Just NationalJust EntertainmentLatest News

Sowcar Janaki : ఏడు పదుల నటప్రయాణానికి ఎండ్ కార్డ్..చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ షావుకారు జానకి తుదిశ్వాస

Sowcar Janaki : చిన్న వయసులోనే సిల్వర్ స్క్రీన్‌కు పరిచయమైన జానకమ్మ, తన ప్రత్యేకమైన వాయిస్ బేస్, డైలాగ్స్ చెప్పే టైమింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Sowcar Janaki

భారతీయ చిత్రసీమలో ఒక శకం ముగిసిపోయింది. తన గాంభీర్యమైన నటనతో, మధురమైన డైలాగ్ డెలివరీతో అన్ని తరాల సినీ ప్రేక్షకులను అలరించిన లెజెండరీ యాక్ట్రెస్, సీనియర్ నటి షావుకారు జానకి (95) కాసేపటి క్రితం కన్నుమూశారు.

కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న జానకమ్మ చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ అఫీషియల్‌గా ధృవీకరించడంతో దక్షిణాది సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది.

వారం రోజులుగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎక్కువవ్వడంతో కుటుంబ సభ్యులు జానకమ్మను వెంటనే చెన్నైలోని హాస్పిటల్‌లో చేర్పించి ప్రత్యేక వైద్యాన్ని అందించారు. అయితే ఈరోజు పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూశారు.

1950ల కాలంలోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జానకమ్మ, తన మొదటి సినిమా షావుకారు ఇచ్చిన అపారమైన గుర్తింపుతో ఆ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని షావుకారు జానకి(Sowcar Janaki)గా ప్రాచుర్యం పొందారు.

Sowcar Janaki
Sowcar Janaki

చాలా చిన్న వయసులోనే సిల్వర్ స్క్రీన్‌కు పరిచయమైన జానకమ్మ, తన ప్రత్యేకమైన వాయిస్ బేస్, డైలాగ్స్ చెప్పే టైమింగ్‌తో దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

హీరోయిన్‌గానే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో సుదీర్ఘ కాలం పాటు వేలాది వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించి అందరి హృదయాల్లో నిలిచిపోయారు. అంతేకాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా తనదైన ముద్ర వేసిన ఈ మహానటి మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Irumudi : మాస్ మహారాజా మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ .. ఇరుముడితో రవితేజ ఖాతాలో బ్లాక్‌బస్టర్ పడినట్లేనా?

Related Articles

Back to top button