Bigg BossJust EntertainmentLatest News

Bigg Boss 10 Elimination : బిగ్ బాస్ 10 నాలుగో రోజే షాకింగ్ ట్విస్ట్.. చరణ్ బలిపశువు, ఫస్ట్ వికెట్ డౌన్

Bigg Boss 10 Elimination : రోహిత్ మాత్రం ముందు చరణ్‌ను హై రిస్క్‌లో పెట్టేసి, ఇప్పుడు రామ్ ప్రసాద్‌కు కలర్ పూస్తూ చరణ్ సరిగ్గా ఆడట్లేదని, అందుకే అతనికి టైమ్ కావాలని కవరింగ్ ఇస్తూ చరణ్‌ను ఫైనల్‌గా బలిపశువును చేసేశాడు.

Bigg Boss 10 Elimination

ముఖానికి పులుముకున్న రంగుల యుద్ధానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన బిగ్ బాస్ హౌస్‌లో నాలుగో రోజే ఎవరూ ఊహించని హైడ్రామా నడిచింది. ముందు ఎపిసోడ్‌లో పనుల పంపకం, హై రిస్క్ టాస్కులతో  అట్మాస్ఫియర్ హీటెక్కగా, నాలుగో రోజే హౌస్‌మేట్స్‌కు అసలైన నామినేషన్స్, ఎలిమినేషన్(Bigg Boss 10 Elimination) షాకిచ్చాడు బిగ్ బాస్.

దేబ్జానీ టీమ్ నుంచి ముకేశ్ గౌడ, త్రిగుణ్.. అలాగే రోహిత్ టీమ్ నుంచి రోహిత్, వంశీని కన్‌ఫెషన్ రూమ్‌కి పిలిచిన బిగ్ బాస్, మీరు హౌస్‌మేట్స్ అవ్వాలంటే మీ టీమ్‌లోనే మీరు ఒకరిని హై రిస్క్‌లో పెట్టాలని కండీషన్ పెట్టాడు. దాంతో దేబ్జానీ టీమ్ వాళ్లు కృష్ణుడిని రిస్క్‌లోకి పెట్టేయగా, రోహిత్ అండ్ వంశీ అగ్నిపరీక్ష బ్యాచ్‌ను కాపాడుకోవడానికి చైత్ర రాయ్‌ని హై రిస్క్‌లోకి నెట్టేసారు.

ఆ తర్వాత హౌస్‌మేట్స్ క్వాలిఫికేషన్ కోసం రోహిత్, వంశీ, త్రిగుణ్, ముకేశ్‌ మధ్య బిగ్ బాస్ ఒక పవర్‌ఫుల్ గేమ్ పెట్టాడు. దీనిలో రోహిత్, వంశీ విన్ అయ్యి పక్కాగా హౌస్‌మేట్స్ అయిపోవడంతో, చైత్ర మాత్రం ఆఫ్టర్‌ఆల్ హై రిస్క్‌లో మిగిలిపోయింది. అయితే తమ టీమ్ సభ్యురాలైన తనను రిస్క్‌లో పడేసి రోహిత్ బ్యాచ్ డ్యాన్సులు, మ్యూజిక్‌తో రచ్చ చేయడం చైత్ర జీర్ణించుకోలేకపోయింది.

దీంతో సొంత టీమ్ వాళ్లే వెన్నుపోటు పొడిచారంటూ చైత్ర కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయింది. ఈ సమయంలోనే షాలిని వచ్చి చైత్రతో కావాలని గొడవ పెట్టుకోవడమే కాకుండా.. ఆపైన తనే ఏడుస్తూ రివర్స్‌లో సింపతీ కార్డ్‌ను ప్లే చేయడానికి ట్రై చేసింది. ఇదంతా చూసిన రోహిత్ డ్యామేజ్ కంట్రోల్ కోసం చైత్రను కూల్ చేసే ప్లాన్ వేశాడు.

ఇక తనకు ఇష్టం వచ్చినప్పుడే తింటానని రోహిత్ హంగామా చేస్తూ ఎగ్స్ డిస్ట్రిబ్యూషన్‌ టైమ్‌లో బ్లూ టీమ్‌ మధ్య గొడవలు పెట్టేశాడు. ఎప్పట్లాగే తాను చేయాల్సిన వాషింగ్ వర్క్‌ను తెలివిగా ఎగ్గొట్టడానికి ప్లాన్ చేశాడు.

