Just TechnologyLatest News

Meta Muse : మొబైల్ వాడకుండానే పనులు ఫినిష్ ..టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న మెటా మైండ్ బ్లోయింగ్ ఏఐ మ్యూజ్

Meta Muse : ఏదైనా కొనేటప్పుడు , కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో మ్యూజ్ మన పర్మిషన్ అడగకుండా ఒక్క అడుగు కూడా ముందుకెళ్లదు.

Meta Muse

మనం ప్రత్యేకించి చేసే పని లేకుండా, మొబైల్ పక్కన పెట్టి నిద్రపోతున్నా కూడా.. ఒక అసిస్టెంట్ మన వెనుక పనులన్నీ చక్కబెట్టేస్తే చాలా బాగుంటుంది కదా. ఇదేదో హాలీవుడ్ మూవీలో సైన్స్ ఫిక్షన్ సీన్‌లా ఉన్నా కూడా దీనిని నిజం చేసే రోజులు వచ్చేశాయి.

మనమంతా చాట్ బోర్డుల మీద టైప్ చేస్తూ కూర్చునే పని లేకుండా.. మెటా కంపెనీ గుడ్ బై చెప్పేస్తోంది. మనం యాప్ మూసేసినా సరే.. వెనకుండి సైలెంట్‌గా పనులు పూర్తి చేసే మైండ్ బ్లోయింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్‌ మెటా మ్యూజ్‌ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఇప్పటివరకు మనం చూసిన ఏఐ చాట్‌బాట్స్‌కి ఇది ఫుల్ నెక్స్ట్ లెవెల్ అవతార్ అనే చెప్పొచ్చు.

సాధారణంగా చాట్‌బాట్‌లు అంటే మనం ఏమైనా ప్రశ్నలను అడిగితే టకటకా సమాధానాలు ఇస్తాయి. కానీ ఈ మెటా మ్యూజ్ అలా కాదు. ఇది ఒక పక్కా పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్‌లా పని చేస్తుంది. మనకు కావాల్సిన పని కోసం దీనికి మెసేజ్ ఇస్తే చాలు.

దానికి సెక్యూర్ వీఎమ్ అనే ఒక వర్చువల్ కంప్యూటర్ అట్మాస్పియర్‌ను కేటాయించారు. మెటా డెవలప్ చేసిన చాలా పవర్‌ఫుల్ స్పార్క్ అనే ఏఐ(AI) మోడల్ ద్వారా ఇది రన్ అవుతుంది. మనం వాట్సాప్ లేదంటే ప్రత్యేక యాప్స్ ద్వారా మ్యూజ్‌(Muse)కి కమాండ్స్ ఇస్తే చాలు మిగతా విషయాలన్నీ అదే హ్యాండిల్ చేస్తుంది.

మెయిన్‌గా ఈమెయిల్స్ పంపడం, ఫ్లైట్ ,హోటల్ ట్రావెల్ బుకింగ్స్ చేయడం వంటి డైలీ టాస్క్‌లను కూడా చాలా ఈజీగా ఆటోమేటిక్ ప్రాసెస్‌లో ఈ పనులన్నీ చేసేస్తుంది. అంతే కాదు ఒక పెద్ద గోల్ ఇస్తే దాన్ని చిన్న చిన్న స్టెప్స్‌గా విడగొట్టి మరీ ఒక మాస్టర్ ప్లాన్‌ను రెడీ చేసి పనులను ఫినిష్ చేస్తుంది. అన్నిటికన్నా కిక్కిచ్చే ఫీచర్ ఏంటంటే.. మనం యాప్ క్లోజ్ చేసేసి వేరే యాప్స్‌లోకి వెళ్లి వేరే పనులు చూసుకుంటున్నా లేదా నిద్రపోతున్నా.. ఇది మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది.

అయితే ఏఐ ఏజెంట్‌కి ఇన్ని పవర్స్ ఇచ్చేస్తే మన ప్రైవసీ పరిస్థితి ఏంటనే అనుమానం ఎవరికైనా వస్తుంది. మెటా దీనికి కూడా ఒక స్ట్రాంగ్ సెక్యూరిటీ సిస్టమ్‌ను డిజైన్ చేసిందట. ప్రతి యూజర్‌కి ఒక సెపరేట్ క్లౌడ్ కంప్యూటర్‌ను ఇవ్వడంతో పాటు సెంటినెల్ అనే మరో స్పెషల్ సెక్యూర్ ఏజెంట్ ఈ మ్యూజ్ చేసే ఇంటర్నెట్ పనులపై 24 హవర్స్ కన్ను వేసి ఉంచుతుంది.

అంతేకాకుండా ఏదైనా కొనేటప్పుడు , కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో మ్యూజ్ మన పర్మిషన్ అడగకుండా ఒక్క అడుగు కూడా ముందుకెళ్లదు. మన పాస్‌వర్డ్స్, పేమెంట్ డిటైల్స్ ఈ ఏఐ మ్యూజ్‌కి డైరెక్ట్‌గా కనిపించకుండా హై-లెవెల్ ప్రైవసీ కోడింగ్ ఉంటుంది. మన మొబైల్‌లో మ్యూజ్ ఏ యాప్స్ వాడాలో, దేనికి పర్మిషన్ ఇవ్వాలో కంట్రోల్ చేసే పని మన చేతుల్లోనే ఉంటాయి.

Meta Muse
Meta Muse

ప్రస్తుతానికి ఈ అద్భుతమైన ఫీచర్ అమెరికాలో ఐఓఎస్, ఆండ్రాయిడ్, వెబ్ వర్షన్లలో అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఈ ఫీచర్‌ను మార్క్ జుకర్‌బర్గ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఏఐ గ్లాసెస్‌కి కూడా లింక్ చేయబోతున్నారట.

బేసిక్ ఫీచర్ల కోసం ఫ్రీగా వాడుకునే అవకాశంతో పాటు, అడ్వాన్స్‌డ్ పనుల కోసం సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను కూడా ప్రవేశపెట్టారు. మొత్తానికి ఈ మెటా మ్యూజ్ టెక్నాలజీ వరల్డ్‌లోనే ఒక సరికొత్త సెన్సేషన్‌కు తెర తీసిందనే చెప్పాలి. ఇకపై మనుషుల శ్రమ తగ్గించే ఇలాంటి ఏఐ రెవల్యూషన్ మన ఫ్యూచర్‌ను ఎలా మార్చబోతోందో చూడాలి మరి.

Age For Marriage : పెళ్లికి ఏజ్ ఒక్కటే సరిపోదా?..మ్యారీడ్ లైఫ్‌ను లీడ్ చేసే మెచ్యూరిటీ ఉండాలా?

Related Articles

Back to top button