Just NationalJust BusinessLatest News

Gold Prices : గోల్డ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..వరుసగా రెండో రోజు ఎగబాకిన బంగారం..

Gold Prices : నవంబర్ 24న హైదరాబాద్, ఢిల్లీతో పాటు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల వివరాలు చూడండి. 9 నెలల కనిష్ట స్థాయి తర్వాత మళ్లీ పసిడి రేట్లు పెరుగుతున్నాయి.

Gold Prices

గోల్డ్ కొనాలనుకునే వారికి మళ్లీ నిరాశే ఎదురవుతోంది. పది రోజులుగా భారీగా పడిపోయి 9 నెలల కనిష్ట స్థాయిని తాకిన పసిడి ధరలు మళ్లీ పెరుగుతూ ఉండటంతో బంగారం ప్రియులు షాక్ అవుతున్నారు. 10 రోజులుగా తులం గోల్డ్ పై ఏకంగా రూ.13,000 వరకు ధర తగ్గడంతో కొనుగోలుదారులు సంతోషపడ్డారు. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత తగ్గుతాయని ఆశించారు.

కానీ కొత్త వారం స్టార్ట్ అయిన సోమవారం నుంచే పరిస్థితి మారిపోయింది. మార్కెట్ ప్రారంభంలో కాస్త తగ్గిన ధరలు కొద్ది గంటల సమయంలోనే గోల్డ్ లవర్స్‌కు షాక్ ఇచ్చాయి. పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతున్న సమయంలో వరుసగా రెండో రోజు, అంటే మంగళవారం నవంబర్ 24వ తేదీన కూడా పసిడి రేట్లు మళ్లీ పుంజుకున్నాయి.

హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల తులం బంగారం ధర(Gold Prices) రూ.1,240 పెరిగి రూ.1లక్ష27వేల800కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల పుత్తడి రేటు రూ.1,150 పుంజుకుని రూ.1లక్ష17వేల150 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రేటు(Gold Prices) రూ.1,190 పెరిగి రూ.1లక్షల27వేల900గా ఉండగా, 22 క్యారెట్ల రేటు రూ.1లక్ష17వేల300 వద్ద ఉనికిలో ఉంది. చెన్నై, బెంగళూరు నగరాల్లో కూడా 24 క్యారెట్ల బంగారం రూ.1లక్ష27వేల800, 22 క్యారెట్ల ధర రూ.1లక్ష17వేల150గా నమోదైంది.

బంగారం బాటలో కాకుండా వెండి ధరలు మాత్రం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. మంగళవారం మార్కెట్లో వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు సిటీలలో కేజీ వెండి ధర రూ.1.75 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

ఇంటర్నేషనల్ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలు గోల్డ్ ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా డిసెంబర్ నెలలో రిలీజ్ కానున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, అలాగే అక్కడ రాబోయే ద్రవ్యోల్బణ రిపోర్ట్‌ల వల్ల భద్రమైన పెట్టుబడిగా బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ కూడా తోడవడంతో దేశీయంగా బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి.

Dopamine Trap : పొద్దున్నే ఫోన్ చూసి డే స్టార్ట్ చేస్తున్నారా? డోపమైన్ ట్రాప్ నుంచి ఇలా బయటపడండి..

Related Articles

Back to top button