Intuition : నోటి మాట ఫలించడం వెనుక పవర్స్ ఉంటాయా?సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఏం చెబుతున్నాయ్..
Intuition : మనిషి మైండ్ ఎప్పుడూ కూడా చుట్టూ ఉన్న ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వాతావరణంలో జరిగే సూక్ష్మ మార్పులను సైలెంట్‌గా రీడ్ చేస్తూ ఉంటుంది.
Intuition
నువ్వు ఏది అంటే అదే అవుతుంది.. నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుందనే మాట చాలా ఇళ్లలో, ఫ్రెండ్స్ మధ్య తరచూ వింటూ ఉంటాం. కొందరు ఒక మాట అన్నా లేదా ఏదైనా గెస్ చేసినా అది అక్షరాలా నిజమైపోతుంటుంది. ఇలాంటి వారిలో ఏవైనా అసాధారణమైన దైవిక శక్తులు ఉంటాయా లేక దీని వెనుక సైన్స్ సపోర్ట్ చేసే లాజిక్స్ ఏమైనా ఉన్నాయా అని చాలామంది వీరి గురించి ఆలోచిస్తుంటారు. అయితే ఆధ్యాత్మికత , సైన్స్ ఈ రెండూ కూడా ఈ విషయంపై ఏం చెబుతున్నాయో చూద్దాం.
ఆధ్యాత్మిక కోణంలో కనుక చూస్తే.. మన హిందూ సనాతన ధర్మంలో దీనిని వాక్ శుద్ధి లేదా వాక్ సిద్ధి అని పిలుస్తారు. దీని ప్రకారం ఒక వ్యక్తి మనసు, ఆలోచన, మాట ఎప్పుడూ ఒకే సరళరేఖలో అంటే సత్య మార్గంలో ఉన్నప్పుడు లేదంటే వారిలో ఆత్మజ్ఞానం, తపస్సు, అంతర్ దృష్టి (Intuition) ఎక్కువగా ఉన్నప్పుడు.. వారి నోటి నుంచి వచ్చే మాటలు ఫలిస్తాయని చాలామంది నమ్ముతారు.
అలాగే మనుషుల చుట్టూ ఉండే ప్రాణ శక్తి లేదా ఆరా (Aura) చాలా స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు లేదంటే వాళ్లు తీవ్రమైన భావోద్వేగంతో లేదా స్ట్రాంగ్ విల్ పవర్‌తో ఒక మాట అన్నప్పుడు ఆ తరంగాలు విశ్వంలోకి వెళ్లి ఆ మాటలు నెరవేరుతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. దీనినే సబ్కాన్షియస్ పవర్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అని కానీ అంటూ ఉంటారు.
ఇక సైన్స్ అండ్ న్యూరోసైన్స్ కోణంలో చూస్తే కనుక.. మనిషి బ్రెయిన్లోని క్వాంటమ్ మైండ్ సిద్ధాంతాలు అండ్ న్యూరోలాజికల్ పాటర్న్స్ దీనికి కారణం అని చెబుతారు. మనిషి మైండ్ ఎప్పుడూ కూడా చుట్టూ ఉన్న ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వాతావరణంలో జరిగే సూక్ష్మ మార్పులను సైలెంట్‌గా రీడ్ చేస్తూ ఉంటుంది.
దీనిపై కొన్ని ప్రయోగాలు ఏం చెబుతున్నాయంటే.. ఎక్కువ కాన్సన్ట్రేషన్ పవర్ అలాగే గమనించే శక్తి (Observation Power) ఉన్న వ్యక్తులలో సబ్కాన్షియస్ మైండ్ సాధారణ మనుషుల కంటే చాలా బాగా పనిచేస్తుంది. దీని వల్లే రాబోయే సంఘటనలను వారి మైండ్ చాలా ముందే ప్రాసెస్ చేసి ఒక ఇంట్యూషన్ లేదా అంతర్వాణి రూపంలో బయటకు పంపుతుంది.

అంతేకాదు, మనిషి ఆలోచనలకు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే యాంటినా వంటిది ఉంటుంది. ఒక వ్యక్తి గట్టిగా ఏదైనా అనుకున్నప్పుడు లేదంటే బలంగా గెస్ చేసినపుడు, ఆ ఆలోచనా తరంగాలు ఎదుటివారి మెదడును (Brainwave Synchronization) లేదా పరిసరాలను ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందని కొందరు న్యూరో సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. దీన్నే మనం బయటకు వాళ్లు గెస్ చేసింది నిజమైందని లేదా వాళ్లకు స్పెషల్ పవర్స్ ఉన్నాయని అనుకుంటూ ఉంటాం.
నిజానికి ఆధ్యాత్మికంగా చూస్తే అది మనిషిలోని అంతర్గత చైతన్యం(Inner consciousness) , సంకల్ప శక్తి (Willpower)కి సంకేతం అయితే.. సైన్స్ పరంగా చూస్తే అది మన సబ్కాన్షియస్ మైండ్ మైక్రో లెవెల్లో చేసే హై-స్పీడ్ కాలిక్యులేషన్స్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు.
Emotional Check Out : ఒకే ఇంట్లో ఉన్నా అపరిచితుల్లా మారిపోతున్నారా?..ఎమోషనల్ చెక్ అవుట్ అంటే అదేనా?





