Just LifestyleLatest News

Pickle Storage : వర్షాకాలంలో పచ్చళ్లు పాడవుతున్నాయా?.. మీ ఊరగాయలను ఏడాదంతా ఫ్రెష్‌గా ఉంచే టిప్స్..

Pickle Storage : పచ్చడి నిల్వ చేయడానికి ఎప్పుడూ కూడా గాలి చొరబడని పొడి గాజు , సిరామిక్ జార్‌లను మాత్రమే వాడాలి.

Pickle Storage

వానలు పడుతున్నప్పుడు వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, ఆవకాయ కలుపుకొని తింటే ఆ స్వర్గమే వేరు అంటారు ఊరగాయ లవర్స్. ఆవకాయ అనే కాదు ముసురుగా ఉన్నప్పుడు ఆ వెదర్‌కు వేడి అన్నంలో ఏ పచ్చడి కలుపుకొని తిన్నా భలే ఉంటుందంటారు.

అయితే ఈ వర్షాకాలంలో గాలిలో ఉండే తేమ వల్ల ఇంట్లో ఉండే ఊరగాయలకు త్వరగా బూజు పట్టి పాడైపోతుంటాయి. దీనికి మనం తెలీక చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్లే ఇలా పచ్చళ్లు నాశనం అవుతుంటాయి. అలా జరగకుండా మీ ఇంటి పచ్చళ్లను ఫ్రెష్‌గా కాపాడుకోవాలంటే కొన్ని సూపర్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.

పచ్చడి సీసా నుంచి ఊరగాయ, లేదా పచ్చడి తీసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ స్పూన్‌ను కడిగి, తడి లేకుండా పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే వాడాలి. ఒక్క చుక్క తడి తగిలినా , బ్యాక్టీరియా చేరి పచ్చడి క్షణాల్లో పాడవుతుంది.

అలాగే మామిడికాయ, ఉసిరికాయ, నిమ్మకాయ పచ్చళ్లలో ముక్కలుప్పుడూ నూనెలో పూర్తిగా మునిగి ఉండాలి. ముక్కల పైన కనీసం అర అంగుళం మందం అయినా సరే నూనె పొర ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఆవకాయలో నూనె తగ్గినట్లు అనిపిస్తే కాస్త నూనెను మరిగించి, బాగా చల్లారబెట్టి ఆ పచ్చడిలో కలపాలి.

పచ్చడి నిల్వ చేయడానికి ఎప్పుడూ కూడా గాలి చొరబడని పొడి గాజు , సిరామిక్ జార్‌లను మాత్రమే వాడాలి. పచ్చడి తీసిన ప్రతిసారీ మూతను గట్టిగా బిగించడం మర్చిపోవద్దు. ఆవకాయ జార్‌ను గ్యాస్ స్టవ్ దగ్గర వేడి తగిలే ప్లేస్‌లో కాకుండా కాస్త చల్లగా, పొడిగా ఉండే చోట పెట్టాలి.

Pickle Storage
Pickle Storage

ఒకవేళ పచ్చడిలో ఉప్పు శాతం తక్కువగా ఉంటే ఫ్రిజ్‌లో పెట్టుకోవడం మంచిది. అలాగే పెద్ద జాడీలో ఉన్న ఊరగాయ తగ్గేకొద్దీ అందులో గాలి పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, పచ్చడి కొద్దిగానే మిగిలినప్పుడు దాన్ని చిన్న గాజు సీసాలోకి మార్చుకోవాలి. ఆ సీసా అంచులకి ఉన్న నూనె, మసాలాలను శుభ్రంగా తుడవాలి. ఒకవేళ

పచ్చడిపై వైట్ లేదా ఆకుపచ్చ బూజు వచ్చి, బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంటే పైపొర తీసేసి మిగిలింది వాడేద్దాం అని మాత్రం అనుకోవద్దు. అది అప్పటికే పూర్తిగా పాడయింది కాబట్టి దాన్ని వెంటనే పారేయడమే ఆరోగ్యానికి మంచిది.

AP Alliance : కూటమిలో సైలెంట్ సునామీ?..లోకేష్ ఆధిపత్యం, పవన్ ఈగోతో కూటమికి పెద్ద షాక్ తప్పదా?

Related Articles

Back to top button