Just LifestyleLatest News

AQP4 Gene : రాత్రిళ్లు నిద్ర పట్టట్లేదా?..నైట్ టైమ్‌లో బ్రెయిన్‌లో జరిగే ‘జీన్’ కథ తెలుసుకోండి..

AQP4 Gene : కేవలం జన్యువులు మాత్రమే మన ఫ్యూచర్‌ను డిసైడ్ చేయవు, వాటితో పాటు మన లైఫ్‌ స్టైల్ కూడా తోడవుతుంది.

AQP4 Gene

రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టక మార్నింగ్ లేవగానే అసలు ఒంట్లో ఓపిక లేనట్లుగా అనిపించడం చాలామందికి అనుభవమే. అయితే ఇక్కడే ఒక చిత్రమైన సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఉంది. మీతో పాటే డైలీ నాలుగు గంటలే నిద్రపోయే మీ ఫ్రెండ్ చాలా యాక్టివ్‌గా, షార్ప్‌గా ఉండొచ్చు.. కానీ అదే నాలుగు గంటల నిద్ర వల్ల మీ బ్రెయిన్ మాత్రం వీక్ అయిపోతూ ఉండొచ్చు.

ఒకే రకమైన నిద్రలేమి ఉన్నా కూడా, కొందరి బ్రెయిన్‌పై ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్ పడి అల్జీమర్స్ వంటి ప్రమాదకర వ్యాధులకు దారితీస్తుంటే, మరికొందరి మెదడు దానిని ఎలా తట్టుకుంటుందన్న అనుమానాలు చాలామందిలో కలుగుతున్నాయి. ఈ కాన్సెప్ట్‌పైన ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ యూనివర్సిటీ రీసెర్చర్స్ ఒక విప్లవాత్మకమైన నిజాన్ని బయటపెట్టారు. మన బాడీలో దాగున్న ఒకానొక జీన్.. మనం పడుకునే నిద్ర టైమింగ్స్ కలిసి మన మైండ్‌ను డిసైడ్ చేస్తున్నాయని అంటున్నారు.

మనం నిద్రపోయినపుడు మన బాడీ మాత్రమే కాకుండా, బ్రెయిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక క్లీనింగ్’పనిలో బిజీగా ఉంటుంది. రోజంతా బ్రెయిన్ వాడకం వల్ల లోపల తయారయ్యే డేంజరస్ వ్యర్థాలను, ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధికి కారణమయ్యే పాయిజినస్ ప్రోటీన్లను బయటకు ఊడ్చిపారేసే సిస్టం నిద్రలోనే యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఈ డ్రైనేజీ, వ్యర్థాల తొలగింపు ప్రాసెస్‌లో Aquaporin-4 (AQP4) అనే జన్యువు అత్యంత కీలకమైన డ్రైవర్‌లా పని చేస్తుంది. ఇది బ్రెయిన్‌లోని ద్రవాల ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తూ, చెత్తను క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.

అయితే సైంటిస్టులు గుర్తించిన అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ AQP4 జన్యువు(AQP4 Gene) మనుషులందరిలో ఒకేలా ఉండదు. ప్రతీ ఒక్కరిలో దీని రూపం, నేచర్ కాస్త వేర్వేరుగా ఉంటాయి. ఈ జన్యువుకు సంబంధించిన 13 రకాల వేరియంట్లను రీసెర్చర్స్ లోతుగా పరిశీలించారు. ఈ రీసెర్చ్‌తో తేలిందేంటంటే.. మన జన్యు నిర్మాణం ఆధారంగానే, తక్కువ నిద్ర మన మెదడును ఎంత డ్యామేజ్ చేస్తుందో డిసైడ్ అవుతుంది.

కొన్ని రకాల AQP4 జెనిటివ్ ఫార్మ్స్ ఉన్న వ్యక్తులు తక్కువ టైమ్ నిద్రపోయినా లేదా బెడ్‌పై పడుకున్నాక నిద్రపట్టడానికి ఎక్కువ టైమ్ తీసుకున్నా.. వారి బ్రెయిన్‌లోని గ్రే మ్యాటర్ చాలా ఫాస్ట్‌గా కరిగిపోతున్నట్లు స్కాన్లలో తేలింది. ఈ గ్రే మ్యాటర్‌లోనే మన మెమరీ పవర్, డెసిషన్స్ తీసుకునే శక్తి, బాడీ కదలికలను కంట్రోల్ చేసే బిలియన్ల కొద్దీ న్యూరాన్స్ ఉంటాయి. అంటే సరైన నిద్ర లేకపోవడం వల్ల ఈ జెనిటిక్ వేరియేషన్స్ ఉన్నవారి బ్రెయిన్ స్ట్రక్చర్ దారుణంగా దెబ్బతింటోందని తేల్చారు.

ఈ రీసెర్చ్‌లో సైంటిస్టులు మరొక కీలక విషయాన్ని కూడా క్లియర్‌గా చెప్పారు. కేవలం జన్యువులు మాత్రమే మన ఫ్యూచర్‌ను డిసైడ్ చేయవు, వాటితో పాటు మన లైఫ్‌ స్టైల్ కూడా తోడవుతుంది. ఒకే జన్యు రూపం ఉన్నా కూడా, సరిగ్గా నిద్రపోయే వ్యక్తిలో అది ప్రొటెక్టివ్‌గా పనిచేస్తే.. నిద్రను నిర్లక్ష్యం చేసే వ్యక్తిలో మాత్రం అల్జీమర్స్‌కు దారితీసే నెగెటివ్ ఎఫెక్ట్‌ను చూపించొచ్చు.

AQP4 Gene
AQP4 Gene

అలా అని వెంటనే ల్యాబ్‌లకు అందరూ పరుగెత్తి ఈ AQP4 జెనెటిక్ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదని రీసెర్చర్స్ చెబుతున్నారు. ఎందుకంటే ఇది ప్రస్తుతం స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న ప్రయోగం మాత్రమే. ఫ్యూచర్‌లో ప్రతీ ఒక్కరి జన్యు ప్రొఫైల్ , వారి నిద్ర విధానానికి తగినట్లుగా పర్సనలైజ్డ్ ప్రివెన్షన్ పేరుతో అల్జీమర్స్‌ను ముందుగానే అడ్డుకునే మెడికల్ ప్రొసీజర్స్ రాబోతున్నాయని ఇది సూచిస్తోంది.

మొత్తంగా ఈ పరిశోధన మనందరికీ చెప్పే ఏకైక గోల్డెన్ రూల్ ఏంటంటే.. నిద్ర అనేది కేవలం బద్ధకాన్ని పోగొట్టుకోవడానికి మాత్రమే కాదు, మన బ్రెయిన్ లోపలి కణాలను కంటిన్యూగా రీఫ్రెష్ చేసుకుని, రోగాల బారిన పడకుండా కాపాడుకోవడానికి ఇచ్చే ది బెస్ట్ పవర్‌ఫుల్ మెడిసిన్. కాబట్టి రాత్రిళ్లు నిద్రను లైట్ తీసుకోకుండా తగినంత టైమ్‌ను కేటాయించడం మీ బ్రెయిన్ ఆరోగ్యానికి, మీకు కూడా చాలా అవసరం అని తెలుసుకోండి.

Liechtenstein : హైదరాబాద్ కంటే చిన్న దేశం.. కానీ ఆ విషయంలో మాత్రం ఈ కంట్రీ టాప్..

Related Articles

Back to top button