Gold Price : గోల్డ్ లవర్స్‌కు గుడ్ టైమ్.. మళ్లీ పడిపోయిన పసిడి మార్కెట్
Gold Price : శనివారం బులియన్ మార్కెట్ విశేషాలు. హైదరాబాద్, విజయవాడతో పాటు మెయిన్ సిటీలలో 24, 22, 18 క్యారెట్ల బంగారం మరియు వెండి ధరల పూర్తి వివరాలు.
Gold Price
ఈమధ్య కాలంలో హెచ్చుతగ్గులతో కన్ఫ్యూజ్ చేస్తూ వస్తున్న పసిడి ధరలు(Gold Price)..అక్టోబర్ 31 శనివారం నాటికి కాస్త వెనక్కి తగ్గి కొనుగోలుదారులకు కాస్త తీపి కబురును అందించాయి. గ్లోబల్ మార్కెట్ సంకేతాలు, లోకల్ డిమాండ్ ఆధారంగా బులియన్ మార్కెట్లో బంగారం రేట్లు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి.
శనివారం ఉదయానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్,వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతి, కాకినాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర(Gold Price) రూ.1లక్ష42వేల250 వద్ద స్థిరపడింది. ఇక జ్యువెలరీ లవర్స్ ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ గోల్డ్ ధర రూ.1లక్ష30వేల390గా ట్రేడవుతుండగా, 18 క్యారెట్ల గోల్డ్ కాస్ట్ రూ.1లక్ష06వేల680 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ఇతర మెయిన్ సిటీలైన చెన్నైలో 24 క్యారెట్లు బంగారం కాస్ట్ రూ.1లక్ష42వేల250, 22 క్యారెట్లు రూ.1లక్ష30వేల390, 18 క్యారెట్లు రూ.1లక్ష06వేల660గా ఉండగా, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, కేరళ, పూనే నగరాల్లో కూడా హైదరాబాద్‌తో సమానంగా 24 క్యారెట్లు రూ.1లక్ష42వేల250, 22 క్యారెట్లు రూ.1లక్ష30వేల390, 18 క్యారెట్లు రూ.1లక్ష06వేల680గా రికార్డయింది.
ఇక ఢిల్లీలో మాత్రం కాస్త భిన్నంగా 24 క్యారెట్ల పసిడి ధర రూ.1లక్ష42వేల400, 22 క్యారెట్లు రూ.1లక్ష30వేల540, 18 క్యారెట్లు రూ.1లక్ష06వేల830గా పలుకుతుండగా, వడోదరలో 24 క్యారెట్లు రూ.1లక్ష42వేల300, 22 క్యారెట్లు రూ.1లక్ష30వేల440, 18 క్యారెట్లు రూ.1లక్ష06వేల730 వద్ద ఉంది.
ఇటు గోల్డ్‌తో పాటు సిల్వర్ మార్కెట్ కూడా కాస్త నెమ్మదించి కేజీకి వంద రూపాయల వరకూ తగ్గుదల నమోదు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.2లక్షల09వేల900గా కొనసాగుతోంది. అయితే ఎప్పటికప్పుడు మారుతున్న ఈ ధరలను ఫాలో అయిపోకుండా.. కొనుగోలుదారులు షాపులకు వెళ్లేముందు మరోసారి రేట్లు చెక్ చేసుకుంటే మంచిది.
Passive Resistance : చెప్పినవన్నీ చేస్తామంటారు..కానీ నచ్చిందే చేస్తారు.. మీరూ అదే టైపా?





