Gold – Silver : తగ్గినట్లే తగ్గి మళ్లీ రివర్స్ గేర్ వేసిన గోల్డ్.. పాతాళానికి పడిపోతున్న వెండి..
Gold - Silver : బంగారం రివర్స్ గేర్ వేసి కొద్దిగా పైకి పరుగులు తీస్తే.. వెండి మాత్రం దీనికి విరుద్ధంగా కిందికి పడిపోతూ ఇన్వెస్టర్లను కూడా కన్ఫ్యూజ్ చేస్తోంది.
Gold – Silver
నిన్నటి వరకూ కాస్త తగ్గుతున్నాయిలే అని ఆశలు పెట్టిన బంగారం ధరలు..మళ్లీ ఒక్కసారిగా యూ-టర్న్ తీసుకుని మళ్లీ సామాన్యుడికి షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయాయి. లాస్ట్ వీక్ రూ.1.70 లక్షల మార్కుకు అతి దగ్గరగా వెళ్లిన పుత్తడి ధరలు, ఆ తర్వాత మెల్లగా దిగి రావడంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
కానీ, అంతలోనే కొత్త నెల ప్రారంభం రోజే ..మంగళవారం ఉదయం మార్కెట్ ఓపెన్ అవ్వగానే స్టోరీ మొత్తం మారిపోయింది. కాకపోతే బంగారం రివర్స్ గేర్ వేసి కొద్దిగా పైకి పరుగులు తీస్తే.. వెండి మాత్రం దీనికి విరుద్ధంగా కిందికి పడిపోతూ ఇన్వెస్టర్లను కూడా కన్ఫ్యూజ్ చేస్తోంది.
ఈ మంగళవారం ఉదయం బులియన్ మార్కెట్ ప్రకారం.. 10 గ్రాముల బంగారంపై రూ.160 వరకు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ కాస్ట్ రూ.1లక్ష56వేల930 వద్ద ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పుత్తడిపై రూ.150 పెరిగి రూ.1 లక్ష43వేల850 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ కాస్ట్ రూ.120 పెరిగి ప్రస్తుతం రూ.1లక్ష17వేల700 వద్ద రీచ్ అయింది.
కాగా బంగారం ఇలా పైకి లేస్తుంటే, సిల్వర్ మాత్రం పుత్తడికి పోటీ కాదన్నట్లు దిగొస్తోంది. కిలో వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గుముఖం పట్టి.. కేజీ వెండి ధర రూ.1 లక్ష50వేల వద్దకు పడిపోయింది. గత వారం ఇదే కిలో వెండి ధర రూ.1లక్ష60వేల వద్ద ఉండగా, కేవలం ఒక్క వార వ్యవధిలోనే సుమారు రూ.10,000 వరకు పతనమైంది.

గ్లోబల్ మార్కెట్ల ఎఫెక్ట్ కూడా దేశీయ మార్కెట్‌పై బాగా పడింది. ప్రపంచవ్యాప్తంగా పసిడి రేట్లు తగ్గినట్లే తగ్గి మంగళవారం కాస్త పైకి లేచాయి. స్పాట్ బంగారం ధర ఔన్సుకు 19 డాలర్లు పెరిగి 4449 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో స్పాట్ వెండి రేటు ఔన్సుకు 1.44 శాతం పెరిగి 66.62 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో తెలీని గోల్డ్, సిల్వర్ రేట్ల ఆటను ఎక్స్పర్ట్స్ కూడా అంచనా వేయలేకపోతున్నారు. మరి ఈ వారంలో ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతాయా లేక ఇన్వెస్టర్ల అమ్మకాలతో మరింత కిందికి దిగి వస్తాయా అనేది వేచి చూడాల్సిందే.





