Just EntertainmentLatest News

Chiranjeevi Podcast : నెట్‌ఫ్లిక్స్‌తో మెగాస్టార్ క్రేజీ పాడ్‌కాస్ట్..బిహైండ్ ది సక్సెస్ సీక్రెట్స్ ..

Chiranjeevi Podcast : ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్‌పై ఆడియన్స్‌ను ఉర్రూతలూగించిన చిరు, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త అవతారంలో సందడి చేయడానికి ప్లాన్ రెడీ చేసుకున్నారు.

Chiranjeevi Podcast

తెలుగు సినీ సామ్రాజ్యాన్ని సుమారు అర్ధ శతాబ్దం పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఒకే ఒక్క పేరు.. మెగాస్టార్ చిరంజీవి. సుమారు 48 ఏళ్లుగా తన డ్యాన్సులు, ఫైట్లు, అసమాన నటనతో కోట్లాది మంది ఫ్యాన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఈ టాలీవుడ్ లెజెండ్, ఇప్పుడు రూట్ మార్చబోతున్నారు.

ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్‌పై ఆడియన్స్‌ను ఉర్రూతలూగించిన చిరు, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త అవతారంలో సందడి చేయడానికి ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కాంబోలో ఒక గ్రాండ్ అండ్ స్పెషల్ పాడ్‌ కాస్ట్ సిరీస్‌కు మెగాస్టార్(Chiranjeevi Podcast) శ్రీకారం చుట్టబోతున్నారన్న వార్త ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

నిజానికి శివశంకర వరప్రసాద్‌ మైండ్ బ్లాకింగ్ సినీ ప్రస్థానాన్ని, చిరంజీవిగా ఆయన సాధించిన హిస్టారికల్ విక్టరీస్‌ను బేస్‌ చేసుకుని ఒక బయోపిక్‌లా డ్యాక్యుమెంటరీని తెరకెక్కించాలని ముందు అనుకున్నారట. అయితే డాక్యుమెంటరీ కంటే ఒక పాడ్‌ కాస్ట్ అయితే తన మనసులోని మాటలను, గుండెల్లో దాచుకున్న తీపి జ్ఞాపకాలను, ఎంత వద్దనుకున్నా ఇప్పటికీ గుర్తుండిపోయే అవమానాలను .. ఎలాంటి హద్దులు లేకుండా స్వేచ్ఛగా, డైరెక్టుగా ఫ్యాన్స్‌తో పంచుకోవచ్చని మెగాస్టార్ భావించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ క్రేజీ అండ్ డిఫరెంట్ ఐడియాను మెగాస్టార్ కుమార్తె,ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదెలతో పాటు టాలీవుడ్ స్టార్ రైటర్ బీవీఎస్ రవి చిరు ముందుంచగా.. వినగానే డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపించడంతో వెంటనే పచ్చజెండా ఊపేశారట.

బీవీఎస్ రవి ఇప్పటికే చాలా పాపులర్ టాక్ షోలకు సూపర్‌హిట్ కాన్సెప్టులతో పాటు, కంటెంట్‌ను అందించి సక్సెస్ అయిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. అందుకే ఈ మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్టుకు కూడా రైటింగ్‌తో పాటు క్రియేటివ్ డిజైన్ బాధ్యతలను రవి భుజాన వేసుకున్నారు.

టీవీ ఇంటర్వ్యూలు, మూవీ ప్రమోషన్లలో ఎప్పుడూ పంచుకోని ఎన్నో సీక్రెట్స్, సుదీర్ఘ సినీ జర్నీలో ఎదురైన ఊహించని ఎత్తుపల్లాలు, ఈ స్థాయి రారాజుగా నిలబడటం వెనుక ఆయన పడిన కష్టం, అనుభవాలను ఈ పాడ్‌ కాస్ట్ షో ద్వారా చిరు(Chiranjeevi Podcast) రివీల్ చేయబోతున్నారు.

Chiranjeevi Podcast
Chiranjeevi Podcast

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మెగా అనౌన్స్‌మెంట్‌ను నెట్‌ఫ్లిక్స్ అతి త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకూ సిల్వర్ స్క్రీన్‌పై మెగాస్టార్‌ను చూసి ఈలలు వేసిన ఫ్యాన్స్.. ఇప్పుడు ఓటీటీ స్క్రీన్‌పై రియల్ లైఫ్ మాటలను డైరెక్టుగా వినడానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి డిజిటల్ రీచ్‌ను షేక్ చేసేలా ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ పాడ్‌ కాస్ట్ షో.. ఓటీటీ చరిత్రలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Apple Pay : డిజిటల్ మార్కెట్లోకి యాపిల్ పే ఎంట్రీ.. ఫోన్‌పే, గూగుల్ పే యాప్‌లకు చెక్ తప్పదా?

Related Articles

Back to top button