Living Together : లివ్ ఇన్ లేదా పెళ్లికి ముందు కలిసి ఉంటున్నారా? ఈ 3 ప్రశ్నలకు ఆన్సర్స్ తెలుసుకోండి..
Living Together : నేను అనే స్వేచ్ఛ నుంచి మనం అనే బాధ్యతలోకి మారేటప్పుడు వచ్చే రెస్పాన్సిబులిటీని ఎలా హ్యాండిల్ చేయాలనేది పార్ట్నర్స్ చర్చించుకోవాలి.
Living Together
ప్రేమికులు ఒకే ఇంట్లో కలిసి ఉండాలని అనుకోవడం అలాగే పెళ్లికి ముందే సహజీవనం (Living Together) ప్రారంభించడమనేది ఈరోజుల్లో కామన్‌గా కనిపిస్తున్నా కూడా ఇది చాలా పెద్ద నిర్ణయం. బయటకు ఇది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో.. లాంగ్ రన్లో అది సక్సెస్ కావడానికి అంతే జాగ్రత్తగా ముందడుగు వేయాల్సి ఉంటుంది.
చాలామంది ఫారిన్లో లేదా సిటీలలో పార్ట్నర్స్ కలిసి ఉండటానికి(Living Together) ప్లాన్స్ చేసుకునేటప్పుడు బడ్జెట్, ఇల్లు వంటి సాధారణ విషయాల గురించే ఆలోచిస్తుంటారు. కానీ సైకాలజీలో ఈ విషయం గురించి ఒక సరికొత్త యాంగిల్‌ని బయటకు వచ్చింది. ఒక ఇంట్లో అడుగుపెట్టే ముందు ప్రతీ జంట తప్పకుండా 3 విచిత్రమైన, కానీ అత్యంత కీలకమైన ప్రశ్నలను తప్పనిసరిగా చర్చించుకోవాలని సైకాలజీ చెబుతోంది
దీనిలో నేను అనే స్వేచ్ఛ నుంచి మనం అనే బాధ్యతలోకి మారేటప్పుడు వచ్చే రెస్పాన్సిబులిటీని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఫస్ట్ ప్రశ్న. కలిసి జీవించడమనేది ఎంత అందంగా ఉంటుందో, అదే టైమ్‌లో మన సొంత అలవాట్లు, మన పర్సనల్ స్పేస్, డైలీ రొటీన్‌ను వదులుకోవాల్సి రావడం వల్ల ఒక రకమైన తెలియని నిరాశ, బాధ (Grief) మనసులో ఏర్పడతాయి.
ఇప్పటివరకు ఎంతో ఇండిపెండెంట్‌గా ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా మరొకరితో జీవితాన్ని షేర్ చేసుకునేటపుడు ఈ ఎమోషనల్ చేంజ్ రావడం చాలా కామన్. ఈ విచిత్రమైన ఫీల్‌ని ఎదుర్కొనే టైమ్‌లో పార్ట్నర్ సపోర్ట్ ఇవ్వాలి.
ఇక ఒకరికొకరు ఎంతవరకు ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చుకోగలరనేది రెండో ప్రశ్న. ఒకరిని ఒకరు ఎంత ప్రేమించినా, ఎంత కేరింగ్‌గా ఉన్నా కూడా.. ఎప్పుడూ పార్ట్నర్ కోసం అవైలబిలిటీగా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. దానికి తోడు ఏ మనుషులకైనా కొద్ది రోజులు మైండ్ ప్రాపర్ ఎనర్జీతో ఉండకపోవచ్చు.
అలాంటి టైమ్‌లో పార్ట్నర్ ఎలా ప్రవర్తిస్తారనేది క్లారిటీ తీసుకోవాలి. పక్క రూమ్‌లోకి వెళ్లిపోయి మీరొక్కరే ప్రశాంతంగా ఒంటరిగా ఉంటారా? లేక పార్ట్నర్ను వారి ఫ్రెండ్‌తో మాట్లాడుకొని రిలీఫ్ అవ్వమని చెబుతారా? అనేది ముందే కనుక్కోవాలి. ఎందుకంటే ఓవర్ ఎమోషనల్ డిమాండ్స్ వల్ల రిలేషన్షిప్లో విసుగు (Compassion Fatigue) వచ్చి, చివరికి ఆ ప్రేమకథ ముగిసిపోయే ప్రమాదముంటుంది.

పార్ట్నర్స్ ఇద్దరి మధ్య ఉండే పవర్ డైనమిక్స్ (Power Dynamics)ను ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది మూడో ప్రశ్న. ఒకే ఇంట్లో ఉండేటప్పుడు ఒకరిది పైచేయిగా మారే ఛాన్స్ చాలా చిన్నచిన్నగా తలెత్తుతాయి. ఆ ఇల్లు ఒకరి పేరు మీద ఉండటం, ఇద్దరి శాలరీలు మధ్య పెద్ద తేడా ఉండటం, ఇంట్లో పనులను పెంపుడు జంతువుల బాధ్యతలను ఒకరే ఎక్కువ చూసుకోవడం..ఇలాంటివే పవర్ ఇంబ్యాలెన్స్కి దారితీస్తాయి.
వీటన్నిటిని ముందుగానే పార్ట్నర్స్ ఇద్దరూ ఓపెన్‌గా మాట్లాడుకోకపోతే, తర్వాత ఎదురయ్యే చిన్న చిన్న అసంతృప్తులు మనసులోనే ఉండిపోయి రానురాను గొడవలకు, ఒకరిపై ఒకరికి అయిష్టానికి దారి తీస్తుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి లివ్ ఇన్ రిలేషన్లో ఉండాలనుకునేవారు, పెళ్లి చేసుకోవాలని అనుకున్న పార్ట్నర్స్ ప్రశాంతంగా కూర్చుని ఈ మూడింటిపై ఓపెన్‌గా మాట్లాడుకున్నాకే ముందడుగు వేయడం చాలా అవసరమని సూచిస్తున్నారు.
Constructive Mind Game : బంధం విడిపోవడానికి బ్రేకప్.. మరి కన్స్ట్రక్టివ్ మైండ్ గేమ్ గురించి తెలుసా?