ఆ తర్వాత బిగ్ బాస్ హై రిస్క్‌లో ఉన్న చైత్రతో పాటు చరణ్, రామ్ ప్రసాద్‌ను పిలిచి, మీ ముగ్గురిలో ఒకరు ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యే అవకాశాన్ని తీసుకోమన్నాడు. రామ్ ప్రసాద్, చరణ్ ఇద్దరూ కలిసి చైత్రా రాయ్‌ను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేశారు. అయితే రోహిత్‌తో పాటు అగ్నిపరీక్ష టీమ్ మాత్రం ఆమెకి ఎందుకు ఆ ఛాన్స్ ఇచ్చావంటూ చరణ్‌ను ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి ట్రై చేయడం చూసి ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు.

అక్కడే ఫస్ట్ ఎలిమినేషన్‌లో భాగంగా చరణ్, రామ్ ప్రసాద్‌లో ఒకరు ఇప్పుడే హౌస్ నుంచి బయటకు వెళ్తారంటూ బిగ్ బాస్ బాంబ్ పేల్చాడు. మిగతా కంటెస్టెంట్లందరినీ పిలిచి ఎవరికి ఎలిమినేట్ అయ్యే అర్హత ఉందో వారి ఫేస్ మీద రంగు పూసి రీజన్ చెప్పాలన్నాడు. చైత్ర రిస్క్‌లో ఉంది కాబట్టి ఆమెకు రంగు పూసే అవకాశం దక్కలేదు.

Bigg Boss 10 Elimination
Bigg Boss 10 Elimination

చరణ్ సొంతంగా ఆడకుండా రోహిత్ షాడోలా ఉంటున్నాడని, అగ్నిపరీక్ష టీమ్ అంతా గ్రూపిజం గేమ్ ఆడుతున్నారని అందరూ పక్కా పాయింట్ చెప్పి చరణ్‌కు కలర్ పూశారు. రోహిత్ మాత్రం గతంలో చరణ్‌ను హై రిస్క్‌లో పెట్టేసి, ఇప్పుడు రామ్ ప్రసాద్‌కు కలర్ పూస్తూ చరణ్ సరిగ్గా ఆడట్లేదని, అందుకే అతనికి టైమ్ కావాలని కవరింగ్ ఇస్తూ చరణ్‌ను ఫైనల్‌గా బలిపశువును చేసేశాడు.తన అగ్నిపరీక్ష టీమ్‌ను అడ్డం పెట్టుకుని రోహిత్ ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నాడో దీంతోనే క్లియర్‌గా అర్థమైపోయింది.

మొత్తంగా ఓటింగ్‌లో చరణ్‌కు త్రిగుణ్, వంశీ, ముకేశ్ గౌడ, కృష్ణుడు, సుధీర్, వర్షిణి, దేబ్జానీ, నరేష్, ఝాన్సీ రంగు పూయగా.. రామ్ ప్రసాద్‌కి సృష్టి, షాలిని, అమన్, రోహిత్ మాత్రమే కలర్ పూశారు.దీనివల్ల మెజారిటీ ఓట్లు చరణ్‌కే పడటంతో నాలుగో రోజే ఎవరూ ఊహించని విధంగా చరణ్ ఎలిమినేట్(Bigg Boss 10 Elimination) అయి ఏడుస్తూ హౌస్ వదిలి వెళ్లాడు. మరి చరణ్‌ ఎపిసోడ్‌తో అయినా రోహిత్ గొడుగు కింద ఉన్న మిగతా అగ్నిపరీక్ష టీమ్‌కి అతని మైండ్ గేమ్ ఇప్పటికైనా అర్థమవుతుందో లేదో రాబోయే ఎపిసోడ్స్‌లో చూడాలి.

Janasena : లోకల్ ఎలక్షన్స్ టార్గెట్‌.. జనసేనకు ఈసారి కూడా 100 శాతం స్ట్రైక్ రేట్ సాధ్యమేనా?

Related Articles

Back to top button