Bigg BossJust EntertainmentLatest News

Bigg Boss Nominations : బిగ్ బాస్ నామినేషన్ల రచ్చ.. కంటెస్టెంట్ల మధ్య కొట్టుకునేంత గొడవ

Bigg Boss Nominations : ఈసారి నామినేషన్లు ఊహించిన దానికంటే వేయ్యి రెట్లు ఎక్కువ హీటెక్కిపోయాయి. మాటల యుద్ధం కాస్తా కొట్టుకునే వరకు వెళ్లేలా కనిపించడం, కన్నీళ్లు, క్యారెక్టర్ రోలింగ్‌లతో బిగ్ బాస్ హౌస్ అంతా ఒక రేంజ్‌లో రగిలిపోయింది.

Bigg Boss Nominations

వీకెండ్ ఎపిసోడ్స్ రెండూ ఇలా వెళ్లిపోవడమే ఆలస్యం, బిగ్ బాస్ హౌస్‌లో సోమవారం రోజు జరిగే నామినేషన్స్ పైనే అందరి చూపు ఉంటుంది. ఎందుకంటే హౌస్‌మేట్స్ ఆ 6 రోజులు వేసుకున్న ముసుగులు పూర్తిగా తొలగిపోయి, అసలు రంగులు బయటపడేది నామినేషన్స్ రోజే. అయితే ఈసారి నామినేషన్లు(Bigg Boss Nominations) ఊహించిన దానికంటే వేయ్యి రెట్లు ఎక్కువ హీటెక్కిపోయాయి. మాటల యుద్ధం కాస్తా కొట్టుకునే వరకు వెళ్లేలా కనిపించడం, కన్నీళ్లు, క్యారెక్టర్ రోలింగ్‌లతో బిగ్ బాస్ హౌస్ అంతా ఒక రేంజ్‌లో రగిలిపోయింది.

ముందుగా హౌస్‌లో సృష్టి, త్రిగుణ్‌.. సుధీర్ మాట్లాడుకోవడంతో ఎపిసోడ్ స్టార్ట్ అయింది. మరోవైపు సుధీర్, వర్షిణి కూడా ఒకరినొకరు క్లారిఫికేషన్‌లు ఇచ్చుకుంటూ మాట్లాడుకున్నారు. ఇక స్టార్టింగ్‌లోనే దేబ్జానీకి, రామ్ ప్రసాద్‌కి మధ్య చిన్న కాఫీ గొడవ నడిచింది. ఆ తర్వాత బిగ్ బాస్ ముకేశ్‌ను సీక్రెట్ రూమ్‌కి పిలిచి ఒక మైండ్ గేమ్ ఆడారు.

ముకేశ్ అతని ముందు టెంప్టేషన్స్ అండ్ టెన్షన్స్ కార్డు ఉంచి, ఈ వీక్ నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందే ఆఫర్ ఇచ్చారు. అయితే దీనికి ఒక కండిషన్ పెట్టారు.. ఝాన్సీ దగ్గర ఉన్న ఇమ్యూనిటీని తీసేయాలి లేదంటే ఆమె కెప్టెన్సీని త్రిగుణ్‌కి ఇవ్వాలని 2 ఆప్షన్స్ ఇచ్చారు. దీనికి ముకేశ్ ఏ మాత్రం ఆలోచించకుండా ఝాన్సీ ఇమ్యూనిటీని క్యాన్సిల్ చేయడానికే ఇంట్రస్ట్ చూపిస్తూ బయటకొచ్చి ఇదే విషయం ఝాన్సీకి చెప్పాడు. ఝాన్సీ కూడా కూడా స్పోర్టివ్‌గా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఇక అసలైన నామినేషన్ల రచ్చ మొదలైంది. ముకేశ్ ఇమ్యూనిటీ వల్ల అతనికి నామినేషన్ల నుంచి సేఫ్ కార్డు దొరికింది. ఆ తర్వాత ఎవరు నామినేషన్లలో పాల్గొనాలో తేల్చడానికి బిగ్ బాస్ ఎన్వలప్ గేమ్ పెట్టారు. ముకేశ్.. రామ్ ప్రసాద్, చరణ్ పేర్లు చెప్పగా.. చివరికి రామ్ ప్రసాద్ మాత్రమే నామినేషన్‌కు అర్హత సాధించాడు. అతనికి వచ్చిన ఎన్వలప్‌లో రెండు నామినేషన్లు(Bigg Boss Nominations) తనే చేయొచ్చు లేదంటే ఒకటి తను చేసి ఇంకోటి వేరేవారికి ఛాన్స్ ఇవ్వొచ్చని ఉంది. దీంతో రామ్ ప్రసాద్ .. వంశీ పేరు ఎంచుకుని, ఫుడ్ విషయంలో అనవసరంగా అరుస్తున్నాడని చెప్పాడు. ఇదే విషయంలో వంశీకి వర్షిణి, దేబ్జానీతో పెద్ద గొడవే జరిగింది.

