే పాయింట్‌పైన కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని రీసెర్చ్ వెల్లడించింది.
రానున్న రోజుల్లో గ్లోబల్ మార్కెట్‌ను నడిపించేది అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ సిగ్నల్స్, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు జరిపే బల్క్ గోల్డ్ అమ్మకాలు, గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి వచ్చే ఇన్వెస్ట్మెంట్లేనని మోతీలాల్ ఓస్వాల్ కమోడిటీ ఎక్స్పర్ట్ తెలిపారు.
మధ్యమధ్యలో తక్కువ సమయంలో రేట్లు కాస్త అటుఇటుగా మారినా, తర్వాత మాత్రం ఇన్స్టిట్యూషనల్ డిమాండ్ వల్ల బంగారం గ్రాఫ్ పైకే వెళ్తుందని విశ్లేషించారు.
ప్రపంచ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ఔన్సు గోల్డ్ కాస్ట్ త్వరలోనే 4,800 డాలర్లకు, ఆ తర్వాత రాబోయే 12 నుంచి 15 నెలల కాలంలో ఏకంగా 5,500 డాలర్లకు చేరుకునే అవకాశ ఉంది.

ఇక మన దేశీయ మార్కెట్ విషయానికొస్తే.. 10 గ్రాముల గోల్డ్ కాస్ట్ ముందు రూ.1.68 లక్షల మార్క్‌ని టచ్ చేసి, ఆ తర్వాత 12-15 నెలల సమయంలో ఏకంగా రూ.1.93 లక్షల గరిష్ఠ స్థాయికి ఎగబాకుతుందని నివేదికలో అంచనా వేశారు.
ఈ గ్యాప్‌లో బంగారం ధరలు 6 నుంచి 8 శాతం వరకు కాస్త తగ్గినట్లు అనిపించినా.. అది కేవలం టెంపరరీ డిప్ మాత్రమేనని, ఆ తర్వాత ఆ ధరలు మరింత వేగంగా బౌన్స్ బ్యాక్ అవుతాయని నివేదిక స్పష్టం చేసింది.
Transparency : బంధంలో సగం నిజాలు ప్రమాదమా? పార్ట్నర్తో పూర్తి ట్రాన్స్పరెన్సీతో ఉండాల్సిందేనా?





