Thermal Bill : థర్మల్ బిల్లుతో ఇంత ప్రమాదమా? ఆ ఉద్యోగులు డేంజర్లో ఉన్నారా?
Thermal Bill : ఒక సాధారణ థర్మల్ రిసిప్ట్‌పై ఉండే BPA పరిమాణం, డబ్బాల్లో ప్యాక్ చేసిన ఆహార పదార్థాల కంటే వందల రెట్లు ఎక్కువగా ఉంటుందట.
Thermal Bill
మనం మార్కెట్‌కో లేక సూపర్ మార్కెట్, హోటల్‌కో వెళ్లినప్పుడు బిల్లింగ్ కౌంటర్లో ఇచ్చే పేపర్ బిల్‌ను చాలా క్యాజువల్‌గా చేతుల్లోకి తీసుకుంటాం. అయితే అదే పేపర్ మీ బాడీలోకి ఒక విషపూరిత కెమికల్‌ను పంపుతోందని తాజా రిపోర్ట్స్ హెచ్చరిస్తున్నాయి.
ఈ రోజుల్లో షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు,ఏటీఎమ్ ట్రాన్జాక్షన్ స్లిప్, బిజినెస్ కౌంటర్లలో వాడే బిల్లులు ఇవేమీ కూడా మామూలు ఇంక్‌తో ప్రింట్ అవ్వవు. అవన్నీ థర్మల్ పేపర్(Thermal Bill) అనే ఓ ప్రత్యేకమైన కెమికల్ కోటింగ్ ఉన్న పేపర్ ద్వారా వస్తాయి. ఈ కాగితాన్ని కేవలం చేతులతో పట్టుకోవడం వల్లే దానిలోని బిస్ఫెనాల్-ఎ (BPA) లేదా బిస్ఫెనాల్-ఎస్ (BPS) అనే డేంజరస్ కెమికల్స్ మీ స్కిన్ ద్వారా డైరెక్టుగా బ్లడ్లోకి ఇంకిపోతాయని అంతర్జాతీయ పరిశోధనలు వార్నింగ్ ఇస్తున్నాయి.
ఇంతకీ ఈ BPA లేదా BPS ఏం చేస్తాయనే ప్రశ్న చాలామందిని వేధిస్తుంది. మన బాడీలో హార్మోన్ల బ్యాలెన్స్‌ను దెబ్బతీసే ఎండోక్రైన్ డిస్రప్టర్లుగా ఇవి పనిచేస్తాయి. వీటివల్ల ప్రత్యుత్పత్తి సమస్యలు, ఊబకాయం, థైరాయిడ్ వైఫల్యాలు , డయాబెటిస్ వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కొన్ని పరిశోధనల ప్రకారం, ఒక సాధారణ థర్మల్ రిసిప్ట్(Thermal Bill)పై ఉండే BPA పరిమాణం, డబ్బాల్లో ప్యాక్ చేసిన ఆహార పదార్థాల కంటే వందల రెట్లు ఎక్కువగా ఉంటుందట. దీనిని చేతులకు శానిటైజర్లు, మాయిశ్చరైజర్లు రాసుకుని ఈ బిల్లును పట్టుకుంటే, స్కిన్ ద్వారా ఈ కెమికల్స్ ఇంకిపోయే గుణం పది రెట్లు వేగవంతం అవుతుందట.
ఈ ముప్పు వల్ల సాధారణ కస్టమర్ల కంటే కూడా డైలీ వందలాది బిల్లులు ప్రింట్ చేసి ఇచ్చే క్యాషియర్లు, బిజినెస్ కౌంటర్ల వద్ద పనిచేసే ఉద్యోగులు, అలాగే ఏటీఎమ్‌ల దగ్గర నైట్ షిప్ట్ చేస్తూ అక్కడ పడుకునేవాళ్లే ఎక్కువ డేంజర్లో పడుతున్నారు.

డైలీ ఈ స్లిప్స్‌ను పట్టుకోవడం వల్ల వాళ్ల బ్లడ్‌లో, యూరిన్‌లో ఈ బిస్ఫెనాల్స్ (Bisphenols) మోతాదు సాధారణ ప్రజల కంటే 3నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గర్భవతులు, పాలిచ్చే తల్లులు , చిన్న వయసులోనే కౌంటర్లలో పనిచేసే యూత్‌పై ఈ కెమికల్స్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండే అవకాశముందని అంటున్నాయి.
దీనికి చెక్ పెట్టడానికి పేపర్ రిసిప్ట్ బదులు వాట్సాప్ లేదంటే ఈమెయిల్ రూపంలో వచ్చే డిజిటల్ లేదా ఈ-రిసిప్ట్‌లను మాత్రమే తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ పేపర్ బిల్లు తప్పనిసరి అయితే దానిని చేతినిండా పట్టుకోకుండా ఫోల్డ్ చేసి వెంటనే పక్కన పెట్టేయాలి. బిల్లు పట్టుకున్న వెంటనే చేతులు కడుక్కోవాలి. అలాగే ఇదే వర్క్ ప్లేస్‌లో ఉండేవాళ్లు చేతికి గ్లౌజులు ధరించడం లేదంటే ఫినాల్-ఫ్రీ (Phenol-free) పేపర్స్‌ను వాడాలి. ఇలా చేయడం వల్ల ఈ విషపూరిత కెమికల్స్ నుంచి హార్మోన్లను, ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు అవుతుంది.
Hangry : ఆకలేస్తే కోపం వస్తోందా.. ఆకలి కోపానికి బ్రేక్ వేసే సింపుల్ సైకాలజీ ట్రిక్స్..





