Just LifestyleLatest News

Moroccan Red Clay : క్లియోపాత్రా బ్యూటీ సీక్రెట్ ఇదేనట.. ఈ నేచురల్ క్లే ఇంట్లోనే ఇలా వాడండి..

Moroccan Red Clay : మొరాకన్ రెడ్ క్లేలో ఐరన్ ఆక్సైడ్, మెగ్నీషియం, సిలికా, పొటాషియం వంటి సూపర్ మినరల్స్ ఎన్నో ఉన్నాయి.

Moroccan Red Clay

మనం మెరిసే స్కిన్ కోసం బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలకు వేలు డబ్బులు తగలేస్తూ, కెమికల్ క్రీములు వాడుతూ ఉంటాం. కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కేవలం నేచురల్ పదార్థాలతో ఫేస్‌ను మెరిపించే సీక్రెట్ మొరాకన్ రెడ్ క్లే అంటున్నారు సౌందర్య నిపుణులు. దీన్నే రస్సౌల్ క్లే అని కూడా పిలుస్తారట.

మొరాకోలోని అట్లాస్ పర్వత ప్రాంతాల్లో దొరికే ఈ ఎర్రమట్టిలో ఐరన్ ఆక్సైడ్, మెగ్నీషియం, సిలికా, పొటాషియం వంటి సూపర్ మినరల్స్ ఎన్నో ఉన్నాయి. ప్రాచీన ఈజిప్టు రాణి క్లియోపాత్రా కూడా తన బ్యూటీని పెంచుకోవడం కోసం నైలు నది పరివాహక ప్రాంతంలోని ఈ ఎర్రమట్టినే వాడేదని హిస్టరీ చెబుతోంది.

ఈ ఎర్రమట్టి ఆన్ లైన్‌లో కూడా దొరుకుతుంది. ఇది స్కిన్‌పై ఉన్న అదనపు ఆయిల్‌, డెడ్ స్కిన్ సెల్స్, డస్ట్‌ను లాగేస్తుంది. మెయిన్‌గా ఆయిలీ, కాంబినేషన్ స్కిన్ ఉన్నవారికి ఇది ఇనిస్టెంట్ గ్లో ఇస్తుంది. అయితే ఇది మీ పోర్స్‌ని క్లీన్ చేసి టెంపరరీగా గ్లో ఇస్తుంది తప్ప స్కిన్ కలర్‌ను పర్మినెంట్‌గా వైట్‌గా మార్చదు.

Moroccan Red Clay
Moroccan Red Clay

ఒక బౌల్‌లో మొరాకన్ రెడ్ క్లే పౌడర్ తీసుకుని, వాటర్ లేదా రోజ్ వాటర్‌ను కలిపి పేస్ట్‌లా చేసి ఫేస్‌కు పలుచగా అప్లై చేయాలి. ఇది పూర్తిగా ఎండిపోయే వరకు ఉంచుకోకుండా.. కొద్దిగా తడి ఉండగానే గోరువెచ్చని వాటర్‌తో వాష్ చేసి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

వీక్లీ ఒకటి లేదా రెండుసార్లు ఈ మాస్క్ వాడితే సరిపోతుంది. డ్రై స్కిన్ ఉన్నవారు ఈ ప్యాక్‌ను ఎక్కువ సేపు ఉంచుకుంటే ఫేస్ ఇంకా డ్రైగా మారిపోతుంది కాబట్టి జాగ్రత్తపడాలి. సెన్సిటివ్ చర్మం ఉన్న వారు చేతిపై ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

నిజానికి ఏ ప్యాక్ అయినా కూడా డైరెక్టుగా అప్లై చేయకుండా ప్యాచ్ టెస్ట్ చేసుకుంటేనే బెటర్. అయితే కేవలం ఫేస్ మాస్క్‌తోనే అద్భుతాలేవీ జరిగిపోవు. తగినంత వాటర్ తీసుకుంటూ హెల్దీ ఫుడ్, నిద్ర ఉంటేనే నేచురల్ గ్లో వస్తుంది.

AQP4 Gene : రాత్రిళ్లు నిద్ర పట్టట్లేదా?..నైట్ టైమ్‌లో బ్రెయిన్‌లో జరిగే ‘జీన్’ కథ తెలుసుకోండి..

Related Articles

Back to top button