Vishwanath And Sons : విశ్వనాథ్ అండ్ సన్స్ ఎలా ఉంది? వెంకీ అట్లూరి మ్యాజిక్ వర్కవుట్ అయిందా?
Vishwanath And Sons : విశ్వనాథ్ అండ్ సన్స్‌లో సంజయ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడానికి రీజన్ ఏంటి? సంజయ్ తండ్రి విశ్వనాథ్ తీసుకున్న నిర్ణయం సంజయ్ లైఫ్‌ను ఎలాంటి మలుపులు తిప్పింది?
Vishwanath And Sons
బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పడి చాలా రోజులైందని అనుకుంటున్న సమయంలో, కోలీవుడ్ వర్సటైల్ స్టార్ సూర్య, లక్కీ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో.. ఆడియన్స్ ముందుకు వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath And Sons) మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.. ఆగస్టు 14న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెట్‌తోనే ముందు ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ చేసేసింది.
దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీని స్టార్ట్ చేయడమే ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించే హై-వోల్టేజ్ సీన్‌తో గ్రాండ్‌గా స్టార్ట్ చేశాడు. స్టోరీ ఒక్కసారి టేకాఫ్ అయ్యాక ఇక ఆడియన్స్‌కు ఎక్కడా బోర్ కొట్టకుండా రేసీగా నడిపించాడు. ఫస్టాఫ్‌ను పూర్తిగా హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అలాగే ఫుల్ ఎమోషన్స్‌తో నింపేశాడు.
సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఒలింపిక్స్ షూటింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన అథ్లెట్, అలాగే వేల కోట్ల సంపన్న కుటుంబానికి చెందిన బిజినెస్ మెన్ కూడా. 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే బతికేస్తుంటాడు.
అయితే తమకు సరైన వారసుడు లేడని తల్లి నిర్మల (రాధిక శరత్ కుమార్) ఎమోషనల్ అవడం చూసి చలించిపోయి, సరోగసి పద్ధతి ద్వారా ఒక బాబుకి తండ్రి అవుతాడు. కానీ ఊహించని విధంగా ఆ పిల్లాడికి బోన్ మ్యారో రిప్లేస్‌మెంట్ సర్జరీ చేయాల్సివస్తుంది.
ఆ గండం నుంచి బిడ్డను కాపాడుకోవడానికి డోనర్ కోసం వెతుకుతూ సరోగసి మదర్ మ్యాడీ (మమితా బైజు)ని సంజయ్ మీట్ అవుతాడు. అలా చిన్నారి కోసం ఇండియాకు వచ్చిన మ్యాడీ.. సంజయ్ మంచితనం, ప్రవర్తన చూసి నిజంగానే లవ్‌లో పడి ఓపెన్‌గా ప్రపోజ్ చేస్తుంది. అయితే వారి మధ్యనున్న ఏజ్ గ్యాప్ కారణంతో ఆ ప్రేమను సంజయ్ నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తాడు.
సూర్య, రాధిక, మమితా బైజుల మధ్య వచ్చే ప్రతీ సీన్ థియేటర్‌లో విజిల్స్ వేయిస్తుంది. వీరి ముగ్గురి కెమిస్ట్రీ స్క్రీన్ మీద చాలా ఫ్రెష్‌గా వర్కవుట్ అయింది. ప్రథమార్ధంలో సంజయ్‌కు మ్యాడీ ఇచ్చే ఒక చిన్న షాకింగ్ ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై మైండ్ బ్లాకింగ్ క్యూరియాసిటీ పెంచడంలో డైరెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు.
డైరెక్టర్ పూర్తిగా ఎమోషనల్ కంటెంట్ మీద బలంగా ఫోకస్ చేశాడు. సీన్ బై సీన్ ఫ్యామిలీ బాండింగ్‌ను డ్రామాటిక్‌గా డిజైన్ చేసుకుంటూ వచ్చాడు.సూర్య , రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్, నాజర్, మమితా అందరూ తమ యాక్టింగ్‌తో హండ్రెడ్‌కు హండ్రెడ్ మార్కులు కొట్టేశారు. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు సాగిన ఫ్యామిలీ డ్రామా గుండెను పిండేస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే.. సంజయ్ విశ్వనాథ్‌గా సూర్య లగ్జరీ అండ్ ఎమోషనల్ వేరియేషన్స్ చూపెట్టి నెక్స్ట్ లెవెల్‌లో పెర్ఫామ్ చేశాడు. రొమాన్స్, ఎమోషన్, యాక్షన్.. ఇలా అన్నింటిలోనూ తానేంటో నిరూపించుకున్నాడు. ఇక మమితా బైజు ఈ మూవీలో రియల్ బ్యాక్‌బోన్‌గా మారి సూర్యలాంటి గ్రేట్ యాక్టర్ పక్కన పోటీపడి మరీ నటించింది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ప్రొడ్యూసర్స్ నాగవంశీ, సాయి సౌజన్య మనీ గురించి ఏమాత్రం ఆలోచించలేదన్న విషయం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. టెక్నికల్‌గా చూస్తే జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్..మూవీ ఎమోషన్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ స్క్రీన్‌ను మరింత రిచ్‌గా ప్రెజెంట్ చేయగా, నవీన్ నూలీ ఎడిటింగ్ పర్ఫెక్ట్ క్రిస్పీగా ఉందన్న టాక్ తెచ్చుకుంది.
ఈ మూవీలో సంజయ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడానికి వెనుకున్న గతం ఏంటి? సంజయ్ తండ్రి విశ్వనాథ్ తీసుకున్న ఒక్క నిర్ణయం సంజయ్ లైఫ్‌ను ఎలాంటి మలుపులు తిప్పింది? చివరకు మ్యాడీ లవ్‌ను సంజయ్ ఒప్పుకున్నాడా లేదా అనే అంశాలతో స్టోరీ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది.
రేటింగ్: 3.5 / 5