రామ్ ప్రసాద్ తన రెండో నామినేషన్ ఛాన్స్‌ను రోహిత్‌కు ఇచ్చాడు.దీంతో రోహిత్ ..సుధీర్‌ని నామినేట్ చేస్తూ వర్షిణి అతడిని పూర్తిగా కంట్రోల్ చేస్తోందంటూ పాత విషయాలను గుర్తు చేశాడు. అయితే ఈ మధ్యలోకి సృష్టి పేరు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ పూర్తిగా మారిపోయింది.

సుధీర్, సృష్టి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. తన క్యారెక్టర్‌ని బ్యాడ్ చేస్తున్నాడని తానే సుధీర్ వెనక తిరిగానని అబద్ధాలు చెబుతున్నాడంటూ సృష్టి ఏడ్చేసింది. అంతే కాదు పళ్లు రాలుతాయి, గుద్దుతా.. పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు అంటూ సుధీర్‌పై విరుచుకుపడింది. ఈ గొడవలోకి సుధీర్ త్రిగుణ్ పేరును లాగడంతో వారిద్దరూ షర్ట్ పట్టుకుని కొట్టుకునే రేంజ్‌కి వెళ్లారు. ఆ తర్వాత అమన్, సుధీర్‌ మధ్య కూడా ఓ రేంజ్‌లో తిట్ల పురాణం సాగింది.

Bigg Boss Nominations
Bigg Boss Nominations

దీని తర్వాత వర్షిణికి నామినేషన్ చేసే ఛాన్స్ రావడంతో షాలిని, సుధీర్‌ని నామినేట్ చేసింది. దీంతో సుధీర్ అమన్ పేరును ప్రతిపాదించాడు. ఆ తర్వాత చరణ్‌కి ఛాన్స్ రావడంతో, తనకు వచ్చిన రెండు ఆప్షన్లలో ఒకదాన్ని దేబ్జానీకి ఇచ్చి, రెండో దానితో ఝాన్సీని నామినేట్ చేశాడు. రైతు బిడ్డ అని ఎక్కువ ప్రమోట్ చేసుకోవద్దని, షర్ట్, టవల్ వేసుకోవడం తప్పుగా అనిపించిందని చరణ్ చెప్పగా.. తాను రైతు బిడ్డనే, తన ఇష్టం వచ్చినట్లు ఉంటానని ఝాన్సీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మరోవైపు దేబ్జానీ తనకొచ్చిన ఛాన్స్‌తో త్రిగుణ్ తన కాఫీ దొంగతనం చేశాడనే కారణంతో అతనిపై నామినేషన్ వేసింది.

ఎపిసోడ్ ముగిసే టైమ్‌కు హౌస్‌లో పొగలు మండుతూనే ఉన్నాయి. చివర్లో చరణ్ అమన్‌తో మాట్లాడుతూ.. ..అసలు హౌస్‌లో 14 మంది ఉంటే, జస్ట్ నలుగురి ఓట్లతోనే ముకేశ్‌కి స్టార్ ప్లేయర్ ట్యాగ్ ఎలా ఇచ్చేశారటూ బిగ్ బాస్ నిర్ణయంపైనే సెటైర్లు వేశాడు. మొత్తానికి ఈ వీక్ నామినేషన్ల ప్రక్రియ ఇక్కడితో ఆగగా, తర్వాత వచ్చే ఎపిసోడ్‌లో ఈ యుద్ధం ఎన్ని మలుపులు తిరగడం గ్యారంటీగా కనిపిస్తోంది.

YouTube Monetization : యూట్యూబ్ క్రియేటర్లకు మళ్లీ షాక్..మారిన మోనిటైజేషన్ రూల్స్‌తో డబ్బులు సంపాదించడం ఈజీ కాదా?

Related Articles

Back to top button