Just TechnologyJust InternationalLatest News

AI NEGATIVE SHADES : చాట్‌జీపీటీ , జెమినీ వాడుతున్నారా? ఏఐ సైలెంట్ నెగిటివ్ షేడ్స్ తెలుసుకోండి..

AI NEGATIVE SHADES : మనం ఫ్రీగా వాడుతున్న ప్రతి సెర్చ్ వెనుక భారీ డేటా సెంటర్లు పనిచేస్తుంటాయి. ఈ సర్వర్లను కంటిన్యూగా కూల్ చేయడానికి , రన్ చేయడానికి మిలియన్ల లీటర్ల నీరు, భారీ ఎత్తున విద్యుత్ అవసరమవుతాయి.

AI NEGATIVE SHADES

ఉదయం లేచింది మొదలు నైట్ పడుకునే వరకు ప్రతి చిన్న విషయానికి మొబైల్స్ వైపే చూస్తున్నాం. ఏ చిన్న డౌట్ వచ్చినా వెంటనే చాట్‌బాట్‌లను అడిగేస్తున్నాం. అయితే ఇది మన పనిని ఎంత ఈజీ చేసిందో, అంతకంటే వేగంగా మన సొంతంగా ఆలోచించే శక్తిని మనకు తెలీకుండానే లాగేసుకుంటోంది.

అంతేకాదు టెక్నాలజీ అందిస్తున్న ఈ సదుపాయంతో దానికి బానిసలుగా మారిపోతున్నాం. పనులను స్పీడప్ చేసే ఒక సాధనంగా మొదలైన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఇప్పుడు మన డైలీ లైఫ్‌లో ఒక భాగమై మన ఆలోచన సరళిని కూడా కంట్రోల్ చేసేస్తోంది.

గతంలో ప్రతి చిన్న లెక్కకు, విషయానికి బ్రెయిన్‌కు కాస్త పనిచెప్పేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రతి చిన్న చిన్న విషయాలకు డిజిటల్ అసిస్టెంట్లపై డిపెండ్ అవడం వల్ల మనిషి మైండ్ తన సహజమైన షార్ప్‌నెస్‌ను కోల్పోతోంది.

పిల్లల ఎడ్యుకేషన్ నుంచి ప్రొఫెషనల్స్ కోడింగ్ వరకు, చివరికి డాక్టర్ల సలహాల వరకు ప్రతిదానికీ దీనిపైనే డిపెండ్ అవుతున్నాం. ఇది మన జ్ఞాపకశక్తిని, విశ్లేషణా సామర్థ్యాన్ని మెల్లగా తగ్గించేస్తోంది. స్వయంగా ఆలోచించడమే మానేస్తే, ఫ్యూచర్‌లో ఇండిపెండెంట్‌గా డెసిషన్స్ తీసుకునే శక్తిని కూడా మనుషులు కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇదంతా ఒక ఎత్తయితే.. ఈ సాంకేతిక వ్యవస్థను నడపడమనేది ఎంత ఖర్చుతో కూడుకున్నదో చాలామందికి తెలీదు. మనం ఫ్రీగా వాడుతున్న ప్రతి శోధన వెనుక భారీ డేటా సెంటర్లు పనిచేస్తుంటాయి. ఈ సర్వర్లను కంటిన్యూగా కూల్ చేయడానికి , రన్ చేయడానికి మిలియన్ల లీటర్ల నీరు, భారీ ఎత్తున విద్యుత్ అవసరమవుతాయి.

దీనివల్ల వాతావరణంలోకి రిలీజయ్యే కర్బన ఉద్గారాల పరిమాణం పెరిగిపోతోంది. ఒక చిన్న సందేహానికి సమాధానం వెతికే సమయంలో.. పర్యావరణానికి మనం ఎంతో కొంత నష్టం కలిగిస్తున్నామనేది ఎవరికీ తెలియని చేదు నిజంగా మిగిలిపోతుంది. డేటా సెంటర్ల నిర్వహణ ఫ్యూచర్‌లో ప్రపంచ దేశాలకు పెద్ద విద్యుత్, పర్యావరణ సవాల్‌గా మారబోతోంది.

మరోవైపు, పర్సనల్ డేటాను ఈ ప్లాట్‌ఫామ్‌లకు అప్పగించడం వల్ల సెక్యూరిటీ పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. మన టేస్ట్‌లు, అలవాట్లు, డైలీ అప్‌డేట్స్‌ను కంటిన్యూగా విశ్లేషిస్తూ ఈ సిస్టమ్స్ మనల్ని మరింత ఆకర్షిస్తున్నాయి.

డిజిటల్ ఫ్రెండ్స్‌గా మారి హ్యూమన్ రిలేషన్స్‌ను తగ్గిస్తున్న ఈ సిస్టం, మన పర్సనల్ డేటాను సేకరించి రిస్క్‌లో పడేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా ఇవి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ నూటికి నూరు శాతం నిజం కాకపోవచ్చు. ఇంటర్నెట్‌లో ఉన్న వివరాలనే సేకరించి మనకు తిప్పి ఇచ్చే ఈ పరిజ్ఞానం ఒక్కోసారి తప్పుడు సమాచారాన్ని కూడా నిజమని నమ్మించే ప్రమాదం ఉంది.

AI NEGATIVE  SHADES
AI NEGATIVE SHADES

అంతేకాకుండా, సైంటిస్టులు ఇప్పుడు బయోలాజికల్ ఆధారిత ఆర్గనాయిడ్ ఇంటెలిజెన్స్ దిశగా పరిశోధనలు చేస్తున్నారు. సజీవ కణాలను ప్రాసెసర్లుగా మార్చి ఇంకా వేగవంతమైన వ్యవస్థలను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇలాంటి మార్పుల మధ్య మనం టెక్నాలజీని పూర్తిగా వదిలేయడం సాధ్యం కాదు కానీ దానిపై అతిగా ఆధారపడకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్. మన ప్రతి రిక్వెస్ట్‌ను క్లారిటీగా అడగడం, అవసరం లేనప్పుడు సాధారణ ఇంటర్నెట్ సెర్చ్‌లకు ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా కొంతవరకు దీని ఎఫెక్ట్ తగ్గించొచ్చు. టెక్నాలజీని మనం కంట్రోల్ చేయాలి తప్ప, అది మన జీవితాలను కమాండ్ చేసే రేంజ్‌కు వెళ్లకుండా చూసుకోవడమే ఏకైక సొల్యూషన్.

Bilibili : ఫస్ట్ వీడియోకే చేతికి డబ్బులు..యూట్యూబ్‌కి పోటీగా గ్లోబల్ రేసులోకి కొత్త యాప్ బిలిబిలి..

Related Articles

Back to top button