Air India : ఎయిర్ ఇండియాలో ఇకపై పైలట్లకు డోప్ టెస్టులు..ఇండియాలో గంజాయి వాడకం అసలెందుకు పెరుగుతుంది?
Air India : ప్రస్తుతం సోషల్ మీడియా ఎఫెక్ట్, నేచురల్ హెర్బ్ అనే తప్పుడు అభిప్రాయాల వల్ల ఇండియాలో కూడా గంజాయి వాడకం పెరుగుతోంది.
Air India
వేల అడుగుల ఎత్తులో ఆకాశంలో జర్నీ చేస్తున్నప్పుడు ప్రయాణికుల ప్రాణాలకు ఫుల్ సేఫ్టీ ఉండాలనే దిశగా ఎయిర్ ఇండియా ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. తమ సంస్థల్లోని పైలట్లు అందరికీ ఇకపై డోప్ పరీక్షలను తప్పనిసరి చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఎయిర్ ఇండియాతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పరిధిలోని ప్రతి కెప్టెన్‌కు కూడా ఈ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ప్లైట్‌లో చోటుచేసుకున్న తీవ్రమైన లోపం, ఆ తర్వాతి ఇన్సిడెంట్‌తో పైలట్‌కు నిర్వహించిన డోప్ టెస్టులో గంజాయి పాజిటివ్‌గా తేలడమే ఈ డెసిషన్ తీసుకోవడానికి ప్రధాన కారణం.
ఫుకెట్ నుంచి 137 మంది ప్రయాణికులతో, 8 మంది క్రూ తో ఢిల్లీకి బయలుదేరిన ఏఐ-2379 ప్లైట్ ఒడిశా ప్రాంతంలో హఠాత్తుగా దాదాపు 300 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. ఈ ఊహించని పరిణామంతో కనీసం 20 మంది ప్రయాణికులతో పాటు, నలుగురు ఎయిర్ ఇండియా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన జరిగిన సమయంలో మెయిన్ పైలట్ సుదీప్ వశిష్ఠ్ కాక్‌పిట్ సీటులో కాకుండా బయట ఉన్నారని, కో-పైలట్ మాత్రమే విమానాన్ని కంట్రోల్ చేస్తున్నారని ఇంటర్నల్ ఇన్విస్టిగేషన్లో తేలింది. ఢిల్లీలో ఫ్లైట్ సురక్షితంగా దిగిన తర్వాత ప్రయాణికులను పరామర్శించిన ఆ పైలట్.. సరిగ్గా నిలబడలేక తూలిపోతున్నట్లు కనిపించడంతో అధికారులకు అనుమానం వచ్చి పరీక్షలు చేయించారు.
అప్పుడు నిర్వహించిన డోప్ టెస్టులో పైలట్ యూరిన్ శాంపిల్స్‌లో గంజాయి ఉపయోగించినట్లు తేలడం విమానయాన వర్గాల్లో కలకలం రేపింది. కన్ఫర్మేషన్ కోసం రెండోసారి టెస్ట్ చేసినా కూడా మళ్లీ పాజిటివ్‌గానే వచ్చింది. దీనిపై మాట్లాడిన పైలట్ సుదీప్ .. నిద్రలేమి సమస్య వల్ల డాక్టర్ సలహాతో మెడిసిన్ వాడానని, డ్యూటీ షెడ్యూల్స్ వల్ల సరిగ్గా నిద్ర ఉండటం లేదని వివరణ ఇచ్చారు.
కానీ ప్రయాణికుల సేఫ్టీతో చెలగాటం ఆడలేమని భావించిన ఎయిర్ ఇండియా(Air India ), డీజీసీఏ కండీషన్ల కంటే మరింత కఠినంగా ఇకపై .. గురుగ్రామ్ అకాడమీలో ట్రైనింగ్ టైమ్‌లో, ఫ్లైట్ బ్రిఫింగ్ సెంటర్లలో ప్రతి పైలట్‌కూ డోప్ టెస్ట్ తప్పనిసరి చేసింది. అలాగే నిషేధిత మత్తు పదార్థాలు ఏవైనా ఉపయోగిస్తుంటే వారు ముందే తమకు వెల్లడిస్తే రహస్యంగా ఉంచి ట్రీట్మెంట్ అందిస్తామని ప్రకటించింది.
ఈ రగడ అంతటికీ కారణమైన గంజాయి వాడకంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. శాస్త్రీయంగా చూస్తే గంజాయి తీసుకోవడం వల్ల ప్రయోజనాలు కన్నా నష్టాలే ఎక్కువ. ఇది మెదడులోని నెర్వస్ సిస్టంపై డైరెక్టుగా ఎఫెక్ట్ చూపిస్తుంది.
మెల్లగా మనిషిలోని ఆలోచనా శక్తిని తగ్గించి, మైండ్ రియాక్షన్ టైమ్‌ను స్లో చేసేస్తుంది. అయితే డ్రైవింగ్ చేసే సమయంలో మరి ముఖ్యంగా ప్లైట్స్ నడిపేటప్పుడు మైక్రో సెకన్లలో ఎమర్జెన్సీ కోసం డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ గంజాయి మత్తులో వారి మైండ్ సరిగ్గా రియాక్టవదు. అంతేకాకుండా ఇది గుండెపోటు, తీవ్ర మెంటల్ ఇల్నెస్కు దారితీస్తుంది. క్యాన్సర్ లాంటి వ్యాధుల నొప్పుల రిలీఫ్ కోసం డాక్టర్ల అబ్జర్వేషన్లో మెడిసిన్ రూపంలో తప్ప, మామూలుగా వాడితే వారి ఆరోగ్యం పూర్తిగా నాశనమవుతుంది.
ప్రస్తుతం సోషల్ మీడియా ఎఫెక్ట్, నేచురల్ హెర్బ్ అనే తప్పుడు నమ్మకాల వల్ల ఇండియాలో కూడా దీని వాడకం పెరుగుతోంది. ఇప్పుడు ఎయిర్ ఇండియా(Air India )తీసుకున్న ఈ డోప్ టెస్టింగ్ డెసిషన్ ప్రయాణికుల నమ్మకాన్ని కాపాడే దిశగా పడిన అతిపెద్ద అడుగే అని చెప్పొచ్చు.
Lotus Seeds : లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవి..శ్రావణమాసంలో వీటితో పూజ చేస్తే మీ ఇంట ధనవర్షమే..





