Check Laziness : ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉందా? ఈ 5 జపనీస్ సీక్రెట్ టెక్నిక్స్ ట్రై చేయండి..
Check Laziness: కడుపు నిండా తినేస్తే బాడీలోకి ఆటోమేటిక్‌గా బద్ధకం, నిద్ర ముంచుకొస్తాయి. అందుకే జపనీయులెప్పుడూ పొట్ట 80 శాతం నిండగానే తినడాన్ని ఆపేస్తారు.
Check Laziness
పొద్దున్నే లేచి ఆ పని చేయాలి, ఎక్సర్‌సైజ్‌లు చేయాలని బలంగా అనుకుంటాం. తీరా సమయం వచ్చేసరికి అబ్బా..ఇంకో గంట ఆగి చేద్దాంలే అనుకుంటూ ముసుగు తన్ని పడుకోవడమో, టీవీ చూస్తూనో, ఫోన్ స్క్రోల్ చేస్తూనో కాలం గడిపేస్తుంటాం.
రోజులు, వారాలు గడిచిపోతాయి కానీ బద్ధకం వల్ల అనుకున్న పని మాత్రం చేయలేం. అయితే, ప్రపంచంలోనే అత్యంత డిసిప్లిన్డ్‌గా ఉంటారని పేరుబడ్డ జపనీయులు.. ఈ బద్ధకాన్ని తరిమికొట్టడానికి కొన్ని అద్భుతమైన సైకలాజికల్ ప్రిన్సిపల్స్ ఉపయోగిస్తారు. అవేంటో తెలుసుకుంటే ఎలాంటి వారి లైఫ్ అయినా కూడా ట్రాక్‌లోకి రావడం గ్యారంటీ అని సైకాలజిస్టులు చెబుతున్నారు.
మొదటిది ఇకిగై (Ikigai).. దీనిలో మనం ఒక వర్క్‌ను ఎందుకు చేయాలి? దాని వల్ల మనకు దక్కే లాభం ఏంటనే ప్రశ్నకు మీ దగ్గర స్పష్టమైన సమాధానం ఉండటమే ఇకిగై అన్నమాట. ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే మీ టార్గెట్‌ను లేదంటే ఆ రోజు చేయాల్సిన పని వెనుకున్న బలమైన కారణాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ క్లారిటీ తెచ్చుకోవడంతోనే మనలో మోటివేషన్ వచ్చి బద్ధకం పారిపోతుంది.
రెండోది కైజెన్ (Kaizen).. ఒకే రోజులో కొండను తవ్వేయాలని ఎవరైనా చూస్తే టెన్షన్, శ్రమ పెరిగి అసలు పనే అవదు. అందుకే జపనీయులు కైజెన్ పద్ధతిని పాటిస్తారు. కైజెన్ అంటే కంటిన్యూయస్ ప్రోగ్రెస్ అని అర్ధం. అంటే ఒక పెద్ద పనిని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసుకుని..రోజుకు కేవలం 1 శాతం మాత్రమే మెరుగవ్వడానికి ట్రై చేయాలి. రోజుకు 1 పర్సంట్ అనేది చాలా చిన్నదే కావొచ్చు. కానీ ఇదే మెల్లగా అద్భుతమైన విజయాన్ని తెచ్చిపెడుతుంది.
మూడోది షోషిన్ (Shoshin).. ఏదైనా సరే ఒక కొత్త పనిని లేదంటే చదువును స్టార్ట్ చేసేటపుడు మీ మనసును వైట్ పేపర్‌లా ఉంచుకోవాలి. దీన్నే బిగినర్స్ మైండ్ అంటారు. అంటే నాకు అన్నీ తెలుసన్న ఫీలింగ్‌ను పక్కనపెట్టి, ఏమీ తెలీని చిన్నారిలా కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. బ్రెయిన్ ఎప్పుడూ కొత్త విషయాల పట్ల ఇంట్రస్ట్ చూపించినట్లు ఉంటే బద్ధకం దరిదాపుల్లోకి కూడా రాదు.

నాలుగోది హరా హచి బు(Hara Hachi Bu).. మనం కడుపు నిండా తినేస్తే బాడీలోకి ఆటోమేటిక్‌గా బద్ధకం, నిద్ర ముంచుకొస్తాయి. అందుకే జపనీయులెప్పుడూ పొట్ట కేవలం 80 శాతం నిండగానే తినడాన్ని ఆపేస్తారు. పొట్టలో కొంత ఖాళీ ప్లేస్ ఉంచడం వల్ల జీర్ణక్రియ ఈజీ అవుతుంది. అలాగే తిన్న తర్వాత వచ్చే బద్ధకం పోయి బాడీ అండ్ మైండ్ చాలా చురుగ్గా పనిచేస్తాయి.
ఐదోది వాబీ సబీ (Wabi Sabi).. ఈ ప్రపంచంలో ఏదీ పర్ఫెక్ట్ కాదు, ఎవరూ హండ్రెడ్ పర్సంట్ పరిపూర్ణులు కారు. ఈ నిజాన్ని అంగీకరించడమే వాబీ-సబీ అని చెబుతారు సైకాలజిస్టులు. చాలామంది పని పర్ఫెక్ట్‌గా రాదనో, లేదంటే తమలోనే లోపాలు ఉన్నాయనో నిరాశ చెంది ప్రారంభించిన పనిలో చిన్న అడ్డంకులు వచ్చినా .. మధ్యలోనే వదిలేసి బద్ధకస్తులుగా మారిపోతారు. కానీ తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగడమే అసలైన విజయమని జపనీయులు నిరూపిస్తున్నారు.
Babymoon : హనీమూన్,బడ్డీమూన్ తెలుసు.. మరి సమంత చెప్పిన బేబీమూన్ గురించి తెలుసా?





