Just TelanganaJust PoliticalLatest News

Lingamneni Sanjush : ఆరోజు జరిగింది ఇదే.. హిట్ అండ్ రన్ ప్రచారంపై ఎంపీ రమేష్ కుమారుడు క్లారిటీ..

Lingamneni Sanjush : ఆగస్ట్ 16న యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన భారతి ముఖిని కాపాడటానికి సంజూష్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన సొంత కార్‌లోనే హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లారు.

Lingamneni Sanjush

సోషల్ మీడియాలో జరుగుతున్న అబద్ధపు ప్రచారాలకు, రూమర్లకు చెక్ పెట్టడానికి రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ తనయుడు సంజూష్ మీడియా ముందుకు వచ్చారు. ఆగస్టు 16న హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు యాక్సిడెంట్‌పై స్పందించిన సంజూష్(Lingamneni Sanjush)..ఆరోజు జరిగిన అసలు నిజాలను బయటపెట్టారు.

యాక్సిడెంట్ జరిగిన వెంటనే తాను భయపడి అక్కడి నుంచి పారిపోలేదన్న ఆయన..ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ప్రమాదం జరిగిన స్పాట్‌లోనే ఉండి ఆమెకు తక్షణ సాయం అందించానని గుర్తు చేశారు. ఇప్పటి వరకూ పొలిటికల్‌గా , పర్సనల్‌గా కూడా ఒక మచ్చలేని తమ ఇమేజ్‌పై కొందరు కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని సంజూష్ అన్నారు.

ఆగస్ట్ 16న యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన భారతి ముఖి అనే మహిళను కాపాడటానికి సంజూష్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన సొంత కార్‌లోనే హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లారు. ఆమె ప్రాణాలను నిలబెట్టడానికి తన వంతు అన్ని విధాలా ట్రై చేసినా కూడా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.

ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సంజూష్(Lingamneni Sanjush) ఎమోషనల్ అయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత తాను బాధితురాలికి చేసిన మెడికల్ హెల్ప్‌తో పాటు తాను ఎలా స్పందించానో చూసి తన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని అందరికీ రిక్వెస్ట్ చేశారు.

బాధితురాలిని హాస్పిటల్‌లో చేర్పించిన వెంటనే తానక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లిపోలేదని.. డైరెక్టుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లానని సంజూష్ తెలిపారు. అక్కడ ఉన్న పోలీసు అధికారులకు ఆ ఘటనలో ఏం జరిగిందో క్లియర్‌గా వివరించి, కేస్ ఇన్వెస్టిగేషన్‌లో పూర్తిగా తాను కోఆపరేట్ చేశానని సంజూష్ గుర్తు చేశారు.

అంతేకాకుండా, యాక్సిడెంట్ జరిగిన సమయంలో తాను డ్రంక్ అండ్ డ్రైవ్ లేదా ఇతర మత్తు పదార్థాలు ఏవైనా తీసుకున్నానా అని పోలీసులు నిర్వహించిన 3 కీలకమైన మెడికల్ టెస్టుల్లోనూ నిజాలు బయటపడ్డాయని అన్నారు. బ్రీత్ అనలైజర్, యూరిన్ టెస్ట్‌తో పాటు బ్లడ్ టెస్ట్ మూడింటికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్‌లోనూ.. నెగిటివ్ అని క్లియర్‌గా వచ్చిందని ఎంపీ రమేష్ కుమారుడు చెప్పారు.

Lingamneni Sanjush
Lingamneni Sanjush

ఈ దురదృష్టకర సంఘటనలో భారతి ముఖి మృతి చెందడంపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదం జరిగిన పరిస్థితులు, హాస్పిటల్‌కు తీసుకువెళ్లిన తీరు, పోలీసులకు ఇచ్చిన పూర్తి సహకారం అండ్ అఫీషియల్ మెడికల్ రిపోర్టులన్నిటినీ బేస్ చేసుకుని ప్రజలంతా నిష్పక్షపాతంగా ఆలోచించాలని కోరారు.

అంతేకాదు సోషల్ మీడియాలో ఎలాంటి ఆధారాలు లేకుండా..కొందరు ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా పెట్టేవారు ముందుగా నిజాలు ఏంటో తెలుసుకుని మాట్లాడాలని సంజూష్ కోరారు.

Sowcar Janaki : ఏడు పదుల నటప్రయాణానికి ఎండ్ కార్డ్..చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ షావుకారు జానకి తుదిశ్వాస

Related Articles

Back to top button