Bigg Boss : బిగ్‌బాస్ హౌస్‌లో ఎమోషనల్ డ్రామా.. లెటర్స్ కోసం కన్నీళ్లు, మైండ్ గేమ్స్..
Bigg Boss : స్విమ్మింగ్ పూల్‌లో దూకి బ్యాగులను తీసుకువచ్చి తమ కలర్ ప్లేమ్స్లో పడేలా విసిరే ఈ పూల్ టాస్క్‌లో అమన్ విన్ అయ్యాడు.
Bigg Boss
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రియాలిటీ షోలో కంటెస్టెంట్ల మధ్య గొడవలే కాదు ఎమోషన్స్ కూడా రోజురోజుకీ మరింత పీక్స్‌కి చేరుతున్నాయి. ఒకవైపు హౌస్ మేట్స్‌కు తమ కుటుంబాల నుంచి వచ్చే లెటర్స్, మరోవైపు కెప్టెన్సీ కోసం, నామినేషన్స్ కోసం ముసుగులు తీసేసి ఇంటి సభ్యులు ఆడే క్రూరమైన మైండ్ గేమ్స్ ఆడియన్స్‌ను టీవీ స్క్రీన్లకు హత్తుకుపోయేలా చేస్తున్నాయి.
ముందు రోజు ఎపిసోడ్లో తన పేరెంట్స్ రాసిన లెటర్‌ను ముకేశ్ నాశనం చేయడంతో దేబ్జానీ వాష్ రూమ్‌లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్వడంతో.. సెప్టెంబర్ 23న జరిగిన ఎపిసోడ్లో ఆ బాధ నుంచి దేబ్జానీని బయటకు తీసుకురావడానికి హౌస్‌లో ఊహించని ఫన్ డ్రామా నడిచింది.
వాష్ రూమ్ నుంచి బయటకు వచ్చిన దేబ్జానీ దగ్గరకు వెళ్లిన నరేష్, రామ్‌ప్రసాద్..ఆమె పేరెంట్స్ రాసిన లెటర్లో ఏముందో చెబుతామంటూ దేబ్జానీ మాట్లాడే డిఫరెంట్ తెలుగును అనుకరిస్తూ కామెడీ చేశారు. వాళ్లు చెప్పిన తీరుకు దేబ్జానీ కూడా తన బాధను మరిచిపోయి నవ్వేసింది. ఇక అదే జోరులో రోహిత్, దేబ్జానీ మధ్య పెళ్లి చూపుల ఎపిసోడ్‌ను క్రియేట్ చేసి హౌస్ అట్మాస్పియర్‌ను కాసేపు చాలా తేలికగా మార్చేశారు.
ఈ నవ్వుల హంగామా తర్వాత బిగ్‌బాస్(Bigg Boss) ఊహించని సర్ప్రైజ్ ఇస్తూ తన తండ్రితో ఉన్న పాత ఫోటోను ముకేశ్‌కు పంపించాడు. ఊహించని ఈ గిఫ్ట్ చూసి ముకేష్ ఆనందంతో ఉప్పొంగిపోయి బిగ్‌బాస్‌కు పదేపదే థ్యాంక్స్ చెప్పాడు.
మరోవైపు వంట చేసే టైమ్‌లో క్రమశిక్షణ తప్పినందుకు గానూ వంశీ, త్రిగుణ్‌కు ఈ వీకెండ్లో వచ్చిన నాగార్జున ఒక రోజంతా మూతికి ప్లాస్టర్ వేసుకోవాలని ఫనిష్మెంట్ విధించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ ఝాన్సీ ఈ విషయాన్ని గుర్తు చేయగా త్రిగుణ్ ఆమెతో అనవసరంగా కాసేపు ఆర్గ్యూకి దిగాడు. దాంతో ఝాన్సీ బిగ్‌బాస్‌ను ప్లాస్టర్లు పంపాలని కోరగా, వెంటనే బిగ్‌బాస్(Bigg Boss) పంపిన ప్లాస్టర్లను వారిద్దరి నోటికి వేయడంతో కిచెన్ రచ్చకు కాసేపు బ్రేక్ పడింది.
ఇక ఈ ఎపిసోడ్లో అసలైన డ్రామా అంతా కెప్టెన్సీ కంటెండర్ కోసం పెట్టిన టెంప్టేషన్ టాస్క్‌తో మొదలైంది. గతంలో ఆడి గెలిచిన ముకేశ్, ఓడిపోయిన దేబ్జానీకు ఈ ఆట ఆడే అర్హత లేదని బిగ్‌బాస్(Bigg Boss) తేల్చేశాడు. వీరిద్దరినీ సంచాలకులుగా నియమించగా, బజర్ మోగగానే వర్షిణి, అమన్ ఆడటానికి రెడీ అయ్యారు.
స్విమ్మింగ్ పూల్‌లో దూకి బ్యాగులను తీసుకువచ్చి తమ కలర్ ప్లేమ్స్లో పడేలా విసిరే ఈ పూల్ టాస్క్‌లో అమన్ విన్ అయ్యాడు. గెలిచిన అమన్‌కు బిగ్‌బాస్ సీక్రెట్ ఫోన్ కాల్ చేసి..మీ అమ్మ నీకు ఎంతో ఇష్టమైన హోమ్లీ ఫుడ్ పంపించారని చెబుతాడు.
అయితే అది నీకు కావాలంటే షాలినీకి వాళ్ల అక్క రాసిన లెటర్‌ను కానీ రోహిత్‌కు వాళ్ల అమ్మ, చెల్లి పంపిన లేఖను కానీ నాశనం చేయాలని కండిషన్ పెట్టాడు. దీంతో అమన్ మైండ్ గేమ్ ఆడి రోహిత్ ఉత్తరాన్ని నాశనం చేయడానికి రెడీ అయ్యాడు.అయితే కళ్లముందే ఇంట్లో వాళ్లు రాసిన ఉత్తరం ముక్కలైపోవడంతో రోహిత్ బాగా ఎమోషనల్ అయ్యాడు.

ఆ తర్వాత జరిగిన రెండో టెంప్టేషన్ రౌండ్లో రోప్ సాయంతో మెటల్ బాల్స్ లాక్కొని, టైల్స్ పగలగొట్టి, ఆ చెక్క పీసులతో టవర్ కట్టే టాస్క్‌లో సుధీర్‌పై సృష్టి విన్ అయింది. గెలిచిన సృష్టికి కూడా బిగ్‌బాస్ సీక్రెట్ ఆఫర్ ఇచ్చాడు. అమ్మ పంపిన లెటర్ నీకు దక్కాలంటే వంశీ, త్రిగుణ్‌కు వారి వారి భార్యల నుంచి లెటర్స్‌ను స్మాష్ చేయాలని చెప్పాడు.
దీంతో సృష్టి త్రిగుణ్‌కు టెన్షన్ ఇస్తూ అతని వైఫ్ రాసిన లెటర్ నాశనం చేయడానికి ఓకే చెప్పేసింది. భార్య రాసిన ఉత్తరం చేతికి అందకుండా కాలిపోవడంతో త్రిగుణ్ కంటతడి పెట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఒకవైపు కామెడీగా స్టార్ట్ అయినా ఎండింగ్ మాత్రం ఉత్తరాల కన్నీళ్లు, సెల్ఫిష్ మైండ్ గేమ్‌లతో నిండిపోయింది.





